Editorial

Friday, January 10, 2025
స్మరణOF HUMAN BONDAGE - శ్రీ రామ కిషోర్ తెలుపు

OF HUMAN BONDAGE – శ్రీ రామ కిషోర్ తెలుపు

 

ఆ కోతి ఒక్క అరటి పండు మాత్రమే తీసుకొన్నది. అది నిరాశపరచకుండా, ఇచ్చిన వాటిలోని అరటి పళ్లను నింపాదిగా తినడం మొదలెట్టింది.

అప్పుడే నాన్న గారి 2వ రోజు శ్రార్ధ కర్మలు జరిపి, ఎండకు వచ్చి ఓ కునుకు తీద్దాము అని అనుకొంటుండగా ఇంతలో కేకలతో కూడిన, ‘ఏహ్! ఇక్కడ చూడండి, ఎవరు వచ్చారో’ అన్ని ఒక్కసారిగా పిల్లలు పెద్దగా అరిచారు.

ఏమైందా!, అని విసుక్కొంటూ వెళ్లి చూసాను. ఓ మధ్య వయసు కోతి వరండా చువ్వలు పట్టుకొని నింపాదిగా కూచోనుంది, ఏంటో వెతుకుతోంది. అందరు దాని వైపే చూస్తున్నారు ఉత్సుకతతో కూడిన ఆనందం అనుభవిస్తున్నారు.

ఇంతలో ఎవరో ఇంట్లోపలి నుండి, ‘ఒక్క చోట నెమ్మదిగా కుచోరా, నన్ను రమ్మంటారా’ అని ఓ బాల బెదిరంపు, ‘ఏదన్న ఇచ్చి పంపండి’ అని ఇంకొకరు సలహా, ‘కొంచెం దూరంగా ఉండండి’ అని మరేవరో జాగ్రత్తలు చెప్పడం క్షణాలలో జరిగిపోయింది.

ఇన్నింట్లో అందరికి నచ్చినది, ప్రభావం చూపినది, ‘ఏదన్న ఇచ్చి పంపండి’ అన్నది. అదే తడువుగా, పిల్లలందరూ ఒక్కసారిగా వారి శక్తి కొద్దీ అక్కడి నుంచి ఇంట్లోకి పరిగెత్తారు. దొరికిన పండో లేక బిస్కెట్ లేదా స్వీటు తెచ్చి, ఆ వానర అతిథికి ఇవ్వాలన్న వారి కోరికకు అది బలమైన సాక్షం, దాన్ని ఊరికే పంపగూడదన్న పట్టుదలకు నిదర్శనం వారి ప్రయత్నం. అందరూ వారికి దొరికిన ఏదో ఒక పండు, బిస్కెట్ పట్టు కొచ్చారు, కానీ ఆ కోతి ఒక్క అరటి పండు మాత్రమే తీసుకొన్నది. అది నిరాశపరచకుండా, ఇచ్చిన వాటిలోని అరటి పళ్లను నింపాదిగా తినడం మొదలెట్టింది.

email: ram.thinkact@gmail.com

వాస్తవికత కన్నా అధివాస్తవికత జీవితాన్ని మరింత సంపూర్ణంగా ఆవిష్కరిస్తుందని నమ్మే శ్రీ రామ కిషోర్ వృత్తి రీత్యా బిజినెస్ రీసెర్చ్ & అనలిస్ట్. ప్రవ్రుత్తి ఫోటోగ్రఫి. ఇటీవలే తండ్రిని కోల్పోయిన వీరు ఈ వానరం గురించి, దాని ఎదురు చూపు గురించీ రాసిన ఈ ఆత్మీయ కథనం హృద్యమైన అనుబంధం తెలుపు …ఎదురుచూపు తెలుపు

పిల్లలు అది ఎలా తింటోందో చూస్తూ నవ్వుకొంటూ కామెంట్లు చేస్తున్నారు. అంత దగ్గరగా ఆ అనుభవం వారికి భావాతీత శక్తి పొందినట్లయిందిగా అనిపించింది. ఇంతలో అందరికి తెలిసిందేందంటే, అది రోజు వచ్చే కోతే అని. నాన్న ప్రతి రోజు, రామ కోటి రాసిన తరువాత సమయ పాలన చేస్తూ వచ్చి, ఆయన పెట్టె అరటి పండో, కలకండ లేదా పాలకోవానో ప్రసాదం కోసం రోజు వచ్చి తింటుందని తెలిసింది. అది విన్న పిల్లలు దానికి ‘తాత కోతి’ అని బిరుదు ఇవ్వడం జరిగి పోయింది.

