నిన్నటి కథ
‘సరే,’ అంటూ వాళ్లు లేచి నిలబడ్డారు. రక్ష కూడా వాళ్లతో కలిసి బయలుదేరింది. వాళ్లు వెళ్లిన తరవాత, కాసేపు అటు వైపే చూస్తూ నిలబడ్డాడు శరత్. ‘నాకు కొన్నేళ్ల కిందట జరిగిన అనుభవం లాంటిది రక్షకు ఏదైనా జరిగి ఉంటుందా? ఎందుకో ఈ రోజు రక్ష ఎప్పటిలా సహజంగా లేదు. ఏదో జరిగిందని నా సిక్త్ సెన్స్ చెపుతోంది… ఏమై ఉంటుంది?’ అని శరత్ అనుకున్నాడు.
పదో అధ్యాయం
డా.వి.ఆర్.శర్మ
శరత్ దగ్గరికి వెళ్లి వచ్చిన తరవాత, రక్షకు తన అనుభవాలు నిజమై ఉండొచ్చని అనిపించింది. ‘కానీ అది ఖచ్చితంగా నిజమేనని తెలియాలంటే ఏం చేయాలి? అమ్మ డ్యూటీకి వెళ్లింది. నాన్న ఇక్కడ లేరు. తనకు ఇంకా స్కూల్ ప్రారంభం కాలేదు. ఏం చేయాలి? తన అనుభవాలు నిజమేనా? ఎవరితో పంచుకోవడానికి లేదు. చెపితే తనకు పిచ్చి పట్టిందనే అనుకుంటారు. కానీ ఒక వేళ తన అనుభవం నిజమే అయితే?’ అలా ఆలోచిస్తూ సోఫాలో కూర్చున్న రక్షకు మెల్లగా కళ్లు మూతలుపడ్డాయి. కళ్ల ముందు ఏవేవో దృశ్యాలు కనబడుతున్నాయి.
చుట్టూ పర్వతాలు. తాను ఆ పర్వతాల మధ్యన నడుస్తూ ఎటో వెళుతోంది. దూరంగా పర్వతాల మీద తెల్లగా మంచు నిండి ఉన్నట్టు కనబడుతోంది, వాటిని మేఘాలు చుట్టుకుని మెల్లగా కదులుతున్నాయి. దగ్గరలో పర్వతాల ఒడిలో, ఒక కొండవాలులో ఏదో ఊరు ఉన్నట్టుంది. చిన్న చిన్నగా కొన్ని ఇళ్లు కనబడుతున్నాయి. తాను వెళుతున్న వైపు కొంత దూరంలో కొండ మీద ఒక బౌద్ధ ఆరామం లాంటిది ఏదో కనబడుతోంది. తాను అటు ఎందుకు వెళుతోందో తెలియదు. కానీ ఆ కొండదారిలో రాళ్ల మధ్య లోంచి నడుస్తూ వెళుతోంది. అది ఏ ప్రదేశమో? తాను ఇక్కడికి ఎలా వచ్చింది? ఎందుకు వచ్చింది? ఎటు వెళుతోంది? తెలిస్తే బాగుండును అనుకుంది. అలా అనుకుంటుండగానే ఎదురుగా కొంత దూరంలో ఎవరో ఆడ మనిషి వస్తున్నట్టు కనిపించింది. ఇంత హఠాత్తుగా ఆమె ఎలా ప్రత్యక్షమైందో రక్షకు అర్థం కాలేదు. ఆమె దగ్గరికి వచ్చిన తరవాత రక్షకు మరింత ఆశ్చర్యం కలిగింది. చిరునవ్వుతో తనను పలకరిస్తున్నట్టు చూసిన ఆ ముఖం అచ్చంగా తన ముఖం లాగే ఉంది. కాకపోతే ఆమెకు తన తల్లి వయసు ఉంటుందేమో అనుకుంది రక్ష.
