Editorial

Monday, December 23, 2024
ఆరోగ్యంWorld Cancer Day : భరత్ భూషణ్ 'ఫెయిల్యూర్ స్టోరీ'

World Cancer Day : భరత్ భూషణ్ ‘ఫెయిల్యూర్ స్టోరీ’

ఇదొక లోతైన కథనం. ఒక యోధుడి ఆత్మకథ వంటిది. దాదాపు పద్దెనిమిదేళ్ళ క్రితం రాసిన ఆత్మీయ కథనం ఇది. ఆంధ్రజ్యోతి ఆదివారం సంచికలో ‘ఫెయిల్యూర్ స్టోరీ’ సిరిస్ లో భాగంగా అచ్చైన ఈ కథనం ఇటీవలే కాలం చేసిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ జీవితాన్ని సన్నిహితంగా ఆవిష్కరిస్తుంది. ఇది క్యాన్సర్ బారిన పడి వారెంతగా పెనుగులాడారో చెబుతుంది. అదే సమయంలో అయన పోరాట స్పూర్తినీ  పంచుతుంది. అంతేకాదు, లోతుగా తడిమి రాసిన ఈ వ్యాసం క్యాన్సర్ దినోత్సవం సంధర్భంగా మనకు తెలియని ఎందరో వ్యక్తులు అనుక్షణం పడుతున్న వర్ణణాతీత బాధకు పర్యాయపదం. జీవన సమరానికి నిదర్శనం.

కందుకూరి రమేష్ బాబు 

భరత్ భూషణ్ ఇల్లు ఒక కొలను వలే వుంటుంది. అందులో ఎక్కడ చూసినా నీలిరంగు వస్తువులు చేపల వలే ఆకర్షిస్తాయి. ఈ కొలనులో ఒక చూడముచ్చటైన కమలం కూడా వుంది. అదేమిటో కాదు. ఆయన గోడ గడియారం. ప్రధాన ద్వారానికి ఎదురుగా వుండే ఆ గడియారం ప్రతి గంటకూ ఒక సారి కమలం వలే విచ్చుకుని వీనుల విందైన సంగీతం వినిపిస్తుంది. ఆ వెంటనే అది నిదానంగా ముడుచుకుని మౌనంగా తన పని తాను చేసుకుంటుంది.

భరత్ భూషణ్ తన నలభై ఎనిమిదవ పుట్టినరోజుకు ఏరికోరి కొనుక్కున్న గడియారం ఇది. ఈ గడియారం అంటే ఆయనకు ప్రాణం.

ఎందుకో అర్థం కావాలంటే పక్క గదిలోకి వెళ్లాలి. గదిలోనే భరత్ భూషణ్ ఆస్తిపాస్తులన్నీ వున్నాయి. ఆయన గీసిన పెయింటింగ్స్, సేకరించిన కళా గ్రంథాలు, సినిమా కేసెట్స్ అన్నీ ఇక్కడే వున్నాయి. మరీ ముఖ్యంగా ఆయన గత రెండు దశాబ్దాలుగా తీసిన ఫోటోలతో వున్న బీరువా కూడా అక్కడే వుంది. దానిపై ఒక తెల్లకాగితం అతికించి వుంది. Time is short అనే ఆంగ్ల అక్షరాలు వాటిపై కనిపిస్తాయి.

‘ఇలా ఎందుకు రాశారు’ అని అడిగితే “క్యాన్సర్ వచ్చిన తర్వాత My life is short అని తెలిసింది. బతికినంత కాలంలోనే నా బాధ్యతలు, పనులు పూర్తి చేయాలి కదా! అందుకు గుర్తుగా ఇలా రాసుకున్నాను” చెప్పారాయన.

భరత్ భూషణ్ ఆపరేషన్ చేయించుకున్నారు. ఆయనప్పటికీ ఆయన క్యాన్సర్ పీడితుడే. దినదినం ప్రాణభయంతో బతుకుతున్న మనిషి. అందుకనే ఆయన గడియారంలో కాలాన్ని లెక్కిస్తుంటారు లేదా తానే ఒక గడియారమై మృత్యు ఘంటికలను లెక్కిస్తుంటారు.

“జీవితంలో స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, పావర్టీ, ఫెయిల్యూర్స్ – వీటన్నిటి ఫలితమే నాకు వచ్చిన క్యాన్సర్” అని ఆయన అభిప్రాయపడ్డారు.

