TAG
Poem
కైతదాత: నలిమెల భాస్కర్
సరాసరి సిరా నీళ్లు పారిస్తూ
శ్రద్ధగా కలంతో దున్ని
నాట్లు వేస్తాను అక్షరాల్ని
కాగితాల కమతాల్లో.
అడ్డదిడ్డంగా ఆగమాగంగా
మెదట్లోంచి వచ్చి చేరిన
పనికి మాలిన పదాల్ని
కలుపుతీస్తాను పొలాల్లో.
మూడు నెళ్ళకో ఆరు మాసాలకో
నా కవిత్వం అచ్చై వస్తే పత్రికలో
పంట చేతికి అందివచ్చినట్లు
కాంతులీనుతూ...
అతను నేరస్థుడు కాడు : కలేకూరి అనువాద కవిత
కలేకూరి ప్రసాద్
అతను బందీగా వున్నా సరే..
అతను నేరస్థుడు కాడు
అతను పరారీలో వున్నా సరే.
అతను నేరస్థుడు కాడు..
అసలు నేరస్థుడు వాడు..
అ గద్దె మీద కూర్చున్నవాడు
*వరవరరావు, గద్దర్ ల కోసం కలకత్తా ఎఐఎల్ ఆర్ సి...
తంగేడు పూలు – డా. ఎన్. గోపి
మలిదశ ఉద్యమంలో కాదు, అంతకు ముందే, సరిగ్గా చెప్పాలంటే 1967లోనే శ్రీ ఎన్. గోపి గారి హృదయం నుంచి వ్యక్తమైన బంగారు కవిత ఇది. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణా చిత్తరువును తెలుపు...
అశ్రువొక్కటి చెక్కిలిపై… సయ్యద్ షాదుల్లా కవిత
సయ్యద్ షాదుల్లా
ఊపిరి అందడం లేదు
గట్టున పడేసిన చేపలా
కొడిగట్టిన దీపంలా
కొట్టుకుంటున్నాయి ఊపిరి తిత్తులు గిలగిలా
నా శ్వాసనిశ్వాసలతో మృత్యువు దాగుడు మూతలాడుతున్నట్టుంది
ఎందుకో మృత్యువే గెలుస్తుందని నా అలసిన గుండె బేలగా చెబుతుంది
కరోన మృత్యుశయ్య ఇంత కఠినంగా...
ముసలి గని కార్మికుడు
అనిల్ బత్తుల
అతను ఒంటరి ముసలి గని కార్మికుడు.
భార్య ఎప్పుడో కాలం చేసింది.
మెట్ల బావిలో బొక్కెన వదిలినట్లు
కొండపై నుండి ప్రియురాలు లోయలో దూకినట్లు
ఆలోచన సరస్సులో గుర్రం తలను వేలాడదీసినట్లు
అతను ఆ బొగ్గు గని లోతుల్లోకి...
నా కొద్దు! – పద్మలత అయ్యలసోమయాజుల
వినండి. నాకొద్దు అంటున్న ఈ కవితను.
వినండి ఒక సంగీతాన్ని గానాన్ని లయ నాట్యాన్ని.
జలతారు మోహంలో తడిసి నవయవ్వనిగా మారి మరో పరంపరగా సాగిపోతున్న పద్మలతను.
‘మరో శాకుంతలం’ రచయిత్రిని.
సిద్దార్థ కవిత : జీవి మాయ
జీవి మాయ
సిద్దార్థ
కొంత మంది ప్రేమించడం కోసమే పుడుతారు
యాప మాను నీడల్లాగా...
వాగు బుగ్గల్లాగా...
మనసు మీద పొడిపించుకున్న
పచ్చబొట్టుల్లాగా...
నుదిటి గీతాల రాతల్ని
అవ్యక్తం చేస్తూ
కొంతమంది తల్లులంతే
మిగిలిన ఆయింత ప్రేమను తినమని
బతిమిలాడి తినిపిస్తరు కలిముద్ద
నీకు లాగా...
గట్టు మైసమ్మ నుదిటి మీద...
ఒక టైలర్ రచన – బి.భవాని
పదివేలు పెట్టి నీవు పట్టుబట్ట తెచ్చినా
దర్జీ చేయి పడకపోతే కట్టలేవు చుట్టలేవు
హడావిడి చేసుకుంటూ రెడిమేడ్ తెచ్చినా
లూజంటు టైటు అంటూ దర్జాగా నడవలేవు
కొత్త బట్ట కట్టి నువ్వు అద్దంలో చూసుకుంటూ
నీ హుందాతనం వెనకున్నది దర్జీ...
UNDER THE TREE by SUHA
I was under the tree
I wanted to be free
Birds were seeing through me
As I was sad cause, there was no ‘we’
World was so dependent
That...
నలిమెల భాస్కర్ కవిత : పునరాగమన కాంక్ష
నవ్వోకసారి ఈ ప్రపంచాన్ని శుభ్రం చేసి వెళ్ళావు
ఇప్పుడది మళ్ళీ పాపపంకిలమై పోయింది
నీ వల్ల పరీమళ భరితం అయిన మానవ సమాజం
ఇవాళ దుర్భర దుస్సహ దుర్గంధ భూయిష్టమై
కుళ్ళీ కంపుగొడుతున్నది
తెల్లవారితే చాలు పైకం శరణం గచ్ఛామి
పొద్దు...