TAG
Riddle
లతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచునుండు…
కాయ మీది మాను, కడు రమ్యమై ఉండు
మాను మీద లతలు మలయుచుండు
లతల మీద వ్రేళ్ళు లాస్యమాడుచునుండు
దీని భావమేమి తిరుమలేశ !
వీణ
చినుకుల వేళలో విడుపు ఈ పొడుపు కథ
పొడుపు
చిటపట చినుకులు చిటారి చినుకులు
ఎంత కురుసినా వరదలు రావు
కన్నీళ్లు
మరేమిటో తెలుపు
పదములారు కలవు బంభరంబు కాదు, తొండం ఉంది గాని దోమకాదు, రెక్కలుండు గాని పక్షి కానేరదు- అయితే మరేమిటి?
ఈగ
చక్రం – శంఖం
పల్లె ప్రజల పాండిత్య ప్రకర్షకు నిదర్శనం పొడుపు కథలు. నేటి పొడుపు కథ చూడండి...
అడ్డం కోస్తే చక్రం - నిలువు కోస్తే శంఖం
ఉల్లిపాయ
యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము?
పిల్లలకు ఉచితము! పెద్దలకు బహుమానము!! యూవతీ యువకులకు అపురూపము, అందరికీ ఇష్టము?
ముద్దు