Editorial

Wednesday, January 22, 2025
ఆనందంఆస్మాన్ : అబ్బూరి స్మరణలో చెట్టు వంటి అడ్డా...

ఆస్మాన్ : అబ్బూరి స్మరణలో చెట్టు వంటి అడ్డా…

నా స్వప్నం సాకారమయ్యే రోజు వచ్చేసింది. అబ్బూరి ఛాయాదేవి గారి పేరు మీద, ఆవిడ సంస్మరణార్ధం
మన భాగ్య నగరంలో ఒక చోటు తయరౌతోంది. అక్టోబర్ 13 ఆవిడ పుట్టిన రోజు. ఆ రోజు సిద్దం అవుతోంది. ఇది 2019 నాటి కల…కరోనా మింగేసిన కల.

కొండవీటి సత్యవతి 

ఉదయం అయిపోయింది అని తోట రాంబాబు చెప్పే వరకూ చూడనే లేదు. దేవుడి పేరుతో మానవులు సృష్టించిన శబ్ద కాలుష్యంలో రాత్రంతా నిద్రచెడి ఇందాకే లేచాను. మీకు ఓ పసైందైన కబురు చెబుతానని ఊరించాను కదా. నిజానికి ఇది పసందైందో కాదో…

మనుష్యులం ఎవరి మానసిక కల్లోలాల్లో వాళ్ళం కుదించుకుని పోతున్న సమయంలో…మనలోని తడి ఉందో ఆవిరైపోయిందో మనకే తెలియకుండా పోయిన తరుణంలో… మనల్ని మనం చంపేసుకోవడానికి సిద్ధమైపోతున్న విషాద నేపధ్యంలో…మన చుట్టూ వందల్లోనో, వేలల్లోనో స్నేహితులు పర్యవేష్టించి, నిజమైన మితృలెవరో నీ భుజం చుట్టూ చెయ్యేసి నిన్ను గుండెకు హత్తుకునేవాళ్ళెవరో అర్ధం కాని గందరగోళాల్లో, నీ పనిని,నీ బతుకునీ,నీ ప్రతి చర్యని జడ్జ్ చేస్తూ నిన్ను నిన్నుగా మిగలనివ్వని ఆధిపత్య ధోరణులు పెచ్చరిల్లుతున్న ఇప్పటి నేపధ్యంలో, కులం,మతం,ప్రాంతం ముప్పేట గొలుసులా మనల్ని కట్టిపడేసి అంధయుగాల్లోకి మనల్ని తోసేస్తున్న సందర్భంలో…మనలోపలి కల్లోలాలను ఎక్కడ వ్యక్తం చేసుకోవాలి ?

మన లోపల ఏం జరుగుతుందో మన దగ్గరి నేస్తాలనబడే వాళ్ళు కూడా పసిగట్టలేకపోతున్నారంటే లోపం మనలో ఉందా?వాళ్ళల్లో ఉందా?

కోడిగుడ్డుకు ఈకలు పీకకుండా ఉన్నదాన్ని ఉన్నట్లు స్వీకరించే మానసిక విశాలత్వాన్ని మనం కోల్పోయాం.
మనిషిలో పొంగిపొర్లే దుఖానికి రంగు,రుచి వాసనా ఉండవు.కులం,మతం,జెండర్ ఉండవు. దుఖం దుఖమే.

ఇది మనల్ని మనం ఆవిష్కరించుకునే అడ్డా మాత్రమే. అక్కడ జీవితాన్ని పుస్తకంలా చెప్పే కార్యక్రమాలుంటాయి. ఉద్యమాల్లో పండిన వాళ్ళ అనుభవాలు పంచుకునే వేదికలుంటాయి.  ఆ హాలంతా సజీవంగా, చైతన్యంగా నిన్ను నువ్వు ఆవిష్కరించుకోగలిగిన ఓ పచ్చటి చెట్టులా ఉంచాలని ప్రయత్నం.

చేతిలో సెల్ఫోన్ తో ఉన్నపాటి స్నేహం మనకి మనుషుల మీద లేకపోవడం వెనక పెద్ద కుట్రలే ఉన్నాయి.
మనల్ని ఏకాకులను చేసి ఒంటరి ద్వీపాలుగా మార్చడం వెనక ప్రపంచీకరణ విధ్వంసం ఉంది.
మనల్ని మనుష్యుల నించి వేరు చేసి వస్తువుల వైపు,వస్తు సముదాయపు ఎడారుల వైపు గెంటేయడం వెనక కార్ఫోరేట్ శక్తుల వికృత లాభాల వేట ఉంది.

ఇలాంటి నేపధ్యం లో మనకో స్పేస్, డెమోక్రాటిక్ స్పేస్, మనల్ని మనం వ్యక్తం చేసుకోవడానికి, ఆడుకోవడానికి, పాడుకోవడానికి ఓ చోటు కావాలి.

