https://www.facebook.com/IndiaCurrentAffairs/videos/463568572094627
ప్రొ.నాగేశ్వర్ గారు దాదాపు ఐదు నిమిషాల ఈ వీడియోలో అమెరికా విమానాలకు అడ్డంకిగా మారిన 5G సేవల గురించిన అనేక అంశాలను తేటతెల్లం చేయడం విశేషం.
అమెరికా విమానయాన సర్వీసులకు ఏర్పడ్డ అంతరాయం వెనకాల ఉన్న ఈ 5G టెలికాం ఇంటర్నెట్ సర్వీసు ఏమిటి? దాని వినియోగం వల్ల అందుబాటులోకి రానున్న మరింత మెరుగైన రకరకాల సేవలు ఏమిటి? అసలు అమెరికా విమానయాన సేవలకు ఈ సర్వీసు వల్ల ఏర్పడ్డ అంతరాయం ఏమిటి? వీటి గురించి ప్రొ. కె. నాగేశ్వర్ గారు వివరిస్తున్నారు. టెక్నాలజీ ఎలాంటి కొత్త సవాళ్ళను తీసుకొస్తుంది అనడానికి కూడా ఇదొక మంచి ఉదాహరణ అంటున్నారాయన.
ఇప్పుడు అందుబాటులో ఉన్న 4G కన్నా పదింతల వేగంగా 5G సేవలు (5th generation mobile network) సమాచారాన్ని చేరవేస్తాయని, ఐతే, అమెరికా విమానయాన సంస్థలు వాడుతున్న ఫ్రీక్వెన్సీకి దగ్గరగా ఈ 5G టెలికాం సేవల ఫ్రీక్వెన్సీ కూడా ఉన్నందున, ఒకే సి బ్యాండ్ వాడుతూ నడిచే ఈ రెండు రకాల సర్వీసుల మధ్య ‘ఇంటర్ ఫేస్’ ఏర్పడి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, అందుకే తాత్కాలికంగా ఈ సేవలను నిలిపివేశారని వివరంగా తెలియజేస్తున్నారు. వినండి. వివరాలు తెలుపు వారి వీడియో.
కె.నాగేశ్వర్ గారి సంక్షిప్త పరిచయం
తెలుగు నాట ‘అనాలిసిస్’కి కేరాఫ్ గా నిలిచిన శ్రీ కె.నాగేశ్వర్ గారు మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం ఏదులాపురం వాస్తవ్యులు. వారి విశ్లేషణ వినని తెలుగు వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వారు మాజీ శాసన మండలి సభ్యులు, ఉస్మానియా జర్నలిజం శాఖ అధిపతిగా పని చేశారు. ది హన్స్ ఇండియా ఆంగ్ల దినపత్రికకు ప్రధాన సంపాదకులుగా, హెచ్.ఎం. టివి ఎడిటర్ గాను, అలాగే 10 టీవి తెలుగు న్యూస్ ఛానల్ కు ఛైర్మన్ గానూ పనిచేశారు. ప్రస్తుతం ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమలతో సహా అన్ని రకాల మాధ్యమాల ద్వారా రాజకీయ ఆర్ధిక సామాజిక అంశాలు, సమకాలీన సమస్యలపై వారు అప్పటికపుడు స్పందించి విశ్లేషణ అందిస్తుంటారు. వారి వాణిని వినడం అంటే వర్తమాన అంశాలపట్ల ఎరుక కలిగి ఉండటమే అనాలి.