‘పైడి’ జోక్యంతో మండలాలు తెరపైకి ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానుల వివాదం ఒక ఆరని కాష్టంలా మారడం తెలుసిందే. తాజాగా జిల్లాల పునర్విభజన పేరిట ప్రభుత్వం చేపట్టిన చర్యలు మరోమారు విమర్శలకు తావిస్తోంది.
ప్రభుత్వం ఓ వైపు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు తగిన న్యాయం జరగలేదని ప్రభుత్వ ఉద్యోగులు పోరాటాలకు సమాయత్తం కావడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ పునర్విభజన అనే అభిప్రాయమూ ఉంది.
ఏమైనా ఈ అభిప్రాయాలకు తోడు జిల్లాల విభజన అన్నది సామాజిక మాధ్యమాల్లో మంచి జోరైన టాపిక్ కావడం చూస్తున్నాం. పలువురు పలు రీతుల్లో జోక్ చేయడం గమనిస్తూనే ఉన్నాం. ముఖ్యంగా అనేక మంది ప్రముఖ నేతల పేర్లు ఆయా జిల్లాల పేర్లుగా ఉండాలన్న అంశం తెరమీదికి వస్తుండగా ఆఖరికి కార్టూనిస్టు పైడి జోక్యం చేసుకొని కనీసం మండల స్థాయిలో ఈ వివాదానికి కాసింత పరిష్కారం చూపడం ఆసక్తికరం. సమంజస న్యాయం. ఏమంటారు?
పోస్టు స్క్రిప్ట్ : ఈ శారద వ్యాఖ్య సరే గానీ…ఏపీలో ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటుకు కేంద్రం బ్రేక్ వేసింది. ఈ మేరకు కేంద్ర జనగణన శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
పైడి శ్రీనివాస్ గారి పరిచయ కథనం కోసం ఈ లింక్ క్లిక్ చేసి చదువగలరు