మనలో లావాలాగా ఎగిసిపడుతున్న మానసిక కల్లోలాలను మనమే ఆర్పుకోగలిగిన వెసులుబాటు ఉండే ఓ చోటు ఉండాలి.

అక్కడ జడ్జిమెంట్లుండవు. సూక్తి ముక్తావళులుండవు. నీతి బోధలుండవు. నువ్వు నువ్వుగా వ్యక్తం చేసుకునే చోటు.

నా చుట్టూ ఉన్న ఎంతో మంది ఒంటరితనాల్లో, వేదనల్లో, ఉద్వేగాలను నిభాయించుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళేమీ ఖాళీగా కూర్చుని ఉన్నవాళ్ళు కాదు. గొప్ప, గొప్ప పనుల్లో క్షణం తీరికలేకుండా తమ మనుసుల్లోని కల్లోలాలను పట్టించుకోకుండా, పక్కకి తోసేస్తున్నవాళ్ళున్నారు.

బతుకు చెట్టు ఆకుల్ని రాల్చేసినా చిన్న చిన్న చిగుళ్ళు వేయించుకునే వెసులులుబాటుండే చోటు.

అక్కడ ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, బొమ్మలేసుకోవచ్చు. రాత్రంతా వెన్నెల తోడుగా మంచులో తడిసిపోవచ్చు.

గుండెల్లో ఉప్పొంగుతున్న ఉద్వేగాలను పంచుకోవచ్చు. గుక్కపట్టి ఏడ్వాలనిపిస్తే ఏడ్వవచ్చు.

అలాంటి ఒక ప్లేస్ ఏర్పరచాలనేది నా కల. అలాంటి ఎన్నో చోటులను మనమందరం క్రియేట్ చేసుకోవాలని నా కోరిక.

మనం బతకక తప్పనప్పుడు, ఆ బతుకులోని కల్లోలాలను మోయాల్సి ఉన్నప్పుడు ఆ బరువును కొంచం తేలికపరుచుకునే మార్గాలను మనమే అన్వేషించుకోవాలి.

అలాంటి స్థిలోకి నెట్టేయబడిన వాళ్ళకి, ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాళ్ళకు మనం చిన్న పుల్లముక్క అందించినా వాళ్ళు ఆ సంక్షోభాల నుంచి ఖచ్చితంగా గట్టెక్కగలుగుతారు.

నా చుట్టూ ఉన్న ఎంతో మంది ఒంటరితనాల్లో, వేదనల్లో, ఉద్వేగాలను నిభాయించుకోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళేమీ ఖాళీగా కూర్చుని ఉన్నవాళ్ళు కాదు. గొప్ప, గొప్ప పనుల్లో క్షణం తీరికలేకుండా తమ మనుసుల్లోని కల్లోలాలను పట్టించుకోకుండా, పక్కకి తోసేస్తున్నవాళ్ళున్నారు.

నా స్వప్నం సాకారమయ్యే రోజు వచ్చేసింది. అబ్బూరి చాయాదేవి గారి పేరు మీద, ఆవిడ సంస్మరణార్ధం
ఒక చోటు తయరౌతోంది. అక్టోబర్ 13 ఆవిడ పుట్టిన రోజు. ఛాయా దేవిగారి మీద తయారౌతున్న భూమిక ప్రత్యేక సంచిక ఆరోజు ఆవిష్కృతమౌతుంది. ఆ రోజే మా రిసోర్స్ సెంటర్ కూడా మొదలౌతుంది. అందులోనే మా రిసోర్స్ సెంటర్, లైబ్రరి అన్నీ ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉంటుంది.

ఇది మనల్ని మనం ఆవిష్కరించుకునే అడ్డా మాత్రమే. అక్కడ జీవితాన్ని పుస్తకంలా చెప్పే కార్యక్రమాలుంటాయి. ఉద్యమాల్లో పండిన వాళ్ళ అనుభవాలు పంచుకునే వేదికలుంటాయి.  ఆ హాలంతా సజీవంగా, చైతన్యంగా నిన్ను నువ్వు ఆవిష్కరించుకోగలిగిన ఓ పచ్చటి చెట్టులా ఉంచాలని ప్రయత్నం.

ఆ చెట్టు నుంచి వచ్చే చల్ల గాలి నన్ను, నిన్నూ సేదతీర్చాలి.

ఇది నేను చెప్పాలనుకున్న పసందైన కబురు.

అది పసందైన పనసతొనలా ఉందో, పచ్చి వగరు వాక్కాయలా ఉందో మీరే చెప్పాలి.

కొండవీటి సత్యవతి రచయిత్రి, కార్యకర్త, భూమిక నిర్వాహకురాలు., సదా జీవన లాలస.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article