Editorial

Thursday, November 21, 2024
ఆరోగ్యంWhite Challenge

White Challenge

Pass word

White Challenge

TPCC chief Revanth Reddy introduces ‘white challenge’ in Telangana to eradicate drug menace. Of course, It is a political strategy to irk some KCR and KTR but as the ex MP Vishweshwar Reddy took up the challenge, it may be in a way becoming a real challenge to KTR. Let us see the developments in coming future.

పిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి పిలుపిచ్చిన White Challengeలో భాగంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నేడు గన్ పార్క్ రావడంతో తెలంగాణలో డ్రగ్స్ పేరిట రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. రేవంత్ రెడ్డి సవాల్ కు నేను సిద్దం అని కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రకటించడం, తాను మరి ఇరువురుకి సవాల్ విసరడం విశేషం. ఈ నేపథ్యంలో కేటీఆర్ కాస్త ఇరకాటంలో పడ్డట్టే ఉంది. “నా స్థాయి కాదు ” అనడం వల్ల ప్రయోజనం ఉండేట్టు లేదు.

రాష్ట్రంలో ఇటీవల సంచలనానికి కారణమైన రాజు రేప్ ఉదంతం నేపథ్యంలో గంజాయి గుడుంబా తదితర మాదక ద్రవ్యాల మత్తులో యువత ప్రమాదకరమైన స్థితిలో పడ్డారని, డ్రగ్స్ కు వ్యతిరేకంగా ఈ వైట్ చాలెంజ్ ను రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు స్వీకరించి ఆదర్శంగా నిలబడాలని రేవంత్ రెడ్డి కోరారు.

కాగా, రేవంత్ రెడ్డి సవాల్ కేవలం కాంగ్రెస్ టీ ఆర్ ఎస్ ల మధ్య యుద్దానికి సంభందించినట్లుగా మారకుండా ఉండేందుకు తాను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి, బి ఎస్ పి రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఈ సవాల్ విసురుతున్నట్టు కొండా విశ్వేశ్వర్ రెడ్డి పిలుపు నివ్వడం మరో విశేషం.

ఏమైనా ప్రభుత్వం, కేటీఆర్ కి ఇది ఇరకాటమే. ఈ White Challenge రాష్ట్ర రాజకీయాల్లో రేవంత్ రెడ్డికి ఒక మంచి ఆయుధం అయ్యే అవకాశం లేకపోలేదు.

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article