ఇటీవలి ఉద్యోగ బదిలీల్లో ప్రాధాన్యతకు నోచుకోని ‘విడో టీచర్లు’ జిఓ 317 ప్రకారం తమకు సజావుగా పోస్టింగుల్లో ప్రాముఖ్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రాష్ట ముఖ్యమంత్రికి, ప్రధాన కార్యదర్శికి, విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్న్నారు.
ఆగ మేఘాల మీద జరుగుతున్న టీచర్ల బదిలీల విషయంలో తెలంగాణ ప్రభుత్వం జిఓ 317 కేటగిరి ప్రకారం విడోలకు పోస్టింగుల్లో ప్రాధ్యాన్యత విస్మరించడంతో వారంతా విషయం ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చి తక్షణం న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు.
స్పౌస్ లకు, మెడికల్ ఇబ్బందుల్లో ఉన్న వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి -పిల్లల బాధ్యత, రవాణా సౌకర్యాల సమస్య …తదితరాలుగా అనేక విధాలా ఇబ్బందులకు గురవుతున్న విడోలను విస్మరించడంతో వారంతా మానసికంగా శారీరకంగా తీవ్ర ఆందోళనకు, ఒత్తిడికి గురవుతున్నట్లు వారొక ప్రకటనలో పేర్కొన్నారు. “మాతో పాటు అవివాహిత మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి నుంచి నుంచి జిల్లా కలెక్టర్లు అలాగే సదరు విద్య శాఖా బాధ్యులకు జివో 317లో మా అందరికీ ఇదివరకే పేర్కొన్న విధంగా ప్రాధాన్యత ఇచ్చి పోస్టింగులు ఇప్పించ వలసిందిగా ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయవలసింది” అని వారు తెలంగాణా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇప్పటికీ రెండు వారాలుగా అనేక విధంగా ఆందోళనలో ఉన్న ఉద్యోగులకు న్యాయంగా దక్కవలసిన ప్రాధాన్యతను విస్మరించడంతో తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది విడోలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారితో పాటు అవివాహిత మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది.
ఇప్పటికీ రెండు వారాలుగా అనేక విధంగా ఆందోళనలో ఉన్న ఉద్యోగులకు న్యాయంగా దక్కవలసిన ప్రాధాన్యతను విస్మరించడంతో తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది విడోలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వారితో పాటు అవివాహిత మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ విషయమై అటు ప్రభుత్వం ఉద్యోగులు, ఇటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు సరిగా స్పందించకపోవడంతో వారు తీవ్ర అన్దోలనలో ఉన్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తామంతా విడోస్ టీచర్ల ఐఖ్య వేదిక పేరిట ఒక్కటై కార్యాచరణ తీసుకోవాలని కూడా యోచిస్తున్నారు.
ఈ విషయంలో తమకు అన్యాయం జరగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి తామంతా విడోస్ టీచర్ల ఐఖ్య వేదిక పేరిట ఒక్కటై కార్యాచరణ తీసుకోవాలని కూడా యోచిస్తున్నారు. ఈ అనివార్య పరిస్థితికి తావు లేకుండా ప్రభుత్వం సమస్యను వెంటనే పరిష్కరించాలని, వారు డిమాండ్ చేస్తున్నారు.