‘తానా’ – ‘మంచి పుస్తకం’ సంయుక్తంగా నిర్వహించిన పిల్లల నవలల పోటీల్లో బహుమతి పొందిన ‘రక్ష’ రేపటి నుంచే తెలుపు ధారావాహికంగా ప్రచురిస్తోంది. ఈ సందర్భంగా రచయిత పరిచయ పాఠం తొలిగా…
రచయిత డా.వి.ఆర్. శర్మ పూర్తి పేరు విఠాల రాజేశ్వర శర్మ. వారు విశ్రాంత ప్రధానోపాధ్యాయులు. కామారెడ్డి వాస్తవ్యులు.
యం.ఏ., యం.ఓ.యల్., యం.ఫిల్.,పిహెచ్ డి చదివిన శర్మ గారు గారు తెలుగు భాష బోధనతో తన ఉద్యోగ జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. పేరు, ప్రఖ్యాతి, కీర్తి ప్రతిష్టల జోలికి వెళ్ళకుండా తలవంచి గొప్ప సాహిత్య వ్యవసాయం చేస్తున్నారు. ముఖ్యంగా బాల సాహిత్యానికి వారు చేసిన సేవ అమూల్యమైనది. అపురూపమైనది. వారు అనేక సాహిత్య సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ వారే ఒక సంస్థ అనడం సముచిత గౌరవం. రేపటి నుంచి మీరు చదివే ‘రక్ష’ వారి సైన్స్ ఫిక్షన్ నవల.
వారి కవితా సంపుటుల్లో ఒకటి ‘తెల్ల చీకటి’ కావడం యాదృచ్చికం కాదనే తెలుపు భావిస్తున్నది. ‘తెలుపు’ మొదటి నవల వారిది కావడం గర్వకారణంగా భావిస్తున్నది.
తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ బాలసాహిత్య పరిషత్తులో చురుగ్గా పనిచేసిన శర్మ గారు ‘పిల్లల లోకం’ అనే బాల సాహిత్య వేదికకు వ్యవస్థాపక అధ్యక్షులు కూడా. వారు వెలువరించిన పుస్తకాలలో మొదట కవితా సంపుటుల గురించి చెప్పుకుంటే చాలు వారి భావుకత ఎంత నిర్మలమో భోదపడుతుంది. రచయిత మనసు తేట తెల్లమవుతుంది. అన్నట్టు, వారి కవితా సంపుటుల్లో ఒకటి ‘తెల్ల చీకటి’ కావడం యాదృచ్చికం కాదనే తెలుపు భావిస్తున్నది. ‘తెలుపు’ మొదటి నవల వారిది కావడం గర్వకారణంగా భావిస్తున్నది.
శర్మ గారు వెలువరించిన ఆ ఎనిమిది కవితా సంపుటులు ఇవి:
వానపూల కొండ ( 1996 ), తెల్ల చీకటి (2002), సూర్యుడు అనేక రంగుల్లో ఉదయిస్తాడు (2002 ), తెలంగాణ (1994), ప్రత్యేక తెలంగాణ (2009), నాలుగున్నర కోట్ల నదుల హోరు (2010 ), మా ఊరి మట్టివాసన (2007), గులేర్ (జంట కవిత్వం-2007).
పై సంపుటులు వారి పుట్టిపెరిగిన గడ్డపై వారికున్న ఆర్తినే కాక వారి విశ్వ వ్యాప్తమైన ప్రకృతిని తెలియజేస్తున్నది.
ఇక వారు తెచ్చిన నాలుగు పాటల పుస్తకాల పేర్లు ఇవి… సూర్యుళ్ళను వెలిగిస్తూ, ఆనందం, పిల్లల కోసం, పిల్లల లోకం. అన్నట్టు, కొందరు విద్యా వేత్తలు పేరిట శర్మ గారు ఒక వ్యాస సంపుటినికూడా వెలువరించారు.
మరో ముఖ్య విషయం, ‘సాహు జీవితం – రచనలు’ వారు ఎం.ఫిల్ పరిశోధనాంశం కాగా ‘ఆధునిక కవిత్వంలో బాల్య చిత్రణ’పై వారు పి.హెచ్ డి చేయడం మరో విశేషం.
మంచి పుస్తకం – తానా నవలల పోటీల్లో బహుమతి పొందిన ఈ నవల ఒక చక్కటి అనుభూతి కలిగిస్తుందని ‘తెలుపు’ నమ్ముతోంది. ప్రచురణకు అవకాశం ఇచ్చిన ‘మంచి పుస్తకం’ సురేష్ గారికి, తానా బాధ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నది. ఈ సందర్భంగా రచయితకు అభినందనలు తెలుపు.
వారు సంపాదకత్వం వహించిన అనేక పిల్లల రచనల్లో ఆకాశం, పిల్లల లోకం, చుక్కలు, బంగారు నెలవంకలు, క్యాలి, అలలు, కవులు – పిల్లలు.. మొదలైనవి ఎన్నో ఉన్నవి.
తెలుగు విశ్వవిద్యాలయం నుండి కీర్తి పురస్కారం అందుకున్న ఈ రచయిత ఇప్పటిదాకా నాలుగు పిల్లల నవలలు రాశారు. అవి ఒకటి, కానుక, రెండు, ప్రయాణం, మూడు, బాల వర్ధన్, నాలుగవది, రేపటి నుంచి మీరు ధారావాహికంగా చదివే ‘రక్ష’.
మంచి పుస్తకం – తానా నవలల పోటీల్లో బహుమతి పొందిన ఈ నవల ఒక చక్కటి అనుభూతి కలిగిస్తుందని ‘తెలుపు’ నమ్ముతోంది. ప్రచురణకు అవకాశం ఇచ్చిన ‘మంచి పుస్తకం’ సురేష్ గారికి, తానా బాధ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నది. ఈ సందర్భంగా రచయితకు అభినందనలు తెలుపుతున్నది. పాఠకులకు క్రిస్మస్ శుభాకాంక్షలతో…
అన్నట్టు, ఈ సీరియల్ తో పాటు తెలుపు రెగ్యులర్ అప్ డేట్స్ కోసం ఫేస్ బుక్ పేజీని ఇక్కడ క్లిక్ చేసి లైక్ చేయవలసిందిగా కోరుతున్నది.
ఈ ప్రపంచంలో మనకు కనబడనిది, మనకు వినబడనిది, మన స్పర్శకు అందనిది మన చుట్టూ చాలా ఉన్నది. వింతైన ఆ ప్రపంచంలోకి తీసుకెళ్ళే ఉత్కంఠ భరిత రచన
‘రక్ష’ – డా.వి.ఆర్.శర్మ నవల
రేపటి నుంచే… ‘తెలుపు’ డైలీ సీరియల్ గా పిల్లల సైన్స్ ఫిక్షన్
ధారావాహిక ప్రచురణ మంచి ఆలోచన.పాఠక ప్రియులను అలరిస్తుదనడంలో సందేహం లేదు.
నమస్కారం గొప్ప ప్రయత్నం. అభినందనలు. ఎక్కడైన ఎప్పుడైనా హాయిగా చదువు కోవచ్చు…