Editorial

Monday, December 23, 2024
కథనాలుబొడ్డెమ్మ : కన్నెపిల్లల పండుగ - డా. బండారు సుజాత శేఖర్ తెలుపు

బొడ్డెమ్మ : కన్నెపిల్లల పండుగ – డా. బండారు సుజాత శేఖర్ తెలుపు

తెలంగాణ ప్రజలు ఎన్ని కరువు కాటకాలను, ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా తమ ఊపిరిలో ఊపిరిగా, తమ జీవన స్థితిగతులను, కష్టసుఖాలను కలబోసి జరుపుకునే పండుగ బతుకమ్మ. బతుకమ్మను బతుకునిచ్చే తల్లిగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా స్త్రీలు కొలిస్తే, ‘బొడ్డెమ్మ’ను కన్నెపిల్లలు, బాలికలు పూజిస్తారు. 

బండారు సుజాత శేఖర్

ఋతువుల పరంగా చూస్తే శ్రావణ, భాద్రపద మాసాలలో కురిసిన వర్షంతో పులకరించిన పుడమి ఆకుపచ్చని చీరె కట్టి, దిండుగా అలంకరించుకున్న స్త్రీమూర్తిలా ఆకులతో, పూలతో, రకరకాల పండ్లతో, పైరులతో ప్రకృతికి అందాన్ని తెస్తుంది. అందుకే భాద్రపద మాసంలో జరుపుకొనే ‘వినాయకచవితి’ ప్రకృతి పరంగా మట్టి గణపయ్యను తయారుచేసుకొని పూలు, పండ్లతో పాటు 21 రకాల పత్రితో పూజిస్తాం.

వినాయక చవితి నవరాత్రుల తరువాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి తొమ్మిది రోజులు అంటే ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందువచ్చే అమావాస్య వరకు జరుపుకునేదే ‘బొడ్డెమ్మ పండుగ’. మహాలయ అమావాస్యతో మొదలై అశ్వీయుజ శుద్ధ నవమి వరకు జరుపుకునే పండుగ ‘బతుకమ్మ’. అదే సందర్భంలో దుర్గా నవరాత్రులు, దసరా వేడుకలు జరుపుకుంటాం.

నిజానికి పల్లెల్లో దుర్గాదేవిని పంటల దేవతగా, నవరాత్రుల్లో ప్రకృతికి ప్రతిరూపంగా, బతుకమ్మ రూపంలో పూజించుకుంటాం.

అయితే, తెలంగాణ ప్రాంతంలో జరుపుకునే పలు పండుగల్లో బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలకు ఎంతో విశిష్టత ఉంది. వ్యవసాయాధారమైన తెలంగాణ ప్రజలు ఎన్ని కరువు కాటకాలను, ఎన్ని కష్టాలను ఎదుర్కొన్నా తమ ఊపిరిలో ఊపిరిగా, తమ జీవన స్థితిగతులను, కష్టసుఖాలను కలబోసి జరుపుకునే పండుగ బతుకమ్మ. బతుకమ్మను బతుకునిచ్చే తల్లిగా తెలంగాణ ప్రజలు ముఖ్యంగా స్త్రీలు కొలిస్తే, ‘బొడ్డెమ్మ’ను కన్నెపిల్లలు, బాలికలు పూజిస్తారు. అంటే బతుకమ్మ పెద్దవారి పండుగైతే, బొడ్డెమ్మ పిల్లల పండుగ. ఇది కన్నెపిల్లల కలల పండుగ. పెండ్లీడు కన్యలు తమకు మంచి వరుడు లభించాలన్న కోరికతో ‘బొడ్డెమ్మ’ రూపంలో ‘గౌరమ్మ’ను పూజిస్తారు. ఆటపాటలతో ఆనందిస్తారు.

అందుకే ‘బొడ్డెమ్మ’ పండుగకు గిరిజనులు జరుపుకునే ‘థీజ్ పండుగ’కు దగ్గరి పోలిక వుంది. వారుకూడా ముఖ్యంగా కన్నెపిల్లలు, బాలికలు తొమ్మిది రోజులు తమకు మంచి వరుడు దొరకాలని, తమ పెళ్ళి ఘనంగా జరగాలని కోరుకుంటూ రోజూ సాయంకాలం ఆడి పాడి పూజిస్తారు.

