కుల మత జాతి ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరినీ తల్లి ఒడిలా అక్కున చేర్చుకున్న హైదరాబాద్ ని కీర్తిస్తూ మధురంగా ఆలపించిన ఈ సమస్త జాతి గీతం నిజానికి నూతన సంవత్సర ఆహ్వాన గీతిక. మకర సంక్రాంతి కానుక. మహమ్మారికి జాడ లేకుండా ఉండాలన్న స్వప్నానికి ప్రతీక.
కందుకూరి రమేష్ బాబు
కరోనా విలయం ప్రారంభంలో వలస కార్మికుల గోసను కళ్ళకు కట్టిన ఆదేశ్ రవి ఒక లెజెండరీ పోయెట్. ప్రొఫౌండ్ సింగర్. నిజానికి దేశం గర్వించదగ్గ నేటివ్ లీడర్. తాను స్వల్ప పదాలతో అనల్ప కార్యం నెరవేరుస్తాడు. నిశ్శబ్ధంగా గుండె తడిమి గాయాలకు మలాం పూస్తాడు. తక్షణం కార్యచారణలోకి ఉరికిస్తాడు. అతడి ‘పిల్ల జెల్ల…ముసలి తల్లి’ పాట ఎవరు మరచిపోతారు? ఆ పాట ఒక అనధికార శాసనమై కోట్లాది వలస కార్మికులను అదుకునేలా చేయడం ఇప్పటికీ పచ్చి జ్ఞాపకం.
ఆ పాట మంచి నీళ్ళు ఇచ్చింది. అన్నం పెట్టింది. తిరుగు ప్రయణానికి వాహనాలు పెట్టింది. అంతగా కదిలించిన ఆ కవి గాయకుడి తాజా ఆర్తిగీతం – “నగరం నగరం …మన భాగ్యనగరం”.
ఇది ఒక ఉపశమన గీతం. నగరపు ఆత్మ గౌరవ వేడుక.
ఆర్ద్రతను దాటి మార్దవంగా మన గుండెలకు హత్తుకునే ఈ ప్రేమ గీతంలో ఎక్కడా ఒక పావురం కనపడదు. చార్మినార్ అన్న పదమూ లేదు. ఆధునిక ప్రతీకలేవీ వచ్చి చేరలేదు. కానీ ఇది మొత్తం శతాబ్దాల నగరం ఆత్మను ఆహ్లాదంగా ప్రవేశ పెట్టడం విశేషం.
కుల మత జాతి ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరినీ తల్లి ఒడిలా అక్కున చేర్చుకున్న హైదరాబాద్ ని కీర్తిస్తూ మధురంగా ఆలపించిన ఈ సమస్త జాతి గీతం నిజానికి నూతన సంవత్సర ఆహ్వాన గీతిక. మకర సంక్రాంతి కానుక. మహమ్మారికి జాడ లేకుండా ఉండాలన్న స్వప్నానికి ప్రతీక.
ఆర్ద్రతను దాటి మార్దవంగా మన గుండెలకు హత్తుకునే ఈ ప్రేమ గీతంలో ఎక్కడా ఒక పావురం కనపడదు. చార్మినార్ అన్న పదమూ లేదు. ఆధునిక ప్రతీకలేవీ వచ్చి చేరలేదు. కానీ ఇది మొత్తం శతాబ్దాల నగరం ఆత్మను ఆహ్లాదంగా ప్రవేశ పెట్టడం విశేషం. ‘నిదురన్నదే రాని మెలుకువ మన నగరం’ అన్న చరణం రేయింబవళ్ళు పనిచేసే నగర జీవికి గొప్ప నీరాజనం.
మన నగరాన్ని ‘స్వేచ్ఛా విహంగం’ గా, ’ఆపన్న హస్తం’గా మాత్రమే గాక ‘దేశానికే దిక్సూచి’గానూ కీర్తిస్తూ ఆదేశ్ రవి మన భాగ్య నగరాన్ని తేట తెలుగులో సమున్నతంగా సెలబ్రేట్ చేయడం తెలంగాణ రాష్ట్రంలో ఒక ముందడుగు. కవి గాయకుడికి తెలుపు అభినందనలు.
Congratulations to Adesh ravi garu