“నాకు ఎపిక్లటిస్ క్యాన్సర్ వచ్చింది. ఎపిక్లటిస్ అంటే కొండనాలుక, ఇది త్రోట్ క్యాన్సర్లో భాగమే. స్వామి వివేకానంద, దేవులపల్లి కృష్ణశాస్త్రి, సినీ యాక్టర్ రాజబాబు, జిన్నా కపూర్ కు వచ్చింది కూడా ఇదే” అన్నారాయన.

“క్యాన్సర్ ను ఫ్యాటల్ డిసీజ్ అంటారు. అంటే చావుతోనే పోయే వ్యాధి అని. ఒక్కోసారి క్యాన్సర్ రికర్ అయే (తిరగబెట్టే) అవకాశం వుంది. రికర్ కాకుండా జాగ్రత్త పడితే సర్వైవల్ వుంటుంది. అయితే బ్రతికినన్నాళ్లూ బాధపడాల్సిందే. ఒక్క క్యాన్సర్ కణం చంపడానికి వంద మంచి కణాలను చంపాలి. నా శరీరం ఇలాంటి హింసకు తట్టుకుని బతుకుతోంది. నేను ఎప్పుడు పోయేది చెప్పలేం. Throught my life, మృత్యువును ఫేస్ చేయాలి. Everyday I Have to breath life and death” చెప్పారాయన.

“జీవితంలో స్ట్రెస్, ఫ్రస్ట్రేషన్, పావర్టీ, ఫెయిల్యూర్స్ – వీటన్నిటి ఫలితమే నాకు వచ్చిన క్యాన్సర్” అని ఆయన అభిప్రాయపడ్డారు.

“క్యాన్సర్ వచ్చినప్పటినుంచి నాకు ఆపరేషన్ అయ్యేంత వరకూ నేను అనుభవించిన మనోవేదన చెప్పరానిది. ఏం సక్సెస్ అనుభవించకుండానే పోతానా అనిపించిన క్షణాలూ ఉన్నాయి” జ్ఞాపకం చేసుకున్నారు.

“అది 1995. నిద్రపట్టని రాత్రులెన్నో. ఒక రోజు నేను షేవ్ చేసుకుంటున్నప్పుడు గొంతుకు ఎడమ వైపు బొడిప వంటిది కనిపించింది. డౌట్ వచ్చి నొక్కి చూస్తే బాధ తెలియలేదు. మా అన్నయ్య డాక్టరు. ఆయనకు చెబితే వచ్చి చూశాడు. ‘అరె… భరత్’ అన్నాడు. ఆయన కంఠం వణికింది. అప్పుడే నాకు అర్ధం అయింది. క్యాన్సర్ కావచ్చేమో అని!

టెరిబ్లీ డిస్టర్బ్ అయ్యాను..

డేవిడ్ లివింగ్ స్టన్ అనే డాక్టరు బట్టలన్నీ విప్పించి నన్ను చెకప్ చేశాక, నన్ను సెపరేట్ చేసి మా అన్న, డాక్టరూ ఇద్దరే మాట్లాడుకున్నారు. అప్పుడు నాకు అనుమానం స్థిరపడింది.

‘ఐ హజ్ సో స్కేర్డ్. ఐ కుడ్ నాట్ ఈట్… వాక్. ఇంటికి వచ్చాక నిలబడలేకపోయాను. కూర్చోలేక పోయాను. రాత్రంతా గడిచిపోయింది. 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, గంటలు గడుస్తున్నాయి. నిద్ర లేదు. తెల్లారింది. ఎంత డిస్టర్బ్ అయ్యానో చెప్పలేను. చేంజ్ కోసమని పాత మేగజైన్లు తిప్పుతుంటే లక్కిలీ ‘ఇండియా టుడే’లో ఒక ఆర్టికల్ కనిపించింది. ‘లైఫ్ ఆఫ్టర్ క్యాన్సర్’ దాని పేరు.

గబగబా చదివాను. క్యాన్సర్ వస్తే చావటమే కాదు, బ్రతికే అవకాశాలున్నాయని చెప్పిన వ్యాసమది.

లింప్ నోడ్ సర్జరీ అయిన తర్వాత కాళోజి వచ్చాడు. మా ఇంట్లో వారం రోజులుండి ధైర్యం చెప్పాడు. వెళ్లేటప్పుడు కొంత డబ్బు ఇచ్చిపోయాడు. అప్పుడనిపించింది. నేను బతకాలని కోరుకునే వాళ్లు చాలామంది ఉన్నారని!

