Editorial

Wednesday, January 22, 2025
Peopleఆకలి మంటలను అర్పు వెన్నెల జల్లు : Divyas Moonshot కంపెనీ

ఆకలి మంటలను అర్పు వెన్నెల జల్లు : Divyas Moonshot కంపెనీ

నేడు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని హబ్సిగూడలో తమకోసం తామే నిర్వహించుకునే ఒక అద్భుతమైన కంపెనీ ప్రారంభం కానున్నది.

ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తామే ఉద్యోగాలు తెచ్చుకుని నలుగురికీ పంచి సమిష్టిగా పనిచేసే కొత్త సంస్థ కు అకురార్పణ ఇది. తమకోసం తమ ద్వార తామే నిర్వహించుకునే దివ్యమైన సంస్థ.

కందుకూరి రమేష్ బాబు 

వారు కొద్ది మందే కావొచ్చు. కానీ ఆ కొందరు ఎందరికో మార్గదర్శకం కావొచ్చు. ఆ మేరకు నిజంగానే ఈ రోజు ఒక చారిత్రక దినం. “Divyas Moonshot Inc” (a PwD company office) ప్రారంభం ఒక నూతన ప్రయత్నం. సాహసోపేత కర్తవ్యం కూడా.

దివ్యంగులు ఎవరిపై ఆధారపడకుండా తమ కోసం తమద్వారా తామే నిర్వహించుకునే తొలి కంపెనీగా ఈ “Divyas Moonshot Inc” ప్రారంభం కానున్నది. ఇది ఒక రకంగా ఈ ఒరవడిలో తొలి సంస్థ కావొచ్చు కూడా.

చదువు ఉండి, ప్రతిభ ఉండి, తగినంత మెళకువలు ఉండి కూడా ఎన్నో భయాలు, ఆందోళనలు! ఎవరు ఉద్యోగం ఇచ్చినా, ఆయా కంపెనీ కార్యాలయాలకు వెళ్లి ఎంత చక్కగా పనిచేసినా ఒక శంక. యాజమాన్యం ఆశించిన మేరకు తాము పనిచేయగలుగుతమో లేదో అన్న భయాందోళనలు. న్యూనతా భావం. ఇవే దివ్యాంగులను ఒత్తిడికి గురిచేస్తాయి. పని చేయకుండా కృంగ తీస్తాయి. ఉన్నత స్థాయికి వెళ్ళకుండా నిరోధిస్తాయి.

ఒకవేళ వారే ఒక కార్యాలయంగా ఏర్పడి నేరుగా కార్పొరేట్ సంస్థల నుంచి పని తెచ్చుకోగాలిగితే? తమకు అవసరమైన మెళుకువలను, శిక్షణను ఎప్పటికప్పుడు తామే అందిపుచ్చుకుని, నేరుగా కార్పొరేట్ సంస్థలకు ఆత్మవిశ్వాసంతో సేవలు అందించగలిగితే?

ఒక కంపెనీగా తమ శక్తియుక్తులను బలాబలాలను లోపాలతో సహా అంగీకరించి గొప్పగా తమను తాము ఆవిష్కరించుకోగలిగితే? తమ సత్తా తామే అద్భుతంగా నిరూపించుకోగలిగితే?

ఈ ఆలోచనలకు కార్యరూపమే “Divyas Moonshot Inc”.

ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తామే ఉద్యోగాలు తెచ్చుకుని నలుగురికీ పంచి సమిష్టిగా పనిచేసే సంస్థ. కార్పొరేట్ సంస్థ ప్రాజెక్టులను హుందాగా స్వీకరించి మార్కెట్ లో తామేవరికీ తీసిపోమని నిరూపించనున్న దివ్యమైన కంపెనీ.

ఈ కంపెనీ దివ్యంగుల కోసం వారిచే వారి ద్వారానే వారికోసమే నిర్వహించబడే సంస్థ.

ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తామే ఉద్యోగాలు తెచ్చుకుని నలుగురికీ పంచి సమిష్టిగా పనిచేసే సంస్థ. కార్పొరేట్ సంస్థ ప్రాజెక్టులను హుందాగా స్వీకరించి మార్కెట్ లో తామేవరికీ తీసిపోమని నిరూపించనున్న దివ్యమైన కంపెనీ.

వేరొకరి భయం లేదు. ఎవరో కించపరుస్తారన్న న్యూనత లేదు. సానుకూల దృక్పథంతో నిండు ఆత్మవిశ్వాసంతో తమదైన సృజనతో ఒక అందమైన దృశ్యాన్ని అవిష్కరించాలన్న తలంపే ఈ కంపెనీ స్థాపనకు మూలం. అందుకే ఇది మూన్ షాట్. ఒక వెన్నెల కాసే దృశ్యం.

ఈ మధ్యాహ్నం ఐ ఎ ఎస్ అధికారి శ్రీదేవి గారి చేతుల మీదుగా సంస్థ ప్రారంభం కానున్నది.  వందేమాతరం ఫౌండేషన్  మాధవ్ గారు ఈ సందర్భంగా స్పూర్తిదాయక ప్రసంగం చేయనున్నారు.  ఈ విషయాన్ని పంచుకుంటూ అమెరికా నుంచి రవి ప్రకాష్ మేరెడ్డి గారు మనందరి అభినందనలు కోరుతున్నారు. “Please join this movement of self-reliance and start a productive lifestyle. Let us embrace the new world with new ideas and attitudes. We will win the game hands down.”

ఈ సంస్థ ఏర్పాటుకు ఉదారంగా ముందుకు వచ్చిన వారికి అయన హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు.”We thanks our supporters, Venu Sangani, Spruce Infotech, a great friend, for providing office space, Radhakrishna Alla and his friends Vinay Mahajan, Praveen Tadakamalla, Prasad Chinthalapudi (NRIs) for buying 10 new desktops!”

మరిన్ని వివరాలకు సంప్రదించండి…
భావన – 97019 06222
దుండి సైదులు – 88852 98850

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article