రక్ష : ఇది పిల్లల సైన్స్ ఫిక్షన్ నవల. ‘తానా’ – ‘మంచి పుస్తకం’ సౌజన్యంతో ప్రచురణ. రచయిత డా.వి.ఆర్.శర్మ విశ్రాంత ప్రధానోపాధ్యాయులు, కామారెడ్డి వాస్తవ్యులు. తెలుగు భాష బోధనతో తన ఉద్యోగ జీవితాన్ని సార్థకం చేసుకున్న శర్మ గారు బాల సాహిత్యానికి చేసిన సేవ అమూల్యమైనది. వారు అనేక సాహిత్య సంస్థల్లో పనిచేస్తున్నప్పటికీ స్వయానా తానే ఒక సంస్థ అనడం సముచిత గౌరవం. ‘సాహు జీవితం – రచనలు’ వారు ఎం.ఫిల్ పరిశోధనాంశం కాగా ‘ఆధునిక కవిత్వంలో బాల్య చిత్రణ’పై వారు పి.హెచ్ డి చేయడం మరో విశేషం. మీరు చదివే ‘రక్ష’ పిల్లక కోసం వారు రాసిన సైన్స్ ఫిక్షన్ నవల. ఇప్పటివరకు శర్మ గారు 8 కవిత సంపుటులు, 4 పాటల పుస్తకాలు, రక్ష నవలతో కలిపి 4 నవలలు వెలువరించారు. వారి పూర్తి పరిచయం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. రచయిత ఇ – మెయిల్ : dr.v.r.sharma@gmail.com
“వచ్చావా తల్లీ! నీ కోసమే ఇంత కాలం ఎదురు చూస్తున్నాను. రా, తల్లీ!” అని ఆమె తన చేతిని అందించింది. అప్రయత్నంగానే ఆమె చేతిని పట్టుకుంది రక్ష. ఆమె చేయి అందుకోగానే ఏవేవో అస్పష్టమైన జ్ఞాపకాలు గుర్తొస్తున్నట్టు… తాను ఒక పసిపాపలా మారిపోయినట్టు… తాను ఆ తల్లి చేతుల్లో ఏడుస్తున్న పాపాయిలా…
ఊపిరి పీల్చడానికి కూడా ఎంతో ఆయాస పడుతున్నారు. అతడు తన చేతుల్లోంచి ఏదో వస్తువు తీశాడు. ఒక లాకెట్టులా ఉందది. ఆ బిళ్ల ఒక దారంతో కట్టి ఉంది. దానిని రెండు చేతులతో దండలా పట్టుకుని కళ్లు మూసుకుని ధ్యానించి, దానిని ఆ పసి బిడ్డ మెడలో వేశాడు.
ఊరు దగ్గర పడింది. ఇప్పుడు స్పష్టంగా కనబడుతోంది. అది పాడుబడ్డ ఊరు. ఆ కొండ మీద ఎన్ని వందల సంవత్సరాల కిందటో నిర్మించినట్టున్న ఊరు. కూలిన గోడలు, చుట్టూ శిధిలమైన ఇళ్లు. నేలంతా రాళ్లూ, రప్పలు. వాటికి కొంత దూరంలో ఒక చిన్న కొండ శిఖరాన ఒక శిధిల బౌద్ధ ప్రార్థనాలయం. అంతా తనకు తెలిసినట్టే ఉంది. తాను ఈ ప్రాంతాన్ని గతంలో ఎప్పుడో చూసినట్టే ఉంది. ఇప్పుడు తాను నడవడం లేదు. ఆమె చేతిలో పసిపాపలా, ఆమె గుండెలకు హత్తుకుని ఉంది. ఆమె పక్కన మరో వ్యక్తి ఎవరో ఉన్నాడు. అతని ముఖం తనకు సరిగ్గా కనిపించడం లేదు. ఆ ఇద్దరూ భయంతో పరిగెత్తుతున్నారు. వాళ్లను ఎవరో తరుముతున్నట్టుంది. అలా పరిగెత్తుతూ కొండ పక్క నుంచి లోయలో పారుతున్న నది దగ్గరికి చేరుకున్నారు. ఇక ముందుకు వెళ్లడానికి లేదు. చాలా దూరం పరిగెత్తుతూ వచ్చారు. ఊపిరి పీల్చడానికి కూడా ఎంతో ఆయాస పడుతున్నారు. అతడు తన చేతుల్లోంచి ఏదో వస్తువు తీశాడు. ఒక లాకెట్టులా ఉందది. ఆ బిళ్ల ఒక దారంతో కట్టి ఉంది. దానిని రెండు చేతులతో దండలా పట్టుకుని కళ్లు మూసుకుని ధ్యానించి, దానిని ఆ పసి బిడ్డ మెడలో వేశాడు.
