Editorial

Monday, December 23, 2024
Song'స్వాతంత్ర్యోద్యమ శంఖారావం' - వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

‘స్వాతంత్ర్యోద్యమ శంఖారావం’ – వాడ్రేవు చినవీరభద్రుడు తెలుపు

ఆ సమయంలో ఎందుకు వచ్చిందో గాని ఆ ఆలోచన, ‘సుబ్బూ, భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని నాటకంగా మార్చి ప్రదర్శిస్తే బాగుంటుంది’ అన్నాడాయన. రెండున్నర వందల ఏళ్ళ చరిత్ర. గంటన్నర రూపకంగా మార్చాలి.  చెయ్యాల్సిందే” అన్నాడు.

“మరి రచయిత?”

‘ఇడుగో’ సుబ్బూ నన్ను చూపించాడు.

…..

మొన్న ఒక సాహిత్యసభలో నన్ను వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఓ మిత్రురాలు ‘ఏమి నేల తల్లీ, ఇది పనికిరాని బీడు’ పాట గుర్తుచేసింది. ఆ మాటలు వింటూనే నేను ఉలిక్కి పడ్డాను. ఎన్నాళ్ళయినా ఈ పాట నాతో ప్రయాణం చేస్తూనే ఉందే అనుకున్నాను.

వాడ్రేవు చినవీరభద్రుడు

రాజమండ్రిలో ఒకప్పుడు టి.జె.రామనాథం అనే గొప్ప రంగస్థల ప్రయోక్త ఉండేవాడు. గురజాడ కళా సమితి అనే సంస్థ ద్వారా అభ్యుదయ భావాలు కలిగిన గొప్ప రూపకాల్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు. ధవిళేశ్వరంలో ఇరిగేషన్ డిపార్ట్ మెంటులో ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. రాజమండ్రి సాహితీవేదికలో సభ్యుడు. ఆయన్ని మిత్రులంతా ‘గురువు’ గా పిలుస్తూండేవారు, కొలుస్తుండేవారు.

1983 లో నన్నయ సహస్రాబ్ది ఉత్సవాలు రాజమండ్రిలో ఘనంగా జరిగేయి. ఆ సందర్భంగా మా మిత్రుడు మహేశ్ రామనాథంతో కలిసి ‘నన్నయ భారత రచన’ అనే ఒక డాక్యుమెంటరీ రూపకం రూపొందించాడు. డాక్యుమెంటరీ రూపకం దశవిధ రూపకాల్లోనూ లేని పదకొండో ప్రక్రియ. అందులో సాంప్రదాయిక నాటకసన్నివేశాలతో పాటు, సంగీతం, నాట్యం, షాడో ప్లే, మైమ్ లతో పాటు ఫ్లాష్ బాక్ కూడా ఉంటుంది. నాకు తెలిసి ఆధునిక నాటకరంగంలో సురభి కళాకారుల తరువాత రంగస్థలాన్ని అంతగా ఆకట్టుకునేలాగా రూపొందించగలిగింది రామనాథమే అనుకుంటాను.

నాకు తెలిసి ఆధునిక నాటకరంగంలో సురభి కళాకారుల తరువాత రంగస్థలాన్ని అంతగా ఆకట్టుకునేలాగా రూపొందించగలిగింది రామనాథమే అనుకుంటాను.

నన్నయ భారత రచన గొప్ప హిట్. ఆ రోజుల్లో ఆ బృందం హైదరాబాదు వెళ్లి అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు ముందు కూడా ప్రదర్శించి ప్రశంసలు పొందారు. కాని ఆ ప్రదర్శన చాలా ఖర్చుతో కూడిన పని. ఒకసారి ప్రదర్శనకే ఆ రోజుల్లో లక్షనో, రెండు లక్షలో అయ్యేది. ఆ సొమ్మంతా మా మిత్రుడు సమాచారం సుబ్రహ్మణ్యం ఎవరో స్పాన్సరర్ల ద్వారా పట్టుకొచ్చేవాడు.

