Editorial

Wednesday, January 22, 2025
కాల‌మ్‌ఈ వారం వజ్రాల వాన : ‘సూరజ్’ కా సాత్వా ఘోడా

ఈ వారం వజ్రాల వాన : ‘సూరజ్’ కా సాత్వా ఘోడా

నీ ఇల్లు బంగారంగానూ! ఆగండాగండి! ఇల్లేంటండీ బాబూ! ఏకంగా ఇంట్లో ఫర్నిచర్, ఒంటిపై నగలు, బిల్డింగులు, ఆకాశహార్మ్యాలు, కార్లు, రోడ్లు, ఒకటేమిటి? ఇలా అన్నీ! ఛఛ, చీప్ గా బంగారమేంటి! ఎంచక్కా వజ్రాలతోనే సింగారించేసుకోవచ్చు! కాకపోతే మన భూవాతావరణం కొంచం మారితే చాలు! కుండపోతగా వజ్రాలవానలే కురిపించేయొచ్చు! అదేంటి, ఆమ్ల వర్షాలు పడతాయి ఓకే! రాళ్ళ వానలు కూడా చూసినవే, డబలోకే! మరీ వజ్రాల వానలేంటబ్బా? అని జుట్టు పీక్కుంటున్నారా? అవసరం లేదండీ, ఇట్ ఈజ్ ట్రూ! అవర్ సైంటిస్ట్స్ ప్రూవ్డ్ ఇట్ సక్సెస్ ఫుల్లీ అండ్ మేడ్ డైమండ్ రెయిన్స్ హ్యాప్పెన్, ఇన్ లాబొరేటరీ! టు నో దిస్ క్యూరియస్ ఫ్యాక్ట్, జస్ట్ ఫాలో ది స్టోరీ!

సూరజ్ వి. భరద్వాజ్

వజ్రాలవానల గురించి తెలియాలంటే సౌరవ్యవస్థలో సుదూరంగా విసిరివేయబడ్డట్లండే యురేనస్, నెప్ట్యూన్ గ్రహాల వాతావరణ పరిస్థితులను పరిశీలించాలి. వీటి ఉపరితలం సమతలంగా ఉండి, 5 వేల కిలోమీటర్ల మేరకు వాతావరణం విస్తరించి ఉంటుంది. భూమితో పోలిస్తే, పీడనం లక్షరెట్లెక్కువ! అట్మాస్పియర్లోని మీథేన్ ప్రభావం వల్ల ఈ గ్రహాలు నీలిరంగులో ఉంటాయి! ఈ రెండు గ్యాస్ జైన్ట్స్ శీతలగ్రహాలే! యురేనస్ సూర్యుడి నుంచి భూమికంటే దాదాపు 20 రెట్లెక్కువ దూరంలో ఉంది. ఇది సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తిచేయడానికి 84 సంవత్సరాలు పడుతుంది. భూమికి నాలుగు రెట్లుండే ప్లానెట్ యురేనస్ ఇన్నర్ కోర్ ఐరన్, మెగ్నీషియం, సిలికేట్ల మిశ్రమం, కాగా ఉపరితలం నీరు, అమోనియా, మీథేన్ల మిశ్రమం.

నెప్ట్యూన్, సూర్యుని నుంచి భూమికంటే 30 రెట్లెక్కువ దూరంలో ఉంది. ఇది సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తిచేయాలంటే 165 ఏళ్ళు పడుతుంది. ఇక్కడ వీచే సూపర్‌సానిక్ గాలులను అడ్డుకునేందుకు పర్వతాల్లాంటివేవీ లేవుగనక, గాలివేగం గంటకు 2400 కి.మీ దాటుతుంటుంది! నెప్ట్యూన్ పై ఉష్ణోగ్రతలు కూడా మైనస్ 200 ℃ కంటే తక్కువగా ఉంటాయి. నెప్ట్యూన్ ఇన్నర్ కోర్ ఐస్ వాటర్, సిలికేట్ రాయిల మిశ్రమం! మ్యాన్టిల్ మంచునీరు, అమోనియా, గాఢ మీథేన్లతో కూడిన ఓ లిక్విడ్ ఓషియన్! మ్యాన్టిల్ ఆఖరులో ద్రవరూపంలో కార్బన్, ఘనరూపంలో డైమండ్స్ ఉంటాయి. క్లుప్తంగా చెప్పాలంటే అదో వజ్రాల సముద్రం! క్రస్టంతా (పటలం) ఐస్ తో నిండి ఉంటుంది. నెప్ట్యూన్ గ్రహంపై మేఘాలు హైడ్రోజన్, హీలియం, మీథేన్లను కలిగి ఉంటాయి.

