Editorial

Friday, November 22, 2024
ఔషధ విలువల మొక్కలుబ్రహ్మకమలం : నాగమంజరి గుమ్మా తెలుపు

బ్రహ్మకమలం : నాగమంజరి గుమ్మా తెలుపు

ఔషధ విలువల మొక్కలు ( 35 ) : బ్రహ్మకమలం

మంచు కొండలందు మహనీయ పుష్పాలు
బ్రహ్మ కమలమనెడి రాచ విరులు
విచ్చుకొనిన పూల వీక్షణ స్వల్పము
స్వర్ణపుష్పమనుచు వాసికెక్కె
నాగమంజరి గుమ్మా

హిమాలయాల్లో పెరిగే అరుదైన మొక్క ఈ బ్రహ్మకమలం. అర్ధరాత్రి ఎప్పుడో వికసించి, రెండుమూడు గంటలు మాత్రమే ఉంటుంది. అందుచేత వికసించి ఉండగా చూసిన వాళ్ళు తక్కువ.

బ్రహ్మ పుట్టిన పువ్వు ఇదే అని, శివుడు ఏనుగు తలను బాలునికి అమర్చగా ఈ పువ్వు తాకించి బ్రహ్మ పునరుజ్జీవితుని చేశారని పురాణ గాథ.

టిబెటన్లు ఈ మొక్క మొత్తంగా ఔషధం గా వివిధ వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.

Columnist email: gnmanjari7@gmail.com

నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.

మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.

Medicinal Plant

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article