ఆ మరుసటి ఏడాది కూడా మళ్ళా ఆ రూపకాన్ని మరోసారి ప్రదర్శించాలని ఆలోచనలు జరుగుతున్నప్పుడు రామనాథం తనకి మరో కొత్త సబ్జెక్టు చేయాలని అనిపిస్తోందని చెప్పాడు. దేని మీద చేస్తే బావుంటుంది? అనేక సామాజిక సమస్యలమీద ఆయన అప్పటికే ‘నరకం మరెక్కడో లేదు’, ‘గోగ్రహణం’, ‘భయం’ లాంటి రూపకాలు ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఆ సమయంలో ఎందుకు వచ్చిందో గాని ఆ ఆలోచన, సుబ్బూ, భారతదేశ స్వాతంత్ర్య పోరాటాన్ని నాటకంగా మార్చి ప్రదర్శిస్తే బాగుంటుందని అన్నాడు. రెండున్నర వందల ఏళ్ళ చరిత్ర. గంటన్నర రూపకంగా మార్చాలి. రామనాథానికి అందులో ఛాలెంజి అర్థమయింది. చెయ్యాల్సిందే అన్నాడు.

మరి రచయిత?

‘ఇడుగో’ సుబ్బూ నన్ను చూపించాడు. రామనాథం నాకేసి చూసాడు. అప్పటికి నాకు ఇరవై రెండేళ్ళు. సరే అన్నాడు.

నేను చాలా సంతోషంగా ఆ మర్నాటికల్లా ఇరవై ముప్పై పేజీల రచన చేసి తీసుకువెళ్ళి సుబ్బూకి చూపించాను. వాడు ‘చాలా బాగుంది. కాని గురువుతో ఇలా నడవదు. ఆయన రిహార్సల్సు మొదలుపెట్టాక ఈ స్క్రిప్టు మార్చుకుంటూ పోతాడు. కాబట్టి నువ్వు రోజూ ఆ రిహార్సల్స్ లో ఆయన దగ్గర ఉండాలి’ అన్నాడు. రిహార్సల్స్ ఎప్పుడు జరుగుతాయి, ఎక్కడ అన్నాను. ‘ధవిళేశ్వరంలో. రోజూ రాత్రి పదింటికి మొదలై తెల్లవారేదాకా జరుగుతాయి. బహుశా నెల్లాళ్ళపాటు జరుగుతాయి’ అన్నాడు.

నా గుండెలో రాయి పడింది. రోజూ పగలంతా ఆఫీసు పనిచేసుకుని రాత్రికి ధవిళేశ్వరం వెళ్ళి, తెల్లవారేదాకా అక్కడ గడిపి మళ్ళా మర్నాడు ఆఫీసుకి వెళ్ళాలా? కాని ఏమి చెయ్యను? అది వాళ్ళతో ఉన్న అనుబంధమో లేకపోతే ఆ రోజుల్లో ఉండే ఉత్సాహమో తెలియదు.

నా గుండెలో రాయి పడింది. రోజూ పగలంతా ఆఫీసు పనిచేసుకుని రాత్రికి ధవిళేశ్వరం వెళ్ళి, తెల్లవారేదాకా అక్కడ గడిపి మళ్ళా మర్నాడు ఆఫీసుకి వెళ్ళాలా? కాని ఏమి చెయ్యను? అది వాళ్ళతో ఉన్న అనుబంధమో లేకపోతే ఆ రోజుల్లో ఉండే ఉత్సాహమో తెలియదు. రోజూ సాయంకాలం నేనూ, మహేశ్ సైకిళ్ళ మీద ధవిళేశ్వరం వెళ్ళి ఆ రాత్రంతా రిహార్సల్స్ లో గడిపి ఏ తెల్లవారు జామునో గోదావరి గట్టమ్మట పేపరు మిల్లు బాట పట్టేవాళ్ళం.

జాతీయోద్యమం మీద నేను రాసిన ఆ రూపకానికి ‘స్వాతంత్ర్యోద్యమ శంఖారావం’ అని పేరుపెట్టాం. దానిలో వీలైనన్ని జాతీయ గీతాలు ఉండాలనుకున్నాం. కొన్ని లబ్ధప్రతిష్టులవీ, కొన్ని అంతగా నలుగురికీ తెలియనివీ. కొన్ని మేము రాయాలనుకున్నవీ.

రూపకం మొదలవుతూనే భారతదేశ గతాన్ని తలుచుకుంటూ ఒక గీతం ఉండాలనుకున్నాక, ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన హిమసమూహములు’ కన్నా మించిన గీతం మరేముంటుంది? వందేమాతరం గీతంలో ఈ నాటి తరాలకి అంతగా తెలియని పంక్తులు

త్రింశత్కోటి కంఠ కలకలనినాద కరాలే
ద్విత్రింశత్కోటి కరైధృతకరకరవాలే
కే బోలే మా తుమి అబలే?

(ముప్పై కోట్ల కంఠాలు నినదిస్తుండగా, అరవై కోట్ల భుజాలు ఖడ్గాలు ధరించిఉండగా, ఎవడమ్మా నిన్ను అబల అన్నది?)