ఇప్పుడు క్షణాల్లో భూమ్మీద ఏకంగా వజ్రాల వానలే కురిపించొచ్చు! ఐతే, వరుణప్ప వజ్రాలు తేవాలంటే ఒక చిన్న మార్పవసరం! భూవాతావరణంలో మీథేన్ శాతం ఎక్కువగా ఉండాలి! భూగోళం తీవ్ర ఉష్ణోగ్రతలు, అత్యధిక పీడనాన్ని కలిగి ఉండాలి! అప్పుడు మనం ముందుగా అనుకున్నట్లు జగమంతా వజ్రమయమై, భూగ్రహం ఓ వజ్రగోళంలా మారుతుంది!

ఈ రెండు గ్రహాల్లోని వాతావరణం అత్యధిక శాతం మీథేన్ (సిహెచ్4) తో నిండి ఉంటుంది. ఉరుములు, మెరుపుల ఒరిపిడివల్ల మీథేన్లోని కార్బన్ అణువు, హైడ్రోజన్ అణువులతో రసాయనబంధాన్ని కోల్పోతుంది. అలా విడిపోయిన ఒంటరి కార్బన్ అణువులన్నీ గాలిలో తేలియాడుతూ, గుంపులుగా ఏకమై వాతావరణ పొర అడుగు భాగంలోకి చేరుతాయి. అక్కడ ఉండే అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఒత్తిడుల వల్ల అవి సంపీడనం చెంది ముందు గ్రాఫైట్, తరవాత ఘనరూపంలో ఉండే వజ్రాలుగా మారి గ్రహ ఉపరితలంపై వర్షిస్తాయి. ఇదీ డైమండ్ రెయిన్స్ కథా కమామీషు!

సౌరకుటుంబంలోని జుపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలపై వజ్రాల వర్షాలు పడతాయని భావించడమే గానీ, నిజనిర్ధారణ ఎన్నడూ జరగలేదు! ఐతే తాము నమ్మిన సిద్ధాంతాన్ని నిజం చేయడానికి శాస్త్రజ్ఞులు కొన్ని సంవత్సరాల క్రితం భూమ్మీద ప్రయోగాలు మొదలుపెట్టారు.

ఐతే, వజ్రాల వానలు చాలాకాలం వరకు ఒక ఊహాగానంగానే ఉండేవి! సౌరకుటుంబంలోని జుపిటర్, శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ గ్రహాలపై వజ్రాల వర్షాలు పడతాయని భావించడమే గానీ, నిజనిర్ధారణ ఎన్నడూ జరగలేదు! ఐతే తాము నమ్మిన సిద్ధాంతాన్ని నిజం చేయడానికి శాస్త్రజ్ఞులు కొన్ని సంవత్సరాల క్రితం భూమ్మీద ప్రయోగాలు మొదలుపెట్టారు. సరిగ్గా యురేనస్, నెప్ట్యూన్ గ్రహాల్లో ఉండే వాతావరణ పరిస్థితులను ఇక్కడి ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు! మ్యాటర్ ఇన్ ఎక్స్ ట్రీమ్ కండిషన్స్ అనే పరికరాన్ని ఉపయోగించి, అచ్చం ఆ రెండు గ్రహాల వాతావరణంలోని కార్బన్, హైడ్రోజన్ అణువులతో కూడిన పాలిస్టిరీన్ అనే ఒకరకమైన ప్లాస్టిక్ ను ఎక్స్ రే లేజర్స్ తో పేల్చి, నానోమీటర్ సైజులో ఉండే వజ్రాలతో కూడిన వానలు కురిపించడంలో సక్సెసయ్యారు.

డైమండ్స్ ఏ గనుల్లోనో శుద్ధిచేయని ముడిసరుకుగా లేదా సానబెట్టిన తరవాత ధగధగ మెరుస్తూ అమ్మకపు సరుకుగా జువెల్లరీ షాపుల్లోనో మాత్రమే దొరుకుతాయనేది పాతమాట!