తరవాత ఒక విచిత్రమైన కూత పెట్టాడు. ఆకాశం లోంచి చాలా పెద్దగా ఉన్న ఒక విచిత్రమైన పక్షి వచ్చి వాళ్ల పక్కన వాలింది. దాని తల మీద ఆత్మీయంగా నిమిరి దానితో ఏదో చెప్పాడు. తరవాత ఆ పాపను అంటే తనను దాని ముందు ఉంచాడు. అది తనను కాలితో సునాయాసంగా, జాగ్రత్తగా పట్టుకుని ఆకాశంలోకి ఎగిరింది. తనకు దాని తల, ఆకాశం మాత్రమే కనబడుతున్నాయి. అలా ఎగిరి వెళ్లి ఒకచోట తనను వదిలిపెట్టి ఎగిరిపోయింది. తరవాత తాను ఎంతో సేపు ఏడవడం, ఎవరో వచ్చి తనను ఎత్తుకోవడం…
ఎవరో తనను తట్టి పిలుస్తున్నట్టు అనిపించి కళ్లు తెరిచింది రక్ష. ఎదురుగా తన తల్లి నందన కనిపించింది. అంటే, ఇంతసేపూ తాను కలగంటోందా?
“ఏంటమ్మా, అలా కూర్చునే నిద్రపోతున్నావు? ఆరోగ్యం బాగానే ఉంది కదా?” అంటూ ఆమె రక్ష నుదుటి మీద అరచేతితో ముట్టిచూసింది. వేడిగా ఏమీ అనిపించలేదు. రక్ష సరిగా కూర్చొంటూ, “కాలేజీకి వెళ్ల లేదా అమ్మా?” అని అడిగింది తల్లిని. “వెళ్లాను తల్లీ! కానీ, ఎందుకో ఈ రోజు నిన్ను వదిలి ఉండాలని అనిపించలేదు. అందుకే సెలవు పెట్టి వచ్చేశాను,” అని అంటూ తన కూతురి తల మీద సుతారంగా ముద్దు పెట్టుకుంది. తరవాత అడిగింది, “ఏమైనా తింటావా? పొద్దున కూడా ఏమీ తినలేదు నువ్వు.”
“వద్దమ్మా! ఇప్పుడు పన్నెండున్నర కావస్తోంది కదా. మరో అరగంట ఆగి, అన్నం తినేస్తాను,” అని, కాసేపాగి మళ్లీ తల్లిని అడిగింది రక్ష, “అమ్మా! నా చిన్నప్పటి వస్తువులు ఏమైనా ఇప్పుడు ఉన్నాయా?”
“ఔను, ఉన్నాయి. నీ చిన్నతనంలో నీకు తొడిగిన బట్టలు, నీ చేతులకు వేసిన గాజులు, కాళ్ల పట్టాగొలుసులూ, నువ్వు ఆడుకున్న వస్తువులూ… అలాంటి ప్రతి దాన్నీ నీ బాల్యపు అపురూపమైన గుర్తులుగా ఒక పెట్టెలో దాచి ఉంచాను,” చెప్పింది నందన.