అనే వాక్యాలు తీసుకున్నాం. ఇక ‘భరతఖండంబు చక్కనిపాడియావు’, ‘మాకొద్దీ తెల్లదొరతనమూ ‘, ‘వీరగంధము తెచ్చినారమూ’, ‘పాడవే రాట్నమా ప్రణవ భారతగీతి ‘వంటి గీతాలు ఉండకుండా ఎలా ఉంటాయి? బసవరాజు అప్పారావు గీతం ఒకటైనా పెట్టుకున్నామో లేదో గుర్తు లేదు గాని, జలియన్ వాలా బాగ్ దురంతాన్ని చిత్రిస్తున్నప్పుడు, కొండపల్లి జగన్నాథ దాసు గారు రాసిన, గుండెల్ని కరిగించే ఈ పాటని ఎంచుకున్నాం.

కనుల నీరు కారునుగా కరుణలేక యా
డయ్యరొనర్చిన వధ వినిన
జలియన వాలా బాగున చచ్చిన
జనము లెక్క లేదుకదా
అబలలు బాలకులెందరీల్గిరో
అసలే తెలియదుగా.

నా మిత్రుడి వాక్యాల్లో ఉన్న స్ఫూర్తి అందులో లేదు. ‘దండి కడలి తీరంలో సూర్యోదయమవుతోంది’ అంటున్నప్పుడు దండి భారతదేశానికి పడమటి దిక్కున ఉన్నదనీ, అక్కడ ఉప్పుసత్యాగ్రహం వల్ల పడమటి దిక్కున సూర్యోదయమవుతున్నట్టుందనే స్ఫూర్తి ఉందందులో.

ఇక జాతీయోద్యంలో పందొమ్మిదో శతాబ్దపు ముఖ్యఘట్టాలకోసం అవసరమైన పాటలు నేను, ఇరవయ్యవ శతాబ్దపు ముఖ్య ఉద్యమాల మీద మహేశ్ పాటలు రాయాలనుకున్నాం. మహాత్ముడు నిర్వహించిన మూడు ముఖ్యమైన ఉద్యమాలు సహాయనిరాకరణం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియాలతో పాటు నేతాజీ ఛలో డిల్లీ పిలుపు మీద కూడా అతడు పాటలు రాసాడు. ఆ పాటలు నాకిప్పుడు గుర్తు లేవుగాని, దండి యాత్ర మీద అతడు రాసిన పాట పల్లవి నా మనసులో నాటుకుపోయింది.

‘దండి కడలి తీరంలో సూర్యోదయమవుతోంది
తెల్లవారి పాలన ఇక అస్తమించబోతోంది’

అప్పట్లో ఆంధ్రకేసరి పైన సినిమా వస్తే, ఉప్పు సత్యాగ్రహం మీద ఒక పాట తప్పకుండా ఉంటుందని ఊహించి, పరుగున పోయి చూస్తే, శ్రీ శ్రీ పాట:

‘పదండి దండు దండుగా పదండి దండయాత్రగా
ప్రకాశ సింహ గర్జనల్ దిగంతరాలు నిండగా’

ప్చ్! శ్రీ శ్రీ తేలిపోయాడనిపించింది. ఆయన ఆ పాట మరీ ‘ప్రొఫెషనల్ ‘గా రాసాడు. నా మిత్రుడి వాక్యాల్లో ఉన్న స్ఫూర్తి అందులో లేదు. ‘దండి కడలి తీరంలో సూర్యోదయమవుతోంది’ అంటున్నప్పుడు దండి భారతదేశానికి పడమటి దిక్కున ఉన్నదనీ, అక్కడ ఉప్పుసత్యాగ్రహం వల్ల పడమటి దిక్కున సూర్యోదయమవుతున్నట్టుందనే స్ఫూర్తి ఉందందులో. అంతేకాదు, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంలో సూర్యోదయమవుతున్నదంటే సూర్యాస్తమయం అయిపోయిందనే కదా. ఇలా చాలా ఉంది ఆ రెండు వాక్యాల్లో.

