Editorial

Tuesday, December 3, 2024
Songఅన్నమయ్య సంకీర్తన - పెన్నా సౌమ్య గానం

అన్నమయ్య సంకీర్తన – పెన్నా సౌమ్య గానం

అన్నమాచార్యుల సంకీర్తన. గానం పెన్నా సౌమ్య

హైదరాబాద్ కు చెందిన గాయని పెన్నా సౌమ్య, గృహిణి. స్వరం తనకు వరంగా భావిస్తారు. తొలి ఏకాదశి సందర్భంగా తెలుపు కోసం తాళ్ళపాక అన్నమాచార్యుల కీర్తన పాడి పంపించారు. వినండి…

పల్లవి

నారాయణ తే నమో నమో
నారద సన్నుత నమో నమో

చరణములు

మురహర భవహర ముకుంద మాధవ
గరుడ గమన పంకజనాభ
పరమపురుష భవబంధ విమోచన
నరమృగశరీర నమో నమో

జలధిశయన రవిచంద్రవిలోచన
జలరుహభవనుత చరణయుగ

బలిబంధన గోపవధూవల్లభ
నలినోదర తే నమో నమో

ఆదిదేవ సకలాగమపూజిత
యాదవకుల మోహనరూప
వేదోద్ధర శ్రీవేంకటనాయక
నాదప్రియ తే నమో నమో

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article