“అమ్మా, వాటిని ఒకసారి నాకు చూపించవా!” ఆత్రంగా అడిగింది రక్ష.
నందన లేచి, “పద చూద్దాం,” అంటూ రెండవ బెడ్రూంలోకి నడిచింది. రక్ష కూడా లేచి తల్లి వెంట ఆ గదిలోకి వెళ్లింది. ఆ గదిని వాళ్లు సామానులు పెట్టుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఆ గదిలో ఉన్న బీరువా లోంచి ఒక పాత విఐపి పెట్టెను బయటకు తీసింది. దానిని మంచం మీద పెట్టి తెరిచింది. “ఇవన్నీ నీ చిన్నప్పటి వస్తువులే చూడు,” అంటూ వాటి లోంచి ఒకటొకటి తీసి బయట పెడుతూ వాటి గురించి, అవి ఏయే సంవత్సరాల్లో, ఏ సందర్భాల్లో కొన్నారో చెప్పసాగింది. ఆమె వాటి గురించి చెపుతూ మళ్లీ ఆ రోజుల్లోకి పరవశంగా ప్రయాణం చేస్తోంది. ఆమె చెప్పేది వింటూ వాటిని చూస్తోంది రక్ష. కానీ ఆమె కళ్లు మాత్రం తనకు కలలో కనబడిన లాకెట్టు లాంటిది ఏమైనా కనబడుతుందేమోనని వెతుకుతున్నాయి.
ఆ తల్లి ఒక్కటొకటిగా ఆ పెట్టెలోని వస్తువులన్నీ బయటపెట్టింది. ఆ లాకెట్ లాంటిది ఏదీ కనిపించలేదు. అది పగటి కలే కావచ్చు అనుకుంది రక్ష. ఇంతలో బయట గదిలో ఉన్న ల్యాండ్ ఫోన్ మోగింది. “సరే, వీటిని మళ్లీ జాగ్రత్తగా పెట్టెలో సర్దు, నేను ఫోన్ చూస్తాను,” అంటూ తల్లి బయటకు వెళ్లింది.
సరే, దానిని జాగ్రత్తగా లోపల పెట్టు. నీ బాల్యపు జ్ఞాపకాన్ని నీ పెళ్లినాడు నీకు ఇచ్చి పంపిస్తాలే. అందాకా నా దగ్గరే దానిని ఉండనీ,” అంటూ దానిని తీసి, జాగ్రత్తగా మడతవేసి పెట్టెలో పెట్టి పెట్టెను మూసింది నందన.
రక్ష వాటిని ఒకటొకటిగా లోపల పెట్టేయసాగింది. తనకు మొదట వేసిన గౌను అని తల్లి చూపించిన గౌను తీసి మడత విప్పి చూసింది. చిన్న దస్తీ సైజులో తెల్లటి రంగులో ఉన్న తన మొదటి గౌనును అపురూపంగా పట్టుకుని చూసింది. అప్పుడు తాను వెతుకుతున్న వస్తువు రక్షకు కనబడింది. అది ఆ గౌను మడతలోంచి బయటపడింది. చిన్నగా వెండితో చేసినట్టుగా ఉన్న లాకెట్. తెల్లటి దారానికి కట్టి ఉందది. చటుక్కున దానిని అందుకుంది రక్ష. కుతూహలంగా దానిని పట్టుకుని, ఎత్తి చూసింది. రూపాయి నాణెం కన్నా కొంచెం పెద్దగా ఉందది. దానిపైన ఒక వైపున కొన్ని గీతలు ఉన్నాయి. అవి రాతలో, బొమ్మలో కూడా అర్థం కావడం లేదు. అలా చూస్తూ అవి ఏమై ఉంటాయా అని ఆలోచించింది. అది అచ్చం తనకు ఆ పగటి కలలో కనబడినట్టే ఉండటం రక్షను మరింత విస్మయానికి గురి చేసింది.
