TAG
Five elements
కవిత్వం – బండారు జయశ్రీ
నిప్పులు చీమ్ముతూ నీలదీస్తుంది
కవిత్వానిది అగ్నితత్వం
పరిమళమై నలుదిశలా వ్యాపిస్తుంది
కవిత్వానిది వాయుతత్వం
సెలయేరులా ప్రవహిస్తుంది
కవిత్వానిది జలతత్వం
ప్రపంచమంతా పరుచుకుంటుంది
కవిత్వానిది నేలతత్వం
ఉరుములు మెరుపులను తనలో ఇముడ్చుకుంటుంది
కవిత్వానిది నింగితత్వం
కవిత్వం
పంచాభూతాత్మకం
జయశ్రీ బండారు