Editorial

Wednesday, January 22, 2025
స్మరణయాదిచాల పెద్దమ్మ! - అంబటి సురేంద్ర రాజు తెలుపు

చాల పెద్దమ్మ! – అంబటి సురేంద్ర రాజు తెలుపు

మహాశ్వేతా దేవి హైదరాబాద్ కు 1992లో అన్వేషి అతిథిగా వచ్చినప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చింది. సుప్రభాతం పక్షపత్రిక కోసం చేసి ఆ ఇంటర్వ్యూలో ఆమెను ఇదే విషయంపై ఒక ప్రశ్న అడిగాను.

బెంగాలీ మధ్య తరగతి (భద్రలోక్) తల్లుల గొప్పదనం గురించి చెప్పమని! భద్రలోక్ అనే మాట చెవిన పడగానే ఆమెకు సర్రున కోపం వచ్చింది.

అంబటి సురేంద్ర రాజు

మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే కలకత్తా కాళిక నాలిక మహాశ్వేతా దేవి. నిర్దయతో తొణికిసలాడే దయాళువు. క్రూరత్వం అనిపించే కాఠిన్యం ఆమె జీవ లక్షణం. రాతే కాదు మాట కూడా కటువు. కాల్పనికతను ఇసుమంతైనా దరిచేరనివ్వని ధీమతి.

మన కేశవరెడ్డి వలె మధ్యతరగతి ఉనికిని గుర్తించ నిరాకరించిన జీవని. మధ్య తరగతిలో, అదీ అగ్ర కులంలో పుట్టిపెరిగే వారికి ఆ మధ్య తరగతి విలువలను తోసిరాజనడం అంత సులువైన పనికాదు. చలం, కొడవటిగంటి కుటుంబరావు వలె ఆ మధ్య తరగతిని చీల్చి చెండాడటమో. వారి దుర్నీతిని బట్టబయలు చేయడమో చేస్తే అది ఒక సహజ పరిణామం. కానీ తెలుగులో కేశవరెడ్డి, బెంగాలీలో మహాశ్వేతాదేవి తమ రచనా వ్యాసంగాన్ని మధ్య తరగతికి వెలుపల, దానికి బహుదూరంగా, అడవుల్లో, కొండ కోనల్లో, ఊరికి దూరంగా వాడలలో జీవిస్తున్న ఆదివాసులకు అథోజగత్ సహోదరులకు అంకితం చేశారు.

బెంగాలీ సాంస్కృతిక, సాహితీ జీవనాన్ని తీర్చిదిద్దడంలో బెంగాలీ తల్లుల పాత్ర అద్వితీయం. సాహిత్య, తత్వ, సామాజిక, రాజకీయ, నాటక, సంగీత, చిత్రకళ, సినిమా రంగాలలో బెంగాలీల కృషి ఎనలేనిది. దుర్గకు ప్రతిరూపాలే ఆ తల్లులు.

ఉత్తమ సాహితీ సృజనకు స్వీయానుభవం అవసరం లేదని, సహానుభూతి సమపాళ్లలో వుంటే చాలునని తిరుగులేని విధంగా నిరూపించారు. అనుభవం లోపించిన రచనల్లో, పఠనీయత లోపించడం అనేది తెలుగు పాఠకులకు నిత్యానుభవం. బ్రాహ్మణ మధ్యతరగతి నుంచి ఆనాడు, శూద్ర, అతిశూద్ర కులాల నుంచి ఈనాడు పఠనీయత లోపించని పుష్ఠిగల రచనలు వచ్చాయంటే, వస్తున్నాయంటే అందుకు కారణం ఆయా రచయితలకు స్వీయానుభవం కొరవడకపోవడమే. మహాశ్వేతా దేవి, కేశవరెడ్డి ఇందుకు మినహాయింపు. విద్యాధిక, అగ్రకుల, పట్టణ/ నగర మధ్య తరగతిని సాహితీజగత్తు నుంచి మెడపట్టి గెంటివేసిన/ బహిష్కరించిన ఖ్యాతి వారికి దక్కుతుంది.

భారతీయ సాహిత్యంలో ఇదొక మహాద్భుత సన్నివేశం. రాజ్యం చేత తీరని అణచివేత, పీడనలకు పరాయీకరణకు గురవుతూ మనుగడను కోల్పోతున్న ఆదివాసులతో మమేకమై, వారి జీవితాలతో ప్రేరణ పొంది, మేలిమి విలువలు పొదిగిన కథలు, నవలల రూపంలో సో కాల్డ్ ప్రధాన స్రవంతికి తెలియని, తెలిసే అవకాశం లేని వారి ప్రపంచాన్ని ఆవిష్కరించిన అరుదైన రచయిత్రి మహాశ్వేతాదేవి. రాకాసి కోర, ఎవరిదీ అడవి? ఒక తల్లి, బషాయితుడు, ద్రౌపది, ఝాన్సీరాణి, విత్తనాలు వంటి నవలలు, కథానిక సంకలనాలతో తెలుగు పాఠకలోకాన్ని లోతుగా ఆకట్టుకున్న ఒకే ఒక బెంగాలీ రచయిత్రి మహాశ్వేత.
భారతీయ మధ్య తరగతిలో, బెంగాలీ మధ్య తరగతి అత్యంత విశిష్టమైనది.

