Editorial

Wednesday, January 22, 2025
కథనాలుఈ వర్క షాప్ ఒక 'తొవ్వ' : మహిళా జర్నలిస్టులందరికీ జేజేలు - అల్లం...

ఈ వర్క షాప్ ఒక ‘తొవ్వ’ : మహిళా జర్నలిస్టులందరికీ జేజేలు – అల్లం నారాయణ

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ అల్లం నారాయణ ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ అద్భుతంగా జరిగిందని, దీని విజయానికి మహిళా జర్నలిస్ట్ లను అభినందించారు. రెండు రోజులు జరిపిన చర్చలు భవిష్యత్ మహిళ జర్నలిస్టుల సాధికారతకు ఒక తొవ్వ అని కూడా అన్నారు.

అల్లం నారాయణ

మహిళా జర్నలిస్టులు అందరికీ జేజేలు. తెలంగాణ అస్తిత్వ ఉద్యమంలో మీరు ముందు వరుసలో నిలిచారు. సాధించుకున్న తెలంగాణలో మీ అస్తిత్వం కోసం నిలబడి మరోసారి చైతన్యాన్ని నిరూపించుకొని బ్రహ్మాండంగా వర్క్ షాప్ విజయవంతం చేశారు. అర్థవంతంగా, సారవంతంగా, సమస్యలను సాధించుకునే విధంగా మీరు ఈ రెండు రోజులు జరిపిన చర్చలు భవిష్యత్ మహిళ జర్నలిస్టుల సాధికారతకు ఒక తొవ్వ.

విజయాన్ని గుర్తించుకొని సెలబ్రేట్ చేసుకునే సమయంలో ఇప్పటికి ఫిర్యాదు చేస్తున్నవారు ముందు ఈ ఉత్సవాన్ని స్వంతం చేసుకోండి. ఇది మీ ఉత్సవం, ఇది మీ విజయం, ఇది మీ చైతన్యం, ఇది తెలంగాణ మహిళ జర్నలిస్టులకు అంకితం. Let us celebrate our grand success.

అందరికీ వందనాలు.

శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత

న్యూస్ రాసే జర్నలిస్టులు ‘కోర్’ విలువలు పాటించాలని శాసన మండలి సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత అన్నారు. కోర్ లో సి అంటే క్రెడిబిలిటీ, ఓ అంటే ఆబ్జెక్టివీటీ (విషయం), ఆర్ అంటే రెస్పాన్సిబిలిటీ (బాధ్యత), ఈ అంటే ఎతిక్స్ (విలువలు), ఇవన్నీ ఉంటేనే ఆ వార్తకు సంపూర్ణత వస్తుందని మహిళ జర్నలిస్టులకు తెలిపారు. ఒక వ్యక్తి గురించి రాసేముందు ఒకసారి ఆ వ్యక్తి అభిప్రాయం తెలుసుకునే మర్యాద ఉండాలని అన్నారు.

జర్నలిస్టులకు సంబంధించిన కమిటీలలో ఆడవారి ప్రాతినిధ్యం ఉండేటట్లుగా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ చూడాలని విజ్ఞప్తి చేశారు.

ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కొత్తగా కట్టే సెక్రటేరియట్ లో మహిళా జర్నలిస్ట్ లకు ఒక ప్రత్యేక గదిని ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ గారితో మాట్లాడి మీడియా సంస్థలలో మహిళల పై వేధింపులు, వివక్షను నిరోధించే కమిటీలను వేయించేందుకు ప్రయత్నిస్తానని కూడా హామీ ఇచ్చారు. జర్నలిస్టులకు సంబంధించిన కమిటీలలో ఆడవారి ప్రాతినిధ్యం ఉండేటట్లుగా అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ చూడాలని విజ్ఞప్తి చేశారు.

జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్లు నిధులు ప్రకటించి ఇప్పటివరకు 42 కోట్లు విడుదల చేసిన విషయం ఆమె గుర్తు చేశారు

వరంగల్ లో ఉన్న ఒక మహిళా జర్నలిస్టు చికిత్సకు 75 లక్షలు రూపాయలు ఖర్చు చేసి 11 ఆపరేషన్లు చేయించిన ఘనత కెసిఆర్ ప్రభుత్వానికి ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట్లు నిధులు ప్రకటించి ఇప్పటివరకు 42 కోట్లు విడుదల చేసి దానిపై వచ్చిన వడ్డీతో చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబానికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం, కుటుంబానికి ఐదు సంవత్సరాల పాటు మూడు వేల పెన్షన్, వారి పిల్లల చదువుకు నెలకు వెయ్యి రూపాయలు, ఈ సంక్షేమ నిధి నుండి మీడియా అకాడమీ ఇస్తున్నట్లు గుర్తు చేశారు.n కోవిడ్ వచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న 4000 జర్నలిస్టులకు ఆరు కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు

మహిళా జర్నలిస్టు లు ఎవరైనా తన న్యాయమైన గొంతు వినిపిస్తే దాన్ని ఆపడానికి ‘టెక్ ఫాక్స్’ ద్వారా దానికి వ్యతిరేకంగా లక్షల కొద్దీ ట్వీట్స్ చేసి ఆమెను అణ చడానికి ప్రయత్నిస్తున్నారని ఇది చాలా దురదృష్టకరమని అన్నారు.

శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణి దేవి

మహిళా జర్నలిస్టులకు మగవారి కున్న స్వేచ్ఛ, వెసులుబాటు లేకున్నా పట్టుదలతో ప్రతి అడ్డంకిని అధిగమించి తమ విధులను నిర్వహిస్తే మంచి గుర్తింపు వస్తుందని శాసన మండలి సభ్యురాలు శ్రీమతి వాణి దేవి అన్నారు.

తన తండ్రి మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు గారు అన్ని పాత్రలు తానే పోషించి పత్రికను నడిపారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ధన్య రాజేంద్ర మాట్లాడుతూ…

జాతీయ స్థాయి సీనియర్ జర్నలిస్ట్ ధన్య రాజేంద్ర మాట్లాడుతూ తెలుగులో మహిళ ప్రాధాన్యమున్న అభివృద్ధి పథంలో స్వతంత్రంగా progressive,liberal feminist మీడియా సంస్థలు రావాలని అన్నారు.
తాను టైమ్స్ నౌ లో పని చేస్తున్నప్పుడు ఏ విధంగా వేధింపబడ్డారో ఈ సందర్భంగా తెలిపారు. ఇన్కమ్ టాక్స్ వాళ్ళు సంబంధంలేని నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టారని తర్వాత అవన్నీ నీ తప్పని అని తేలిపోయింది అని అన్నారు. మహిళా జర్నలిస్టు పెద్ద మీడియా సంస్థలు స్థాపించే ముందు నిధులు సమకూర్చుకోవడం, విశ్వాసనీయత ఉన్న వార్తలు భయం లేకుండా రాయాలని సూచించారు.

ప్రొఫెసర్ మాలిని సుబ్రమణ్యం

మరో సీనియర్ జర్నలిస్ట్ ప్రొఫెసర్ మాలిని సుబ్రమణ్యం మాట్లాడుతూ తాను చత్తీగడ్, బస్తర్ జిల్లాలో గిరిజనుల జీవన విధానం తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు పోలీసులు ఏ విధంగా అడ్డుకొని మళ్లీ రాకుండా ప్రయత్నించిన విషయం గుర్తు చేసుకున్నారు. అటువంటి సమయంలో తెలంగాణ తనను అక్కున చేర్చుకొని ఆదరించడం మరువలేనని అన్నారు.

మహిళ జర్నలిస్టులు అందరూ ఏకమై కృషి చేస్తే తమకు కావాల్సిన సౌకర్యాలు సమకూర్చుకోవచ్చని సూచించారు.

మహిళా జర్నలిస్టు లకు సర్టిఫికెట్లు అందజేత

మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ అల్లం నారాయణ అతిధులను పరిచయం చేస్తూ రెండు రోజుల మహిళా జర్నలిస్టుల వర్క్ షాప్ అద్భుతంగా జరిగిందని, దీని విజయానికి మహిళా జర్నలిస్ట్ లను అభినందించారు. వర్క్ షాప్ లో పాల్గొన్న మహిళా జర్నలిస్టు లకు అతిథులు సర్టిఫికెట్లు అందజేశారు.

ఈ కార్యక్రమాన్ని సీనియర్ మహిళా జర్నలిస్టులు కట్ట కవిత, సుమబాల ,స్వేచ్ఛ నిర్వహించారు.

అల్లం నారాయణ, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article