Editorial

Tuesday, December 3, 2024

TAG

Medicinal Plants

సుగంధి పాల : నాగమంజరి గుమ్మా తెలుపు

చలువ చేయు వేరు చల్లని యా నీరు వేరు గడ్డలనుచు పేరునొందె చిన్న ముక్క తోడ నన్నారి చేయగా సురుచి దాసులవని నరులు లేరు నాగమంజరి గుమ్మా ఈ సుగంధి పాల చెట్టు వేర్లు ఒక తీగలాగా చెట్టు మొదట్లో...

నేల తంగేడు : నాగమంజరి గుమ్మా తెలుపు

నేలతంగేడు మొక్కల లీల జూడు చాల నౌషధ గుణముల సబల చూడు గాలి వాలు పెరిగినట్టి వీలు చూడు పెరటి మొక్కగా పెరగదు బీడు చాలు నాగమంజరి గుమ్మా మనం ప్రత్యేకించి నాటే పని లేకుండా కేవలం గాలికి పెరిగి...

వస : నాగమంజరి గుమ్మా తెలుపు

పాప మాటలాడ వసపిట్ట యనుచును మురిసిపోనిదెవరు ముద్దులాడి? వసను రంగరించి రసనకు నాకించు సంప్రదాయముండె జనులలోన నాగమంజరి గుమ్మా పూర్వం మనదేశంలో అన్ని పల్లెసీమలలో పుట్టిన ప్రతి బిడ్డకు పురిట్లోనే వస కొమ్మును చనుబాలతో అరగదీసి పట్టేవారు. ఇప్పటికీ ఈ...

సరస్వతి ఆకు : నాగమంజరి గుమ్మా తెలుపు

బుద్ది జ్ఞాపకశక్తుల నొద్దికగను మనకు నొసగు మండూకపర్ణి నయముగను బ్రహ్మియు సరస్వతుల పేర్ల పరిచయమ్ము పిల్లలున్నట్టి యిండ్లను చెల్లి నిలుచు నాగమంజరి గుమ్మా బ్రహ్మి, సరస్వతి ఆకు, మండూకపర్ణి అని ఈ మొక్కకు పేర్లు. ఈ మొక్కను ఉపయోగించి బ్రాహ్మీమాత్రలు,...

నేల ఉసిరి : నాగమంజరి గుమ్మా తెలుపు

నేల ఉసిరికనుచు మేలమాడుదురేమొ ఉసిరి వేరు నేల ఉసిరి వేరు చిట్టి మొక్క చేయు గట్టి మేలును చూడు వదలరింక మొక్క వెదకకుండ నాగమంజరి గుమ్మా నేల ఉసిరి ఒక చిన్న మొక్క. ఆకుల వెనక అంటిపెట్టుకున్నట్లున్న చిన్న చిన్న...

పల్లేరు/ గోక్షుర : నాగమంజరి గుమ్మా తెలుపు

ఎక్కిళ్ళు నుదరశూలలు మిక్కిలి వాపులును, నంజు, మేహపు బాధల్ చక్కగ నశింప జేసెడి మొక్కయె పల్లేరు గాన మొక్కుము దినమున్ నాగమంజరి గుమ్మా పల్లేరు ముండ్ల కాయలతో కూడిన మొక్క. ఆయుర్వేదంలో మూత్రవిరేచన (మూత్రాన్ని జరీచేయుట) మూత్ర కృచ్రఘ్న (మూత్రంలో...

బలురక్కసి/ పిచ్చి కుసుమ/ స్వర్ణక్షీరి : నాగమంజరి గుమ్మా తెలుపు

బలురక్కసి పేరు తలువ తలనొప్పులు రా మరచును దరిదాపులకున్ నలగింజలు విష దోషము మిలమిల వన్నెల కుసుమము మేలి పసిడియే నాగమంజరి గుమ్మా మెరిసే బంగారు రంగు పూవులు, ముట్టుకోనివ్వని ముండ్లు, చిక్కితే పచ్చని పాలు, నల్లనల్లని ఆవాల్లాంటి గింజలు....

శతావరి/పిల్లపీచర : నాగమంజరి గుమ్మా తెలుపు

పిల్లపీచరనుచు పిలుచు శతావరి వందరోగములను బాపునంట పాముకాటు , దగ్గు, జ్వరము, కడుపుమంట రక్తశుద్ది వంటి రకరకములు నాగమంజరి గుమ్మా ఆయుర్వేద వైద్యంలో ప్రముఖంగా శతావరి లేహ్యం, శతావరి పొడి లభిస్తూఉంటాయి. వంద వ్యాధులను నివారించగలదు అని శతావరికి అర్ధం.దీన్నే...

వెంపలి / శరపుంఖ : నాగమంజరి గుమ్మా తెలుపు

శరపుంఖ మనెడి పేరిట సరియగు నౌషధమిది జన సామాన్యమునన్ పరిసరముల వెంపలియని పరిచితమౌ పేర తెలియు పల్లెల యందున్ నాగమంజరి గుమ్మా వెంపలి , శరపుంఖ tephrosia purpurea అనే పేరిట పెరిగే చిన్న మొక్క లేదా పొద. బచ్చలి...

మురిపిండి / కుప్పింట : నాగమంజరి గుమ్మా తెలుపు

కుదురుగాను మొక్క కుచ్చులా పత్రాలు చూడ చక్కనమ్మ జాడ కనరె మొక్కపేరు తెలియ మురిపిండి , కుప్పింట దారి పక్కనుండు తట్టి చూడు నాగమంజరి గుమ్మా దారికిరువైపులా జాగ్రత్తగా పరిశీలిస్తూ పోతే చక్కని కుచ్చిళ్ళు పోసినట్లున్న ఆకులతో ఒక మొక్క...

Latest news