బెంగాలీ సాంస్కృతిక, సాహితీ జీవనాన్ని తీర్చిదిద్దడంలో బెంగాలీ తల్లుల పాత్ర అద్వితీయం. సాహిత్య, తత్వ, సామాజిక, రాజకీయ, నాటక, సంగీత, చిత్రకళ, సినిమా రంగాలలో బెంగాలీల కృషి ఎనలేనిది. దుర్గకు ప్రతిరూపాలే ఆ తల్లులు. ఎందరో మహానుభావులను కనిపెంచి పెద్దచేసిన చల్లని స్పర్శ ఆ తల్లులది. మహాశ్వేతా దేవి హైదరాబాద్ కు 1992లో అన్వేషి అతిథిగా వచ్చినప్పుడు ఆమెను ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు వచ్చింది. సుప్రభాతం పక్షపత్రిక కోసం చేసి ఆ ఇంటర్వ్యూలో ఆమెను ఇదే విషయంపై ఒక ప్రశ్న అడిగాను.

రచయితకు ఉండాల్సిన చిత్తవృత్తి వ్యాకులత అంటాడు హిందీ మహా రచయిత ప్రేమ్‌చంద్. వ్యాకుల చిత్తంతో తప్ప జీవించని, రచనలు చేయని అనన్య మహా శ్వేత. ఆదివాసీ జీవనంతో అన్యోన్యత సాధించిన అపురూప మహాశ్వేతాదేవి. ఆమె మార్గం దుర్గమం, కానీ అనుసరణీయం.

బెంగాలీ మధ్య తరగతి (భద్రలోక్) తల్లుల గొప్పదనం గురించి చెప్పమని! భద్రలోక్ అనే మాట చెవిన పడగానే ఆమెకు సర్రున కోపం వచ్చింది. అదంతా గతం తాలూకు ఘనకీర్తి అని, ఇప్పుడు ఆ మధ్య తరగతి విద్యాధిక్యం మంట కలిసిందని, సాంస్కృతికంగా ఆ వర్గం మృతప్రాయమైపోయిందని, చరిత్రగతి, ఆ వర్గానికి చెందిన కళాకారులు, రచయితలు, మేధావులను భూస్థాపితం చేసిందని తన అభిప్రాయాన్ని అతిస్పష్టంగా చెప్పారు. మారిన కొలమాన పరిస్థితుల్లో ఆదివాసీ తల్లులను ఇప్పుడు దుర్గ ఆవహించిందని, తమ సంతానాన్ని ఆదివాసీ తల్లులు ఇప్పుడు చదివిస్తున్నారని, సరస్వతి కటాక్షం వారికి సిద్ధించిందని, ముందుముందు రానున్న కాలం ఆదివాసీలదేనని, ఆ రోజు అనతికాలంలోనే చేరువ కానున్నదని ఆమె తేల్చిచెప్పారు.

నక్సల్బరీ పూర్వరంగాన్ని అక్షరబద్ధం చేసిన బషాయితుడు నవల, నక్సల్బరీ వసంత మేఘ గర్జన, సమాజ జీవనంలో తెచ్చిన పరివర్తనను చాటిచెప్పిన ఒక తల్లి నవల, పురుషస్వామ్యపు దుర్నీతిని ఎత్తిచూపిన ద్రౌపది పెద్ద కథ, భూస్వామ్య యుగపు తుట్టతుది అవశేషాలను అధివాస్తవికంగా చిత్రించిన రాకాసి కోర నవల-మహాశ్వేతాదేవి రచనా పటిమకు రూప కౌశలానికి, వామపక్ష రాజకీయ నిమగ్నతకు, చిత్తశుద్ధికి నిదర్శనంగా నిలుస్తాయి. రచయితకు ఉండాల్సిన చిత్తవృత్తి వ్యాకులత అంటాడు హిందీ మహా రచయిత ప్రేమ్‌చంద్. వ్యాకుల చిత్తంతో తప్ప జీవించని, రచనలు చేయని అనన్య మహా శ్వేత. ఆదివాసీ జీవనంతో అన్యోన్యత సాధించిన అపురూప మహాశ్వేతాదేవి. ఆమె మార్గం దుర్గమం, కానీ అనుసరణీయం.

మరో మహాకవి ఎడ్గార్ అలెన్ పో మాటల్లో చెప్పాల్సివస్తే She Loved With a Love that was
more than Love.

( మహాశ్వేతాదేవి సంతకం )

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article