బొడ్డెమ్మ ఆటపాటలను ‘గర్భో’ నృత్యంతో పోల్చి చెప్పవచ్చు. ‘గర్భో’ అంటే ‘గొబ్బి’ అని ఒక అభిప్రాయం. గొబ్బిరీతిలో బొడ్డెమ్మ కూడా కన్నెపిల్లలతో, పిల్లలతో పూజలందుకుంటుంది.

అంతేకాదు బొడ్డెమ్మ ఆటపాటలను ‘గర్భో’ నృత్యంతో పోల్చి చెప్పవచ్చు. ‘గర్భో’ అంటే ‘గొబ్బి’ అని ఒక అభిప్రాయం. గొబ్బిరీతిలో బొడ్డెమ్మ కూడా కన్నెపిల్లలతో, పిల్లలతో పూజలందుకుంటుంది. అదే విధంగా తెలంగాణ మాండలికంలో ‘బొడ్డెమ్మ’ అంటే ‘రాశి’ లేక ‘కుప్ప’ అని అర్థం. బొడ్డెమ్మను ధాన్యపురాశిగా భావించే తెలంగాణ వాసులు, నిండుగా కూర్చున్నవారిని ‘బొడ్డెమ్మలా కూర్చున్నావు’ అంటుండటం వింటాం. ‘బొడ్డెమ్మ’ అనే పేరుకు ‘బొట్టి’, ‘బొడప’, ‘పొట్టి’ అనే పర్యాయపదాలు ఉన్నాయి. ‘బొడ్డ’ అంటే అత్తిచెట్టు అనే అర్థం కూడా ఉంది. దీన్నే మేడిచెట్టు, ఉదంబర చెట్టు అనీ పిలుస్తారు. సాధారణంగా సంతానం కోసం, వివాహం కోసం ఉదంబరున్ని పూజిస్తారు. ఈ ఉదంబర పూజే ‘బొడ్డెపూజ’. ఇది తెలంగాణలో పూలపూజగా మారిందని అనుకోవచ్చు. అంతేకాదు, భాద్రపదంలో సూర్యుడు కన్యారాశి ప్రవేశం చేసి ఉంటాడు. ఆ కారణం చేత కూడా ఈ పండుగ కన్నెలకే ఉద్దేశింపబడిందిగా చెప్పవచ్చు. అందుకే, కన్నెపిల్లల సంబరంగా బొడ్డెమ్మ పండుగను చెప్తారు. అయితే, బొడ్డెమ్మ పండుగ తెలంగాణ ప్రాంతంలోని కొన్ని జిల్లాల్లోనే ప్రత్యేకంగా జరుపుకుంటారు. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్, మెదక్ జిల్లాల్లో మరింత సంబరంగా బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు.

Photograph by Sharadha Hanmandlu

బొడ్డెమ్మ పండుగ – ఆచరణ విధానం

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు దసరా నవరాత్రుల వేడుకలతో పాటు జరిపేది బతుకమ్మ. ఈ పాడ్యమికి ముందు వచ్చే పున్నమిని కొన్ని చోట్ల ‘బొడ్డెమ్మల పున్నం’గ పిలుస్తారు. ఈ పున్నమి తరువాత వచ్చే పంచమి అంటే భాద్రపద బహుళ పంచమి నాటి నుండి తొమ్మిది రోజులు మహాలయ అమావాస్య వరకు ‘బొడ్డెమ్మ పండుగ’ జరుపుకుంటారు.

ఈ పండుగల వల్ల తమకు మూలమైన సంస్కృతీ సంప్రదాయాల వారసత్వాన్ని రాబోయే తరాలకు అందించే గొప్ప ప్రక్రియ మాత్రం రోజురోజుకు అంటే గ్లోబలైజేషన్ ప్రపంచంలో, కంప్యూటర్స్, రాకెట్ యుగంలో కూడా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు.

తెలంగాణ ప్రాంతంలోని ప్రజలంతా తమ సొంతం అనుకునే బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగ విధానాలలో సామ్యత ఎంత ఉందో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు, స్త్రీల అభీష్టాలు, ప్రత్యేక పంటలు, వేడుకల్లోని విధానాలు, వారి జీవన స్థితిగతులను బట్టి ఆచరణలో కొంత వైవిధ్యాలు కూడా కనిపిస్తాయి. కానీ, ఈ పండుగల వల్ల తమకు మూలమైన సంస్కృతీ సంప్రదాయాల వారసత్వాన్ని రాబోయే తరాలకు అందించే గొప్ప ప్రక్రియ మాత్రం రోజురోజుకు అంటే గ్లోబలైజేషన్ ప్రపంచంలో, కంప్యూటర్స్, రాకెట్ యుగంలో కూడా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు.