నేను నాలుగో అయిదో పాటలు రాసాను. అందులో గాంధీజీ భారతదేశానికి రాకముందు ప్రాణాలు అర్పించిన టెర్రరిస్టు వీరుల్ని స్మరిస్తూ ఒక పాట:

అనల కిరీటం అనల కిరీటం
శతఘ్ని ఎదటనె స్వేచ్ఛాగానం
కారాగారం, బహిష్కారం
ఉరికంబాలూ లెక్కకు రావు
లేతబుగ్గలు, రంగుల కలలు
అగ్నినాల్కల మృత్యువు కౌగిలి
రుధిర ప్లావిత స్వరాజ్యపుష్పం
అమ్మ కొప్పులో అలంకరిద్దాం
అమర్ రహే ఇక అమర్ రహే
అమర్ రహే అమర్ రహే.

1757 నుంచి 1857 దాకా ఆ నూరేళ్ళ కాలం అత్యంత దారుణమైన కాలం. ఆ వందేళ్ళ దోపిడీనీ, అది ఒక స్వయంపోషక ఆర్థిక వ్యవస్థను ఎట్లా ఛిన్నాభిన్నం చేసిందో వివరిస్తూ రాసిన పాట అది.

ఇన్నాళ్ళయ్యాక వెనక్కి చూసుకుంటే ఇందులో మాత్రలు తప్పినట్టు కనిపిస్తోందిగాని, ఆ లోటు ఏ మాత్రమూ తెలియకుండా అద్భుతంగా స్వరపరిచాడు నాగేశ్వర రావు అనే వయొలిన్ మాంత్రికుడు. మహోజ్జ్వలంగా గానం చేసాడు నా మిత్రుడు ఎర్రాప్రెగడ.

మరొక రెండు పాటలు కాక, ఇదిగో మొన్న మళ్ళా విన్నానే ఆ పాట ‘ఏమి నేల తల్లీ ఇది పనికిరాని బీడు ‘ అనే పాట కూడా రాసాన్నేను. 1757 లో ప్లాసీ యుద్ధంలో ఈస్టిండియా కంపెనీ గెలిచి భారతదేశంలో వలసపాలన మొదలయినప్పుడు ఎవరో జోస్యం చెప్పారుట, కంపెనీ పాలన వందేళ్ళు కొనసాగుతుందని.

1857 తిరుగుబాటుకి ప్రోద్బలం కలిగించిన శక్తుల్లో ఆ నమ్మకం కూడా ఒకటని చెప్తారు. 1757 నుంచి 1857 దాకా ఆ నూరేళ్ళ కాలం అత్యంత దారుణమైన కాలం. ఆ వందేళ్ళ దోపిడీనీ, అది ఒక స్వయంపోషక ఆర్థిక వ్యవస్థను ఎట్లా ఛిన్నాభిన్నం చేసిందో వివరిస్తూ రాసిన పాట అది. అంతేకాదు, నాటకం దృష్ట్యా, వందేళ్ళ కథని వడివడిగా చెప్పుకుపోవడానికి ఒక అవకాశం కూడా. ఆ పాటలో రెండవ వాక్యంలో ‘ఇది సమాధి రాళ్ళ వీడు’ అనే మాటలు మహేశ్ వి. తక్కిందంతా నా పాట:

ఏమి నేల తల్లీ ఇది పనికిరాని బీడు
ఇది రత్న గర్భ కాదు, సమాధి రాళ్ళ వీడు
ఎటుల జరిగెనమ్మ ఆ ఘోర దారుణమ్ము
అది పలకలేదు భాష, నూరేళ్ళ దీన ఘోష.

ప్రతి పల్లెసీమలోన పాడేటి కదురులేవి
సంద్రాల ఆవలున్న యంత్రాలు మింగెనమ్మ
అందాల బరిణ పట్టె మజిలీను చీరలేవి
తెగినట్టి బొటనవేళ్ళ చేనేతవారినడుగు.

ముత్యాల రాశులమ్మే బాజారు వీథులేవి
తిండిలేక మాడే కంకాళ కోటినడుగు
ఆడాళ్ళ పసిడి నగలు ముంజేతి మురుగులేవి
తాకట్టు ఊబిలోన ఒకటొకటి జారెనమ్మ.

బలోపేతులైన నవయువకులేరి తల్లీ
మనవాళ్ళు తెచ్చినట్టి జగడాలపోరు నడుగు
గంధర్వగానములతో రంజిల్లువారలేరి
బానిసలుగ మార్చి నిర్జించినారు తల్లీ.

ఇంతపీడలోన మేమెట్లు బతకగలము
దేవుడన్నవాడు చూపించలేడ జాలి
కొత్త జీవితమ్ము అది దేవుడివ్వలేడు
తిరుగుబాటు చేసి తేవాలి దాన్ని తిరి%9

More articles

1 COMMENT

Comments are closed.

- Advertisement -

Latest article