ఔషధ విలువల మొక్కలు ( 33 ) : మందార
నల్లని తలకట్టు నిలువ
చల్లని మందార చాలు జల్లను కురులున్
కొల్లలుగ వన్నె కూర్చుకు
నుల్లము దోచు సుమమిది శుభోదయ వేళన్
నాగమంజరి గుమ్మా
మందారం లేదా మందారం ఒక అందమైన పూల చెట్టు. దీని పువ్వులు పెద్దవిగా ఎరుపు రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా రకాల జాతులు ఉన్నాయి. రకరకాలైన మందారపూలతో దేవుడికి పూజ చేస్తే ఆ తృప్తే వేరు.
మందార కుంకుడు కాయలతో కలిసి శిరోజాలకు చక్కని నల్లని రంగును, పట్టులాంటి మృదుత్వాన్ని ఇస్తుంది. కానీ సాంప్రదాయకమైన ఈ అలవాటును మాని మందార, కుంకుడు ఉన్న షాంపూలు వాడి ఉన్న జుట్టు ఊడగొట్టుకుంటున్నాం.
రకరకాలైన మందారపూలతో దేవుడికి పూజ చేస్తే ఆ తృప్తే వేరు.
మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి.
ముద్దమందారంలో రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి ఉంటాయి. అందమైన పుష్పాలున్నా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు, పక్షులను ఆకర్షించవు.
నాగమంజరి గుమ్మా వృత్తి రీత్యా ఉపాధ్యాయురాలు. ప్రవృత్తి రీత్యా రచయిత్రి. వారు కవిత్వం, పద్యం, గద్యం వంటి ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ప్రతి రోజూ ఒక రచనతో అనేక వాట్సప్ గ్రూపుల్లో వందలాది మందికి చేరువయ్యారు. ముఖ్యంగా పూవుల వర్ణన పద్యములు – పుష్పవిలాసం (1116), పండ్ల విశిష్టత తెలుపే ఫల విలాసం (108), పక్షుల గురించిన విహంగ విలాసం (108), సముద్ర జీవుల గురించి రాసిన జలచర విలాసం (108), – వీటి ప్రశస్తిని శతకాలుగా రచించారు. ప్రస్తుతం శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి గారు అందించే చిత్రాల సహకారంతో ప్రతి రోజూ ఒక్క మొక్క తాలూకు ఔషధ విలువలను పద్యం సహితంగా అందిస్తున్నారు.
మన ప్రాంతీయ మొక్కలలోని ఔషధ గుణాలు గురించిన ఈ సమాచారం ఎంతో విలువైనదే. అలా అని వైద్యుని పర్యవేక్షణ లేకుండా వాటిని ఉపయోగించకూడదని నాగమంజరి గారి మనవి.