నాటి బ్రిటిష్, నిజాం ప్రభుత్వాల దుశ్చర్యల వల్ల రజాకార్ల దుర్మార్గాల వల్ల…. ఇలా ఎన్నో రకాలుగా అణగదొక్కబడి, కరువు కాటకాల్లో కొట్టుమిట్టాడినప్పటికీ, ఈనాటికి సగటు, పేదరిక జీవితాలను ‘బతుకమ్మ’ అంటిపెట్టుకునే ఉంది. బతుకమ్మ పాట సజీవంగా ఉండనే ఉన్నది.

బొడ్డెమ్మను తయారు చేసే విధానం

పండుగ వేళల్లో ప్రకృతి పురుషులను స్త్రీ శక్తి సమాహారంగా భావిస్తూ, శక్తి స్వరూపిణిని ఎన్నో విధాలుగా పూజిస్తాం. బొడ్డెమ్మ కూడా బతుకమ్మ రీతిలో త్రికోణంలో ఉన్నప్పటికీ, వీటిని పేర్చే విధానంలో భేదం ఉంది. బొడ్డెమ్మను సాధారణంగా ఈ కింది విధంగా తయారు చేసుకుంటాం.

ఒక పీట మీద పుట్టమన్నుతో ఐదు దొంతరలుగా పేర్చి ఒకటి త్రిభుజాకారంతో గోపురంగా చేస్తారు. చెక్కపీటపై నాలుగు వైపుల నాలుగు మట్టిముద్దలను పెట్టి, వాటిని బొడ్డెమ్మ బిడ్డలని పిలుస్తారు.

ఒక పీట మీద పుట్టమన్నుతో ఐదు దొంతరలుగా పేర్చి ఒకటి త్రిభుజాకారంతో గోపురంగా చేస్తారు. చెక్కపీటపై నాలుగు వైపుల నాలుగు మట్టిముద్దలను పెట్టి, వాటిని బొడ్డెమ్మ బిడ్డలని పిలుస్తారు. ఈ త్రికోణ శిఖరంపై కొన్నిచోట్ల వెంపలి చెట్టును పూజిస్తారు. మరికొన్ని చోట్ల బియ్యంతో నింపిన కలశం చెంబును ఉంచి దానిపై కొత్త రవికె బట్ట, అందులో రెండు తమలపాకులు, వాటిలో ‘పసుపు గౌరమ్మ’ను ఉంచుతారు. పీటను ముగ్గులతో అలంకరిస్తారు. గౌరమ్మను పూలు, పసుపు, కుంకుమలతో కలశాన్ని, బొడ్డెమ్మను రంగురంగుల పూలతో కొలుస్తారు.

బొడ్డెమ్మను తయారు చేసుకునే విధానాన్ని బట్టి నాలుగు రకాలుగా చెప్పుకుంటారు. అవి 1) పీట బొడ్డెమ్మ 2) గుంట బొడ్డెమ్మ 3) పందిరి బొడ్డెమ్మ 4) బాయి బొడ్డెమ్మ.

  • చెక్కపీటపై పుట్టమన్నును ఐదు దొంతర్లుగా వేస్తూ పైన కలశాన్ని పెట్టడం ‘పీట బొడ్డెమ్మ’ ప్రత్యేకత.
  • పుట్టమన్నుతో బొడ్డెమ్మను చేసి దాని చుట్టూ పందిరి వేస్తారు. అది ‘పందిరి బొడ్డెమ్మ’
  • బావిలాగా గొయ్యి తీసి తయారు చేసేది ‘బాయి బొడ్డెమ్మ’
  • గుంటల రూపంలో చేసే బొడ్డెమ్మనే ‘గుంట బొడ్డెమ్మ’.

– ఇలా ఏ రకంగా తయారు చేసినా ప్రకృతిని, భూమాతను ఒకచోట చేర్చి పూజించడం తెలంగాణ బిడ్డలకు మట్టిపట్ల, చెట్టూ చేమల పట్ల ఉన్న భక్తిని, ప్రేమను చా

More articles

1 COMMENT

  1. వ్యాసంలో పాటలు కూడా కొన్ని చేర్చితే సంపూర్ణంగా ఉండేది

Comments are closed.

- Advertisement -

Latest article