ఆచి తూచి తింటున్న దాన్ని చూస్తూ పిల్లలు ‘రోజు ఇచ్చే వారు, వీళ్లు కాదే, అనుకొంటూ తింటున్నట్టుగా ఉంది’ అనడం, ఆ విశ్లేషణ ముచ్చట గొలిపింది. ఇంకో రెండు వానరాలు జత చేరడంతో, ఉన్నవన్నీ వాటికీ ఇచ్చేసి అందరు దూరంగా జరిగారు. పిల్లల వీడ్కోలుతో అవి కూడా అక్కడి నుండి సాగిపోయాయి.ఓ నాలుగు నెలల తరువాత, ఏదో అవసరానికి వాచ్ మెన్ కు కాల్ చేసి ఫోన్ పెట్టేసే ముందు ‘ఇంకేంటి’ అన్నాను. తాను ‘ఇంకే ఉన్నాయ్ సామీ’ అంటూ ఎప్పటి లాగే సాగ దీస్తూ ఉన్నట్టుండి ‘సామీ మీకొకటి చెప్పాలి’ అన్నాడు.

‘మీకు గుర్తుందిగా, ఆ రోజు మీ ఇంటికి వచ్చిన ఆ కోతి, అది ఇంకా వచ్చి వెడుతోంది. అదే వరండా చువ్వ పట్టుకొని కొద్దీ సేపు కూచొని వెడుతోంది’ అన్నాడు.

ఏదో తెలియనిది తెలుసుకొన్నట్టు, ఓ ఉత్సాహం అతడి శబ్ద వ్యక్తీకరణలో, కొట్టొచ్చినట్టు కనిపించాయి. సర్దుకొన్నానో లేక తేరుకున్నానో తెలియదు, నేను, ‘ఏంటని’ అడిగాను. తాను ‘మీకు గుర్తుందిగా, ఆ రోజు మీ ఇంటికి వచ్చిన ఆ కోతి, అది ఇంకా వచ్చి వెడుతోంది. అదే వరండా చువ్వ పట్టుకొని కొద్దీ సేపు కూచొని వెడుతోంది’ అన్నాడు.

‘అవునా, ఏమోలే అలవాటు పడినట్టు ఉంది ఉందిలే’, అని నేను చెప్పబోతుండగా అతను ఆగను కూడా లేదు. తాను అందుకొని, ‘ రోజు వస్తుంది. కూచుంటుంది. చూస్తుంది. కానీ, ఇప్పుడు కొత్తగా బాడుగకు వచ్చిన వాళ్ళు ఏమి పెట్టినా తీసుకోటం లేదు’ అంటూ, ‘అది నాన్నగారి కోసమే వస్తున్నట్టు ఉంద’ని అందరమూ అనుకొంటున్నాము, వేరే ఎవరి ఇంటికి వెళ్లట్లేదు కూడా’ అని అన్నాడు.

వింటున్న నాకు ఏమి చెప్పాలో తోచక, ఆ కోతి రూపం, పిల్లలు చేసిన కోలాహల సందర్భము స్ఫురణకు వచ్చాయి. నాన్న కూడా. దాని నిరీక్షణా దీక్ష నన్ను ఆవహించింది. వాచ్ మెన్ అంతటితో ఆగక, ‘ అది మీ నాన్న గారు ఏదో ఊరెళ్లినట్టు ఉన్నారు, మళ్లీ వస్తారని అనుకొంటూ రోజు వస్తోంది. అలా ఇక్కడ అందరూ అనుకొంటున్నారు. నమ్ముతున్నారు కూడా’ అంటూ ముగించాడు.

అదేదో, చెప్పడం వల్ల వచ్చే ఆనందాన్ని తాను అనుభవిస్తూ అనడంతో విస్మయం చెందడం నా వంతైయింది. ఆ కోతికి నాన్నతో ఉన్న బంధ స్పర్శ గుర్తుచేసుకొంటూ, మూగబోతున్న నా గొంతు పూడుకు పోక ముందే, ‘మేము కూడా తిరిగొస్తారనే అనుకొంటుంటాము. నమ్ముతున్నాం’, అంటూ భారంగా ఫోను పెట్టేశాను.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article