ఫోన్ మాట్లాడి నందన లోపలికి వచ్చింది. మంచం మీద రక్ష ఎదురుగా చిన్ననాటి గౌను ఇంకా అలాగే ఉంది. తల్లి వచ్చిన సవ్వడి విని తల తిప్పి చూసింది రక్ష. ఆమె వచ్చి రక్ష పక్కన నిలబడగానే, “అమ్మా! ఇది ఎక్కడిది? ఎప్పుడు కట్టించారు? ఎందుకు కట్టారు?” అని అడిగింది.
“నీకు మొదట కొన్న జుబ్బా అది. మీ నాన్నమ్మ కుట్టింది,” ఆ జుబ్బాను చూస్తూ చెప్పింది తల్లి.
“అది కాదమ్మా! ఇది, దీని గురించి అడుగుతున్నాను,” అంటూ తన చేతిని ఊపుతూ అంది రక్ష. ఆమె చేతిలో ఉన్న లాకెట్టు అటూ ఇటూ ఊగింది.
“అదే నేను చెపుతోంది. అది నీకు మొదటిసారి వేసిన గౌను,” అంది తల్లి.
రక్ష, “అది కాదమ్మా, ఇది,” అంటూ మరోసారి చేతిని కిందికీ పైకీ ఊపుతూ అడిగింది.
“జుబ్బా అంటారే తల్లి. దానిని గౌను అని పిలిచినా ఫర్వాలేదు. మరేమైనా అంటారేమో నాకు తెలియదు. సరే, దానిని జాగ్రత్తగా లోపల పెట్టు. నీ బాల్యపు జ్ఞాపకాన్ని నీ పెళ్లినాడు నీకు ఇచ్చి పంపిస్తాలే. అందాకా నా దగ్గరే దానిని ఉండనీ,” అంటూ దానిని తీసి, జాగ్రత్తగా మడతవేసి పెట్టెలో పెట్టి పెట్టెను మూసింది నందన. తరవాత, “పదమ్మా, భోజనం చేద్దాం. ఒంటిగంట అయింది. పొద్దుటి నుంచి నువ్వు ఏమీ తినలేదు,” అంటూ ఆ గది లోంచి బయటకు వెళుతూ రక్షను రమ్మని పిలిచింది.
తల్లి ఆ గది లోంచి వెళ్లిన తరవాత కాసేపు రక్ష అలాగే కూర్చుంది. ఆ లాకెట్ గుండ్రంగా ఉన్న రెండు వెండి పొరలతో కనిపిస్తోంది. పైపొర మీద కొన్ని గీతలూ, బొమ్మలూ ఉన్నాయి. వాటి నడుమ అక్కడక్కడా కొన్ని సన్నటి రంధ్రాలు ఉన్నాయి. కింది పొరలో వెనక వైపున కూడా ఏవో రాతలు, గీతలు కనబడుతున్నాయి. లాకెట్ ఇలా ఉంటుందా?
అది ఇంకా అలాగే రక్ష చేతిలో దారానికి వేలాడుతోంది. ఆ లాకెట్ తనకు మాత్రమే కనబడుతోందని, సాధారణమైంది కాదని అప్పుడు అర్థమైంది రక్షకు.
గత చాప్టర్ల కోసం కింద క్లిక్ చేయండి
తొమ్మిదో అధ్యాయం | ఎనిమిదో అధ్యాయం | ఏడో అధ్యాయం | ఆరో అధ్యాయం | ఐదో అధ్యాయం | నాలుగో అధ్యాయం | మూడో అధ్యాయం | రెండో అధ్యాయం | తొలి అధ్యాయం
మీ స్పందనలు టైప్ చేయడానికి కింద LEAVE A REPLY అని ఇలా ఉంటుంది.
అక్కడ తెలుపవచ్చు. కృతజ్ఞతలు – ఎడిటర్
Wonderful .very interesting novel. Congrats