Editorial

Friday, November 22, 2024
సినిమాNayeem Diaries - హక్కులకు పాతర : దాము బాలాజీతో తెలుపు ముఖాముఖీ

Nayeem Diaries – హక్కులకు పాతర : దాము బాలాజీతో తెలుపు ముఖాముఖీ

డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం. ఈ రోజున పురుషోత్తం వంటి హక్కుల ఉద్యమకారుల కుత్తుకలను తెగ దెంపిన నయీంపై సినిమా రిలీజ్ అవుతోంది. అత్యంత వివదాస్పదమైన అంశాలను చర్చించిన ఈ సినిమాకు దర్శకత్వం వహించింది  ‘దాము బాలాజీ’. వారు ఈ సినిమా గురించి తేట తెల్లం చేసిన అనేక వాస్తవాల తెలుపు ఈ కింది లింక్ లలో ఉన్న ముఖాముఖి. వినండి. సినిమా ఎల్లుండే విడుదల.

కందుకూరి రమేష్ బాబు 

నాడు దాము ప్రవాహగానానికి మునికృష్ణ ముందుమాట ఎలా మందుపాతర అయిందో నేడు నయీం డైరీస్ కి దాము దర్శకత్వం మరో పెను విస్పోటనం. మరి. అసలు ఈ దాము ఎవరు? ఈ లింక్ క్లిక్ చేసి ఆయనపై తెలుపు అందించిన వివరమైన కథనం చదవండి…దాము ఒక రివల్యూషనరీ – పాతర వేసిన నిజాలు తెలుపు

దాము బాలాజీతో ముఖాముఖీ…

నయీం నేరాలను టీఎఆర్ ఎస్ ప్రభుత్వం కప్పి పుచ్చుతున్నదా? వినండి ఈ లింక్ ద్వారా…

ఒక హంతకుడుని మనిషిగా చూపుతున్న్నారా? ఎందుకో ఈ లింక్ ద్వారా వినండి…

నయీం మాదిరీ దాము కూడా ఉద్యమలో పనిచేశారు.  ఇద్దరికీ జైలు జీవితం ఉన్నది. ఇద్దరూ వేరు వేరు కారణాలతో అరెస్టు అయ్యారు. జైలు నుంచే ఇరువురూ విభిన్నంగా ప్రపంచానికి పరిచయయ్యారు. ఇవన్నీ ఒకెత్తు. ఇద్దరిలోనూ అరాచక ప్రవృత్తి ఉండవచ్చు కూడా? ఆ అరచాకత్వమే నయీం సినిమా తీయడానికి కారణమా అంటే ఆయనేం అన్నారో ఈ లింక్ ద్వార వినండి.,.

నక్సలైట్ల పట్ల మొదట్లో గొప్ప భక్తిభావంతో ఉన్న నయీం వాళ్ళ పట్ల అంతే తీవ్రమైన వ్యతిరేకిగా మారడం వెనకాల ఉన్నది ఏమిటో దాము చెబుతున్నారు వినండి…ఈ లింక్ ద్వార…

నయీం విషయంలో జైలులో ఉన్న అప్పటి పీపుల్స్ పీపుల్స్ వార్ నేతలు చేసిన పొరబాట్లే కారణమైనప్పటికీ వారికీ తీవ్రమైన ఒత్తిళ్ళు ఉన్నాయంటారు దాము బాలాజీ. వారేమీ అవి కావాలని చేయలేదంటారు. ఐతే, అక్కడున్న నలుగురు అగ్ర నేతలను కూడా సైనైడ్ సూదులతో చంపే కుట్రలు జరిగాయని, ఇలాంటి అనేక ఒత్తిడులే నయీంను నరరూప రాక్షసుడిగా మార్చడానికి దోహదపడ్డాయని అన్నారు. చిత్రమేమిటంటే, నయీం విషయంలో ఫేట్ ( విధి ) కూడా కీలక పాత్ర వహించిందని చెప్పి ఆశ్చర్య పరుస్తరాయన . అదేమిటో ఈ లింక్ క్లిక్ చేసి వినండి…

ఇదిలా ఉంటే, నయీం డైరీస్ సినిమా ‘సిక్’ ఫీలింగ్ ఏమీ ఇవ్వదని, ఎంతో రిఫ్రెషింగ్ గా ఉంటుందని దర్శకులు దాము బాలాజీ ఈ లింక్ ద్వారా వివరిస్తున్నారు…

నర హంతక ముఠాకు నేతృత్వం వహించిన నయీంను ‘మనిషి’గా చూపించే ప్రయత్నం మాదిరే అతడిని ఒక ఆయుధంగా మార్చుకుని, పలు హత్యలు చేపించిన రాజ్యాన్ని ‘దోషి’గా చూపించారా? అన్న ప్రశ్నకు దర్శకులు దాము బాలాజీ ఏమంటున్నారో ఇక్కడ వినండి. ఇందులోనే, ఆఖరులో “నువ్వు పోలీసులవైపా…నక్సలట్ల వైపా?” అన్న ప్రశ్నకు నయీం చెప్పుకునే జవాబు అతడిలోని పరివర్తనకు రుజువు అని కూడా దర్శకులు వివరిస్తున్నారు, గమనించండి.

తొలుత రాంగోపాల్ వర్మ నిర్మించాలనుకున్నప్పటికీ కారణాంతరాల వల్ల ఆ సినిమాకు పరిశోధన చేసిన దాము బాలాజీయే దర్శకులుగా మారి సినిమా తీశారు.ఐతే, సామాజిక స్పృహా, విప్లవ చైతన్యం ఉన్న వారిగానే కాక చక్కటి కవి కూడా ఐన తాను ఈ సినిమాను ఫక్తు క్రైం థ్రిల్లర్ గా తీశారా లేదా బాధ్యతగా తీశారా అన్న ప్రశ్నకు వారి సమాధానం ఈ లింక్ లో  వినండి.

ఇది నయీం డైరీస్ Official Trailer. సినిమా ఎల్లుండే విడుదల

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article