Editorial

Friday, November 22, 2024
శాసనంగుడిమెట్ల, సింగరాయకొండ శాసనాలు

గుడిమెట్ల, సింగరాయకొండ శాసనాలు

Shasanamనేడు ఆగస్ట్ 11 వ తేదీ

క్రీ.శ 1291 ఆగస్ట్ 11 నాటి గుడిమెట్ల (కృష్ణాజిల్లా) శాసనంలో కాకతీయ రుద్రమదేవి పాలనలో (?) సకల సేనాధిపతి దాడి సోమయసాహిణి, వారి తండ్రి పెద్దయసాహిణింగారు విశ్వనాథ దేవరకు మధిరచెరువు, మడపల్లిచెరువు, కొండకంచిచెరువుల వెనక భూములనిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా X నెం 468].

అట్లే క్రీ.శ 1527 ఆగస్ట్ 11నాటి సింగరాయకొండ (ప్రకాశంజిల్లా) శాసనంలో శ్రీకృష్ణదేవరాయల పాలనలో రాయసం అయ్యపరుసయ్య సోమా(రా)జుపల్లి పర్ణశాల నరసింహస్వామి అంగరంగ వైభవాలకు జిల్లెలమూడి గ్రామాన్ని సర్వమాన్యంగా యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [నెల్లూరు జిల్లా శాసనాలు I Ka 77].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article