Editorial

Thursday, November 21, 2024
Peopleఇదీ సంగతి!

ఇదీ సంగతి!

ఈనాడు చీఫ్ కార్టూనిస్ట్ శ్రీ‌ధ‌ర్ రాజీనామా చేశారు. ఈ విష‌యాన్ని రెండు గంటల క్రితం ఆయ‌న త‌న ఫేస్ బుక్ ఎకౌంట్ ద్వారా తెలియ‌ప‌రిచారు. దాదాపు 40 ఏళ్లుగా ఈనాడులో ఆయన ఉద్యోగి అని మనకు తెలుసు. ఈ మధ్యే 40 ఏళ్ల పండ‌గ కూడా చేసుకున్నారు. అయితే ఈ సందర్భంలో ఎన్నడూ లేనట్టు కొద్దిమంది పోస్టుల కారణంగా అయన సామాజిక మాధ్యమాల్లో జరిగిన చర్చలో కాస్త మనస్తాపానికి కూడా గురైనట్టు ఉన్నారు. ఇదిలా ఉంటే, ఈనాడులో కరోనా అనంతరం యాజమాన్యంలో మార్పులు వచ్చినట్టు, జీత భత్యాల విషయంలో కూడా కొన్ని సమస్యలు ఏర్పడినట్లు కొన్ని సైట్లు రాశాయి. ఐతే, కారణాలు ఎవైనా వారు నాలుగు దశాభ్దాల పాటు గడిపిన వృత్తి జీవితం, రోజువారీ కార్టూన్లు మనందరి జీవితంలో భాగం. వారి ఉద్యోగ విరమణ లేదా రాజీనామా మేధావులకు చర్చకు తావిస్తుండవచ్చు గానీ అది ఖచ్చితంగా సామాన్య పాఠకులకు గొప్ప విచారం కలిగిస్తున్నది. ఎంతో బాధగానే ఉంటుంది. అది మాత్రం నిజం. శ్రీధర్ గారి నిర్ణయం పట్ల ఈనాడు సంపాదకులు రామోజీరావు నిర్ణయం ఏమైనప్పటికీ అయన కార్టూన్ రేపటి నుంచి కనిపించకపోవచ్చు అన్నది మాత్రం నిజం, తెలుపు వార్త, ఇదీ సంగతి.

శ్రీధర్ గారి ఫేస్ బుక్ అకౌంట్  : Sridhar Rao

 

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article