చదివాక నా ఆందోళన తగ్గింది. ఫోటోలతో కూడిన ఆర్టికల్ అది. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చి బతికిన వ్యక్తి మొదలు చాలామంది కేస్ స్టడీస్ తో రాసిన ఆర్టికల్ అది. నా కోసమే రాశారా అనిపించింది. ఆశ పుట్టింది. క్యాన్సర్ పేషెంట్ బతుకుతాడంటే నమ్మబుద్ధి కాని పరిస్థితి. ఆ వ్యాసం చదివాక భయం తగ్గింది. ఇంత గబుక్కున నా జీవితం ముగిసిపోదనిపించింది.

లింప్ నోడ్ సర్జరీ అయిన తర్వాత కాళోజి వచ్చాడు. మా ఇంట్లో వారం రోజులుండి ధైర్యం చెప్పాడు. వెళ్లేటప్పుడు కొంత డబ్బు ఇచ్చిపోయాడు. అప్పుడనిపించింది. నేను బతకాలని కోరుకునే వాళ్లు చాలామంది ఉన్నారని! సంతోషం వేసింది. కాళోజియే కాదు, ఇలా చాలామంది నన్ను ఆదుకున్నారు. చర్చీలో ప్రార్థనలు జరిపించారు. మాడభూషి శ్రీధర్ మామగారైతే తనకు కలలో సర్సింహస్వామి కనిపించారని, యాదగిరిగుట్టపోయి పూజ చేయించి ప్రసాదంతో వచ్చారు. నేను అంతవరకు నమ్మలేనిని చాలా చూశాను.

క్యాన్సర్ వచ్చినప్పుడు మా అన్నయ్య గోవింద్ గొప్ప అండగా నిలబడ్డారు. నన్ను రక్షించుకోవాలనే ప్రతి నిమిషం ఆలోచించారు. అలాగే ఆర్టిస్టులు, కమ్యూనిస్టులు, ఫెమినిస్టులు, జర్నలిస్టులు, ఫోటో గ్రాఫర్లు, చాలామంది నేను బ్రతకాలని కోరుకోవడం నాకు ధైర్యం ఇచ్చింది. అంతకుముందు నేను ఫోటో తీసిన ప్రతి వ్యక్తి మృత్యుముఖంలో వున్న నాకు స్నేహహస్తం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అలాగే నాతో పెద్దగా సంబంధం లేకపోయినా మా బంధువులందరూ ఆ దశలో వచ్చి నన్ను చూసిపోయారు.

రేడియేషన్ తర్వాత కమెండో సర్జరీ అనుకున్నారుగానీ ఎందుకో రాడికల్ నెక్ సర్జరీ చేశారు. ఈ పేర్లు కూడా ‘లెఫ్ట్’వి కావడంతో నవ్వొచ్చేది.

“రేడియేషన్ ట్రీట్ మెంట్ తీసుకునేటప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇన్ఫెక్షన్ రాకూడదు. దాంతో డాక్టర్లు నన్ను వదిలేశారు. ఒక స్నేహితుడు మంగళగిరి వెళుతుంటే నేను కూడా వెళ్లి పానకాలస్వామిని దర్శనం చేసుకుని తీర్ధం తాగాను. మరునాడే కో-ఇన్సిడెన్స్ కావచ్చు ఇన్ ఫెక్షన్ తగ్గింది. మళ్లీ హైదరా బాద్ వచ్చి ట్రీట్ మెంట్ తీసుకున్నాను. రేడియేషన్ తర్వాత కమెండో సర్జరీ అనుకున్నారుగానీ ఎందుకో రాడికల్ నెక్ సర్జరీ చేశారు. ఈ పేర్లు కూడా ‘లెఫ్ట్’వి కావడంతో నవ్వొచ్చేది.

రాడికల్ నెక్ సర్జరీ నాకు చేయాల్సిన చివరి ఆపరేషన్. దురదృష్టవశాత్తూ అదీ ఫెయిల్ అయింది.. విపరీతమైన ఊజింగ్. చనిపోతాననే అనుకున్నాను. ఎంతో నిబ్బరం గల మా ఆవిడ కళ్లలో నీళ్లు తిరిగాయి. డాక్టర్లు రెండోసారి చేశారు. సక్సెస్ అయింది. ఈ మధ్యలో నేను మా చెల్లెలు జానకిని పిలిపించి, నేను చచ్చిపోతే నా శవాన్ని నీలంరంగు బట్టలో చుట్టాలి. అని రిక్వెస్టు చేశాను. అంతేకాదు, వీలైతే, మా ఇల్లు చిన్నది కనుక సందర్శకుల కోసం అన్నయ్య వాళ్లింట్లో పడుకోపెట్టమని, ఇంకా సాధ్యమైతే నా శవాన్ని నేను పుట్టిన వరంగల్లోనే దహనం చేయమని చెప్పాను. అయితే నా విషయంలో మృత్యువు తాత్కాలికంగా ఓడిపోయింది. నేను బ్రతికాను”.

“…అప్పట్నుంచి ఇప్పటివరకూ కంటిన్యూయిస్ సఫరింగ్ అనుభవిస్తున్నాను. క్యాన్సరుకు ముందూ, వెనకా కూడా నా జీవితం ఫెయిల్యూరే అనవచ్చును. పెయింటర్ గా ప్రారంభమై విఫలమైనాను. స్టిల్ ఫోటోగ్రాఫర్ గా మొదలై ఫిల్మ్ మేకర్ గా రాణిస్తానని అనుకున్నాను. అందులోనూ విఫలమైనాను. ఇక నా కళాభిరుచిని సంతృప్తి పరుస్తుందనుకున్న ఫోటోగ్రఫీయే నా జీవికగా మారింది. జీవితం, కళ ఒకటి కావడం సమస్యే అయింది’ అన్నారు ఆవేదనగా.

నా కళా భిరుచిని సంతృప్తి పరుస్తుందనుకున్న ఫోటోగ్రఫీయే నా జీవికగా మారింది. జీవితం, కళ ఒకటి కావడం సమస్యే అయింది’ అన్నారు ఆవేదనగా.

స్వతహాగా భరత్ భూషణ్ కు ఈస్ట్రటిక్స్ అంటే ప్రాణం. “పీపుల్ అండ్ ఈస్తటిక్స్ పేరుతో ఆయన నిర్వహించిన మొదటి ఫోటో ఎగ్జిబిషన్ చూసిన వారెవనూ ఆయనను ఒట్టి ఫోటోగ్రాఫర్ అని తీసి వేయలేరు. ఆయన ఫోటో జర్నలిస్టు, ఆర్టిస్టు కూడా.. ప్రతి ఫ్రేంలోనూ అది కనిపిస్తుంది. అందువల్లే కళాకారులతో సమానమైన గౌరవాన్ని ఆశిస్తారు. దానివల్లే ఒక్కోసారి ఆశాభంగానికి గురవుతారు కూడా.

“నేను అందరిలా స్టూడియో పెట్టుకుంటే నా వద్దకు వచ్చినవారి ఫోటోలే తీసేవాడిని. లేదా పెళ్లిళ్ల కోసం ఔట్ డోర్ కి వెళ్లేవాడని, కానీ నేను డిఫరెంట్ గా వర్క్ చేయాలనుకున్నాను. అందుకే సృజనాత్మక వ్యాపకంగా తెలంగాణ అంతా తిరిగాను. జీవనశైలిని, వ్యక్తులను డాక్యుమెంట్ చేశాను. ఆ సంతృప్తిని మించిందేముంది’ అన్నారు.

“నార్ల వెంకటేశ్వర్ రావు గారిని ఒకసారి ఫోటోతీస్తే ఆయన నన్ను ఆంధ్రా యుసెఫ్ క్రాస్ అని అభినందించారు.

యుసెఫ్ క్రాస్ ప్రపంచ ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్, ఆయన బెర్నార్డ్ షా, చర్చిల్, జిన్నా, హెమింగ్వే ప్రసిద్ధుల ఫోటోలు తీశారు. మన దగ్గర సాహిత్య కళా రంగాల్లో కృషి చేస్తున్న వారిని, సీరియస్ వ్యక్తులందరినీ నేను డాక్యుమెంట్ చేశాను, అయితే నాలాగే వీరంతా బీదరికం అనుభవించారు గనుక నేనూ ఆర్థికంగా ఎదగలేకపోయాను. ఆ బాదైతే వుంది. బహుశా నా ఫెయిల్యూర్ కు ఇదొక కారణం” చెప్పారాయన.

“చాలా ఇబ్బందులు పడ్డాను. నెలనెలా అద్దెకట్ట లేని పరిస్థితి వుండేది. కాలింగ్ బెల్ వినిపించినా. అపరిచిత పాదాల సవ్వడి వినిపించినా భయ పడ్డాను. చెప్పానుగా, నేను అందరిలా జీవితం గడప దల్చుకోలేదు. అనుభవిస్తున్నాను” అన్నారాయన.

సినిమా రంగానికి సంబంధించి సత్యజితీరే, సాహిత్యంలో చలం, సినిమా పాటల కొస్తే ముఖేష్. ఈ ముగ్గురినీ న

More articles

- Advertisement -

Latest article