విజయవంతమైన ఈ స్టడీతో యురేనస్, నెప్ట్యూన్లాంటి గ్రహాల మీద ఖరీదైన వజ్రాల వానలు కురుస్తాయనే వాదనలకు బలం చేకూరినట్లైంది. ఐతే శూన్యంలో వజ్రాల ఉనికి ఇవాళ కొత్తేమి కాదు! వాటికి సంబంధించిన ఆనవాళ్లు లభించడం కూడా ఇదే మొదలు కాదు! కొన్నేళ్లక్రితం, ఒక ఉల్క భూవాతావరణంలోకి ప్రవేశించి, సుడాన్ ఎడారి మధ్యలో పాతానికి గురైనప్పుడు, దాని తాలూకు శకలాల్లో వజ్రాలు బయటపడ్డాయి. ఆ మధ్య బ్రెజిల్లో లభ్యమైన కార్బనాడో డైమండ్లు కూడా కొన్ని బిలియన్ సంవత్సరాల క్రితం ఓ ఆస్టెరాయిడ్ ఢీకొన్నప్పుడు శూన్యం నుంచి భూమికి వచ్చి చేరినవే! శనిగ్రహంలో ప్రతి ఏటా ఒక మిలియన్ కేజీల వజ్రాలు ఉత్పత్తవుతాయని అంచనా! శాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ల మాదిరిగానే ప్లానెట్ జుపిటర్లో కూడా వజ్రాలవానలు కురుస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి!

అందుకే డైమండ్స్ ఏ గనుల్లోనో శుద్ధిచేయని ముడిసరుకుగా లేదా సానబెట్టిన తరవాత ధగధగ మెరుస్తూ అమ్మకపు సరుకుగా జువెల్లరీ షాపుల్లోనో మాత్రమే దొరుకుతాయనేది పాతమాట! పైగా భూపొరల్లో వజ్రాలు ఏర్పడటానికి ఇక మిలియన్ల సంవత్సరాల తరబడి వేచి చూడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు! మనిషి తలుచుకుంటే ఇప్పుడు క్షణాల్లో భూమ్మీద ఏకంగా వజ్రాల వానలే కురిపించొచ్చు! ఐతే, వరుణప్ప వజ్రాలు తేవాలంటే ఒక చిన్న మార్పవసరం! భూవాతావరణంలో మీథేన్ శాతం ఎక్కువగా ఉండాలి! భూగోళం తీవ్ర ఉష్ణోగ్రతలు, అత్యధిక పీడనాన్ని కలిగి ఉండాలి! అప్పుడు మనం ముందుగా అనుకున్నట్లు జగమంతా వజ్రమయమై, భూగ్రహం ఓ వజ్రగోళంలా మారుతుంది! కాకపోతే, బ్యాడ్ లక్! అవన్నీ చూడటానికి మనమే ఉండం! ఎందుకంటే, వజ్రాలవాన ఓ ఉత్పాతం! అది సృష్టించే విధ్వంసంలో కొట్టుకుపోయి మనిషి తన మనుగడనే కోల్పోతాడు!

‘సూరజ్ వి. భరద్వాజ్ సీనియర్ జర్నలిస్టు. ఉస్మానియాలో విశ్వ విద్యాలయంలో జర్నలిజంలో ఎంసిజె చదివిన ఈ కరీంనగర్ బిడ్డ అనతికాలంలోనే టెలివిజన్ జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. క్రైం  నుంచి పోలిటికల్ రిపోర్టింగ్ వరకు తనది చురుకైన పాత్ర, ప్రవేశం. ప్రస్తుతం టి న్యూస్ బ్యూరోలో  పనిచేస్తున్న తాను ముఖ్యమంత్రి, సచివాలయ కార్యకలాపాలను ప్రజలకు అందజేస్తున్నారు. మంచి వాక్యం రాయగల అరుదైన ఈ టెలివిజన్ జర్నలిస్టు ‘తెలుపు’ కోసం సూరజ్’ కా సాత్వా ఘోడా  పేరిట  మనం చూస్తున్న లోకాన్నే సరికొత్తగా దర్శనం చేయిస్తారు.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article