“కొన్ని విషయాలు ఎవరు చెబుతే మైండ్ ఓపెన్ అవుతుందో వాడే పూరి జగన్నాథ్. FLOP సినిమాలను ఆదరించవలసిన ఆవశ్యకతపై ఎంత చక్కగా చెప్పారో వినండి.
కందుకూరి రమేష్ బాబు
Puri Musings పేరుతో పూరీ జగన్నాథ్ పంచుకుంటున్న అనుభవాలు, అభిప్రాయాలు, ఆలోచనలు నిజంగానే విలువైనవి. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు ఇచ్చిన ఈ దర్శకుడు ఒక దశలో ఆర్థికంగా ఎంత చితికిపోయరో మీరు వినే ఉంటారు. ఆ అనుభవంతోనే కాదు, పరిశ్రమలోనే వ్యక్తి అనే కాదు, ఒక భిన్నమైన ఆలోచనా సరళి గల వ్యక్తిగానూ అతడు ప్రత్యకం. అతడి మ్యూజింగ్స్ ఇంటరెస్టింగ్. ఫ్లాప్ సినిమాల గురించి చెబుతూ అవే పరిశ్రమకు అన్నం పెడుతున్నాయని చెప్పి విస్మయపరుస్తాడు.
సినీ కళామతల్లి సిగలో వాడిన ఆ పుష్పాలే ముఖ్యం
“కళామతల్లి కడుపున ఎక్కువ పుట్టింది ఆ ఫ్లాప్ డైరెక్టర్లే. మీరు ఎత్తుకోవాల్సింది బ్లాక్ బస్టర్లను తీసిన డైరెక్టర్లను కాదు, వీళ్ళనే అంటూ సినీ పాత్రికేయులకే కాదు, ప్రేక్షకులందరితో తన మనసు పంచుకున్నారు పూరీ. వినండి…అనునిత్యం పడి లేచే ఈ కడలి తరగను…
Puri Musings : విపశ్యన గురించి చెప్పింది ఇక్కడ వినండి