దేశంలోనే అరుదైన చారిత్రక కట్టడం దేవుని గుట్ట. వందల ఏళ్ల తెలంగాణ చరిత్రకు, అద్భుతమైన మన పూర్వికుల సాంకేతిక పరిజ్ఞానానికి నిలువెత్తు ప్రతీక.
అరవింద్ పకిడె
దేశంలోనే అరుదైన చారిత్రక కట్టడం దేవుని గుట్ట. వందల ఏళ్ల తెలంగాణ చరిత్రకు, అద్భుతమైన మన పూర్వికుల సాంకేతిక పరిజ్ఞానానికి ఇది నిలువెత్తు ప్రతీక.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కంబోడియాలోని అంకోర్ వాట్ కట్టడాల శైలిలో నిర్మించిన దేవునిగుట్ట వాటికంటే ముందరిది, దాదాపు 800 ఏళ్ల పురాతన కట్టడం కావడం విశేషం. ఇలాంటి కట్టడం యావత్ భారతదేశంలో ఇదొక్కటే కావడం, అదీ తెలంగాణలో ఉండటం గర్వకారణం.
ములుగు జిల్లాలోని కొత్తూరు గ్రామంలో ఉన్న దేవునిగుట్ట ఆరు, ఏడవ శతాబ్దాల కాలం నాటి ఈ అద్భుతమైన చారిత్రక నిర్మాణాన్ని చూడటం ఒక కనువిందు. ప్రతిదినం యువకుడు, అన్వేషి – అరవింద్ తన కెమెరా సమేతంగా అందించే ఇలాంటి అపురూప వారసత్వ సంపదకు ఇదే సాదర ఆహ్వానం.
అనేక చారిత్రక ఘట్టాలను వివరించే వందలాది శిల్పాలను రాళ్ల ముక్కలపై చెక్కి వాటన్నింటినీ జోడించి చేసిన నిర్మాణ శైలి ఈ దేవాలయ ప్రత్యేకత.
అరవింద్ పకిడె పాత్రికేయడు, ఫోటోగ్రాఫర్ .
చరిత్ర, సంస్కృతి గురించి నిరంతరం తపనలు పోతూ అందంగా రికార్దు చేసే క్షేత్రస్థాయి అడుగు, కన్ను.
Great job, keep going on…