TAG
బండారు జయశ్రీ
Father’s Day : వెన్నెల పాట – బండారు జయశ్రీ కవిత
అడివి పూసినా
వెన్నెల కాసినా
కాలువలు పారినా
సముద్రం నిండినా
టేకుపూల సోయగాన్ని
ఇప్పపూల పరిమళాన్ని
ప్రకృతిలోని ప్రతి సౌందర్యాన్ని
చెట్లు గుట్టలే కాదు
అడివి అడివంతా పరిచయం చేసింది మా నాన్నే
సమాజాన్ని చదవడం
సమస్యల్ని ఎదుర్కోవటం
నేర్పింది మా నాన్నే
మానవసేవే మాధవ సేవనీ
ఆపదలో వున్న వాళ్ళను...
కవిత్వం – బండారు జయశ్రీ
నిప్పులు చీమ్ముతూ నీలదీస్తుంది
కవిత్వానిది అగ్నితత్వం
పరిమళమై నలుదిశలా వ్యాపిస్తుంది
కవిత్వానిది వాయుతత్వం
సెలయేరులా ప్రవహిస్తుంది
కవిత్వానిది జలతత్వం
ప్రపంచమంతా పరుచుకుంటుంది
కవిత్వానిది నేలతత్వం
ఉరుములు మెరుపులను తనలో ఇముడ్చుకుంటుంది
కవిత్వానిది నింగితత్వం
కవిత్వం
పంచాభూతాత్మకం
జయశ్రీ బండారు