Editorial

Sunday, September 22, 2024
కాల‌మ్‌మొదట్లోనే చెప్పినట్టు ... అదే జరుగుతోంది! - 'అంకురం' సుమిత్ర తెలుపు

మొదట్లోనే చెప్పినట్టు … అదే జరుగుతోంది! – ‘అంకురం’ సుమిత్ర తెలుపు

ఇబ్బందుల్లో ఉన్న పిల్లలని సురక్షిత ప్రాంతానికి తీసుకురావడంలో గానీ లేదా అబ్యూసర్స్ చెర నుండి విముక్తుల్ని చేయటానికి, మరే ఇతర సమస్యనుండి అయిన పిల్లల్ని రక్షించడానికి తప్పనిసరిగా పోలీస్ ల సహకారం అవసరమే. కానీ కేంద్ర స్థాయిలో ఏలిన వారు పూర్తిగా ఈ చైల్డ్ లైన్ వ్యవస్థని పోలీసుల బాధ్యతగా చేయతలపెట్టటం ఏ విధంగా సమర్ధనీయం!?

సుమిత్ర మక్కపాటి

నోర్ముయ్….!
నోరెత్తావో – పీక పిసుకుత!!

పిల్లలు తమకి ఏమన్నా కావాలని అడుగుతూ ఏడుస్తుంటే…. వాళ్ళని గద్దించి భయపెట్టటానికి, పిల్లల పట్ల నిర్దయగా కరకుగా ఉండే పెద్దలు వాడే తిట్టు ఇది!!

ఎన్ని ఇబ్బందులు వున్నా…..ఇంతకాలం భారతదేశoలో మహిళలు- పిల్లల సంక్షేమం కోసం ‘మహిళా శిశు సంక్షేమ శాఖ’ పనిచేస్తూ వచ్చింది. ఆ శాఖ కిందనే, పిల్లలకు సంబంధించిన shelter హోమ్ లు, జువెనైల్ హోమ్ లు అవసరతలో ఉన్న vulnerable చిల్డ్రన్ కోసం అనేక welfare hostels, తదితర సేవలు అందుబాటులో ఉంటాయి.

ఈ వ్యవస్థ అంతా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది, అయితే, మొదటినుండి child లైన్, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కి మద్దతుగా పోలీస్ వ్యవస్థ కూడా పనిచేయటం గమనార్హం!!

ఈ దేశంలో, కష్టంలో ఉన్న ఏ బాలబాలికైనా, 1098 అనే ‘చైల్డ్ హెల్ప్లైన్’ ద్వారా చైల్డ్ లైన్ సిబ్బందికి అనగా నేరుగా జిల్లా ‘ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్’ సభ్యులుకు తన సమస్యను వివరించి తగిన సేవలు పొందొచ్చు. ఈ వ్యవస్థ అంతా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంటుంది, అయితే, మొదటినుండి child లైన్, చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కి మద్దతుగా పోలీస్ వ్యవస్థ కూడా పనిచేయటం గమనార్హం!!

ఇబ్బందుల్లో ఉన్న పిల్లలని సురక్షిత ప్రాంతానికి తీసుకురావడంలో గానీ లేదా abusers (సొంత వాళ్ళు అవ్వచ్చు లేదా బయటివాళ్ళు అవ్వచ్చు) చెర నుండి విముక్తుల్ని చేయటానికి, మరే ఇతర సమస్యనుండి అయిన పిల్లల్ని రక్షించడానికి తప్పనిసరిగా పోలీస్ ల సహకారం అవసరమే!!

ఇదంతా ఒకెత్తు అయితే….కేంద్ర స్థాయిలో ఏలిన వారు, పూర్తిగా ఈ చైల్డ్ లైన్ వ్యవస్థని పోలీసుల బాధ్యతగా చేయతలపెట్టటం ఏ విధంగా సమర్ధనీయం!?

ఇదంతా మహిళ శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే ఎంతో కాలంనుండి సమర్థవంతంగానే పర్యవేక్షిస్తుంటే – అర్ధాంతరంగా ఆఘమేఘాలమీద ఆ పనిని పోలీస్ ల నెత్తిమీద పడేసే అంతంటి అవసరం ఏమొచ్చింది!?

పిల్లలపై జరిగే నేరాలను నియంత్రించడం,దోషులకు శిక్షలు పడేలా చేయటం వరకూ పోలీస్ లకు సాధ్యమౌతుంది కానీ, childline సిబ్బంది చేసే పిల్లల కౌన్సెలింగ్, రెఫరల్ సర్వీసెస్, మిస్సింగ్ పిల్లలను తలిదండ్రులు దగ్గిరకి చేర్చడం, జ్యూవెనైల్ హోమ్/ సంక్షేమ హోస్టెల్స్ లో పిల్లలు చేర్చబడినప్పుడు వారి బాగోగులు చూడటం – ఇదంతా మహిళ శిశు సంక్షేమ శాఖ ఇప్పటికే ఎంతో కాలంనుండి సమర్థవంతంగానే పర్యవేక్షిస్తుంటే – అర్ధాంతరంగా ఆఘమేఘాలమీద ఆ పనిని పోలీస్ ల నెత్తిమీద
పడేసే అంతంటి అవసరం అవసరం ఏమొచ్చింది!?

ఇబ్బందుల్లో పడిన పిల్లలకు కావాల్సింది – సరైన సమయంలో స్వాంతన పరిచే కౌన్సిలింగ్ సేవలు, తల్లిఒడి లాంటి రక్షణగృహం, మంచి ఆహారం, ఆరోగ్యం,విద్య బుద్ధులు నేర్పే వాతావరణం, భవిష్యత్ ను భద్రంగా తీర్చి దిద్దే ఒక వ్యవస్థ! అది ప్రభుత్వ మహిళ శిశు సంక్షేమ శాఖ నెరవేరుస్తూనే ఉంది. ఈ వ్యవస్థ లో ఎక్కడైనా లోపాలు ఉంటే సరిచేయాలి గానీ, మొత్తంగా ఆ పనిని తీసుకుపోయి పోలీస్ చేతుల్లో పెడితే జరిగేదేంటి!?

అదే, మొదట్లోనే చెప్పానే… అదే జరుగుతుంది!

అనాలోచిత దయలేని నిర్ణయాలు తీసుకుంటూ పిల్లల్ని బలిపశువులు చేయొద్దని ప్రభుత్వాలకు చెప్పాలి!!

మీరూ ఆలోచించండి, గొంతుకలపండి మిత్రులారా!

సుమిత్ర గారి గురించి పెద్దగా పరిచయం అక్కరలేదు. పిల్లలు, మహిళలు వారికి రెండు కళ్ళు. విద్య, సాధికారత ఆమె నిండు ఆశయాలు. అంకురం వారు స్థాపించిన స్వచ్చంద సంస్థ.

రెండున్నర దశాబ్దాల వారి నిర్విరామ స్వచ్ఛంద సేవ గురించి మూడే మూడు పదాల్లో చెప్పాలంటే ‘ఆదరణ, సంరక్షణ, అభ్యున్నతి’ అని అభివర్ణించవచ్చు. హక్కులతో పాటు బాధ్యతల గురించీ ఎలుగెత్తే సుమిత్ర గారు ‘అంకురం’ తరపున ‘సంకల్పం’, ‘అప్నా ఘర్’లు ఆడపిల్లలకు ఆమె అందించిన అండదండలుగా చెప్పాలి. స్వచ్చంద సేవతో పాటు న్యాయవాదిగానూ వారు బాల బాలికలు, స్త్రీల కోసం పోరాడుతున్నారు.

 

More articles

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article