దేశంలో ఉన్నాను కదా అన్న ఆ మహనీయుడి తలంపు ఎంత గొప్పగున్నది.
కందుకూరి రమేష్ బాబు
స్వాతంత్ర్యం వచ్చిన తొట్ట తొలి రోజులు. దేశం స్వేఛ్చా వాయువులు పీల్చుకుంటున్న మొట్ట మొదటి దినాలు. ఆ మహాత్తర పోరాటంలో చురుగైన భాగస్వామ్యం ఉన్న ఒక మహనీయుడి గురించిన జ్ఞాపకం నిన్న ఒక మిత్రుడు… ఎక్కడో చదివారట….పంచుకున్నారు.
ముంబై కి చెందిన ఆ స్వాతంత్ర్య సమర యోధుడికి పట్టణం నట్ట నడుమ మూడు ఎకరాల విలువైన స్థలం ఉందట. అది చప్పున ఆక్రమణకు గురైందట. సంగతి తెలిసి సన్నిహితులు నొచ్చుకుని వారితో అన్నారట…మహాత్మా గాంధీ గారి దృష్టికో లేదా జవహర్ లాల్ నెహ్రూ గారికో చెప్పవలసింది అని! లేదా యే ప్రభుత్వం అధికారులకైనా తెలియజేయవలసిందీ కదా అని!!
“దేశమే నాదైనప్పుడు ఆ మూడెకరాల స్థలం గురించి నేనెక్కడ ఆలోచించేది”
అందుకు అయన చిరునవ్వి నవ్వ్వి, “దేశమే నాదైనప్పుడు ఆ మూడెకరాల స్థలం గురించి నేనెక్కడ ఆలోచించేది” అన్నారట.
అలా బతికారు వారు!
ఎంత తారతమ్యం! స్వాతంత్ర్యం, జాతీయ భావనలతో బతికినా వారెక్కడ …స్వతంత్ర ఫలాలతో అభివృద్ది చెందిన వారెక్కడ!!
“నా దేశంలో ఉన్నాను” కదా అన్న ఆ మహనీయుడి తలంపు ఎంత గొప్పగున్నది.