నేడు సెప్టెంబర్ 7 వ తారీఖు
క్రీ.శ 1696 సెప్టెంబర్ 7 నాటి అమృతలూరు (గుంటూరు జిల్లా) శాసనంలో శ్రీరంగరాయలు III పాలనలో వారి కార్యకర్తలైన నారప్పనాయనింగారు అమృతలూరులో మన్నెగాండ్లచే గతంలో దోచుకోబడిన (పన్నులతో) కోమట్లు, సాలెవారు, పాటములంవారు (?), పరవర్తకులు (?) మున్నగువారికి పన్ను పరాయాలు వెటివేముల మున్నగువాటినుండి మూడుసంవత్సరాలు మినహాయింపు నచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం. 334].
శీర్షిక నిర్వాహకుల పరిచయం
డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా