పదివేలు పెట్టి నీవు పట్టుబట్ట తెచ్చినా
దర్జీ చేయి పడకపోతే కట్టలేవు చుట్టలేవుహడావిడి చేసుకుంటూ రెడిమేడ్ తెచ్చినా
లూజంటు టైటు అంటూ దర్జాగా నడవలేవుకొత్త బట్ట కట్టి నువ్వు అద్దంలో చూసుకుంటూ
నీ హుందాతనం వెనకున్నది దర్జీ యొక్క పనితనంఅవహేళన చేయాల్సిన వృత్తి కాదు దర్జీతనం
ఒకని కింద చేయిచాపే పనిలేని దర్జాతనంపదేపదే సలాంకొట్టే కర్మలేని మేరతనం
కోట్ల పెట్టుబడులు పెట్టె షేర్ మార్కెట్ వృత్తి కన్నా
పై వాళ్లు పీకేనె గవర్నమెంట్ జాబ్ కన్నా
దివాళాలు తీస్తున్న కంప్యూటర్ ఫోజుకన్నా
ఇంటిదారి పడుతున్న సాఫ్ట్వేర్ సారుల కన్నా
లాభనష్ట భయాలు ఉన్న ఫైనాన్స్ ఫీల్డుకన్నా
ఒకని కింద చేతులు కట్టి పనిచేసే గోలకన్నా
ఉన్నచోట నుండి ఒక అడుగు కూడా కదలకున్న
దర్జాగా పనిచేసే దర్జీపని గొప్పదన్ననేడు ఉన్న పనులు అన్ని ముందుకు ఉన్నా లేకున్నా
దర్జీ పని నమ్ముకుంటే బతికి బట్ట కట్టడమే అన్నగొప్పదోయ్ గొప్పదోయ్! దర్జీపని గొప్పదోయ్!
కొట్టవోయ్ కొట్టవోయ్ దర్జీకీ జై కొట్టవోయ్!
నా పేరు భవాని. మాది ఆరెగూడెం అనే పల్లెటూరు. అది నేలకొండపల్లి మండలం ఖమ్మం జిల్లాలో ఉంటుంది. నేను సాధారణ గృహిణిని. నాకు ఇద్దరు పాపలు. పుట్టిన దగ్గర నుండి వాళ్ళను వదిలి బయటి పనులకు వెళ్ళలేకపోతున్నాను. అందుకీ లేడీస్ టైలరింగ్ నేర్చుకున్నాను. దీని వల్ల అన్ని రకాలుగా నా బాధ్యతలను సంపూర్తి చేయగలుగుతున్నాను.
కరోనా వచ్చాక పిల్లలు ఇంటికే పరిమితం అయ్యారు. వారిని జాగ్రత్తగా కంటికి రెప్పలా చూసుకోగలుగుతున్నాను. ఒక ఎకరం పొలంలో వ్యవసాయం పనులు చేసుకుంటూనే నా పనిని కొనసాగిస్తున్నాను. సంపాదన విషయంలో నా భర్తకు, ఖర్చుల్లో చేదోడువాదోడుగానూ ఉంటున్నాను. ఇలా అన్ని రకాలుగా అంటే ఒక భార్యగానూ, గృహిణిగానూ, మంచి దర్జీగానూ ఉండటం కేవలం ఒక దర్జీ పని వల్లనే సాధ్యం అనిపిస్తుంది నాకు. అందుకే నాకు తోడు నీడగా ఉన్న దర్జీ పని గురించి ఈ రచన పంపుతున్నాను. చదివాక మీ అభిప్రాయం చెప్పగలరు. కృతజ్ఞతలు.
అభినందనలు చాలా బాగుంది అద్భుతమైన కృషి కి అభినందనలు..స్పూర్తిని.కలిగించే కవిత……జీవితం…….మనో ధైర్యానికి ప్రతీ క……….
దర్జీ తనం… నిజంగా దర్జా తనమే…
Great inspiration to everyone