చిత్రకళలో శ్రీకృష్ణుడి గురించి దివంగత చిత్రకారులు శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారి రేడియో ప్రసంగం ఇది. సెప్టెంబర్ 8వ తేది 1966న ప్రసారం కాగా వ్యాసంగా చిత్రశిల్పకళా రామణీయకము’ అన్న గ్రంధంలో ముద్రితమైంది. జన్మాష్టమి సందర్భంగా తెలుపుకి ప్రత్యేకం.
తేజస్సు, రంగులూ, రూపాలు వీటి కలయికలోని ప్రత్యేకత కళ. ఈ కళ తన బ్రతుకు సార్ధకం కావాలని తపించింది కాబోలు! నేనుండగా నీకేం కొదవ? నాకు వాహనమైయుంటే నీవూ నేనూ భగవంతుని దరి జేరవచ్చు అని ఉపదేశించింది భక్తి. వీటి పరస్పర మైత్రికి భగవంతుడు కరుణించి నల్లనివాడు పద్మనయనంబుల వాడై పిల్లన గ్రోవి చేతధరించి, కస్తూరీ తిలకం లలాట ఫలక మందు, వృక్షస్థల మందు కౌస్తుభం, నాసాగ్రమందు నవమౌక్తికం, కరకమలాలందు కంకణాదులు ధరించి, గోప స్త్రీలతో పరివేష్ఠితుడై గోకులమందుద్భవించాడు. స్పర్శించి పావనం చేసి, బ్రతుకును సార్ధకం చేసుకోవాలని ఋషి పుంగవులు గోపిక లైనారట. అలాగే కొందరు చిత్రకారులై యందురు.
కోమలమైన నల్లని రూపం, విశాల నేత్రాలు, నెమలి పింఛము, కల్గిన ఆకృతి, చిత్రకారుణ్ణి, కుంచెను మహితుణ్ణి చేయగలవనుటలో ఆశ్చర్యమేముంది?
కోమలమైన నల్లని రూపం, విశాల నేత్రాలు, నెమలి పింఛము, కల్గిన ఆకృతి, చిత్రకారుణ్ణి, కుంచెను మహితుణ్ణి చేయగలవనుటలో ఆశ్చర్యమేముంది? శ్రీయఃపతి అవతారమైనచో చిత్రకారునికి ఒక విలువైన వస్తువు ప్రాప్తించిందనవచ్చు.
ఒక సామాన్య మానవుడు చేయగలిగిన సర్వ కార్యములు, అసాధారణమై, అప్రాకృతికమైన చేష్టలన్నియూ, ఊహకందినంత మేరకు కూర్పులనూ, సునిశిత రేఖాలాలిత్యము వర్ణ సంవర్గముచే గాధలను చిత్రించినారు.
అక్బరు పాదుషాకాలం నాటికి భారతదేశంలో భక్తి సాంప్రదాయం విజృభించింది. తులసీదాసు, కబీరు, మీరాబాయి, సూరదాస్ మున్నగు భక్తాగ్రేసరులు భక్తితో రాగాలాపనలు చేశారు.
రాజపుత్ర, కాంగ్డా చిత్రకారులు శ్రీకృష్ణుణ్ణి రంగులలో రేఖలలో రస క్రీడలాడించారు. అనేక రూపాలిచ్చి వినోదించి తన్మయయత్వం చెందిరి. చిత్రకళాజగత్తు శ్రీకృష్ణుని మోహించింది. సూక్ష్మ చిత్రాలు శిల్పాలలో, భిత్తి చిత్రాలలో, రాజస్థానీ, కాంగ్డా, బసోలీ, పహాడే, రాజపుత్ర శైలులలో శ్రీకృష్ణుని బంధించి, బాల, కౌమార, యౌవనావస్థలలో అద్భుతంగా చిత్రించినారు.
ఒక సామాన్య మానవుడు చేయగలిగిన సర్వ కార్యములు, అసాధారణమై, అప్రాకృతికమైన చేష్టలన్నియూ, ఊహకందినంత మేరకు కూర్పులనూ, సునిశిత రేఖాలాలిత్యము వర్ణ సంవర్గముచే గాధలను చిత్రించినారు.
శ్రీకృష్ణుని చిత్రించుటకు నారదుడే చిత్రకారుడై యవతరించినాడు. యీ నారదుడు గుజరాతీ చిత్రకారుడు మీరాబాయి, సూరదాసులు కీర్తనలను రచించుటలో యెంత ప్రధానులైనారో నారదుడు, అతని కుమారుడగు గోవిందుడు 1600 శతాబ్ధంలో అంతస్థానాన్ని భాగవత చిత్రణంలో సంపాదించారు.
శ్రీకృష్ణుని చిత్రించుటకు నారదుడే చిత్రకారుడై యవతరించినాడు. యీ నారదుడు గుజరాతీ చిత్రకారుడు మీరాబాయి, సూరదాసులు కీర్తనలను రచించుటలో యెంత ప్రధానులైనారో నారదుడు, అతని కుమారుడగు గోవిందుడు 1600 శతాబ్ధంలో అంతస్థానాన్ని భాగవత చిత్రణంలో సంపాదించారు. మనోహరుడు ‘ఉదయపూరు’ చిత్రకారుడు.
1650లో పహాడీ చిత్రాలలో మానక్, అతని కుమారుడు ఖుషాలా 1750 నుండి 1775 కాంగ్డా గులేరీ చిత్రకారుల్లో శ్రీకృష్ణలీలలను చిత్రించినారు. ఒరిస్సాలో కూడా శ్రీకృష్ణలీలాలను చిత్రించారు.
సహబ్దీన్ అను ముస్లిం చిత్రకారుడు కూడా శ్రీకృష్ణలీలలను చిత్రించినాడు. నాటి చిత్రాలు అధికంగా గ్రంధములందే చిత్రించినారు.
వీరి చిత్రాలలో శ్రీకృష్ణుని నవ రసములలో తానమాడించినారు. నల్లని మేఘాలు, మెఱుపులు, కొంగల బారులు, పర్వత శ్రేణులు, యమునానదీ పరిసరాలు, పుష్పలతా వితానాలు, తామర కొలకులు, నెమలి, నృత్యాలు, శుక, పికసారంగ కోలాహలములు, రహస్య గుహలు, గోగణాదులు, గోపాలురు, తరుచ్ఛాయలు, క్రౌంచ, బకములు, భయంకర సర్పములు, తటిత్కాంతులు, భూనభోంతరాళాలు ఏకంచేయు వర్షాపాతములు, వెన్నెల రాత్రులు అనేకములు ఏకమై శ్రీకృష్ణుని సేవించుటకై అవతరించినవా యన్నట్లు ప్రకృతి కన్య పరమపురుషుని పరివేష్టించి కన్నులార సేవించుటకై వివిధ రూపాలలో అవతరించినట్లు చిత్రాలలో గోచరించును.
అన్ని అవతారములకన్న కృష్ణావతార చిత్రములే మన దేశమందెక్కువ గాన్పించను. శ్రీకృష్ణుని ఆకృతియూ, తలలున్నూ చిత్రకళా ప్రపంచమునే పునీత మెమర్చినది.
శ్రీ కృష్ణునిలోని నవరసాలు చిత్ర కళకు ప్రభావితం చేసినవి.
నీలి కళేబరము, నెమలి పింఛము, పసిడి వన్నెపంచె కనుకొలకులలోని అరుణారుణకాంతులు కాటుక కండ్లు వివిధ వర్ణ పుష్పహారములు ఇవి శ్రీకృష్ణుని వర్ణములు.
ఒక చోట, కటిచేలంబు బిగించి, పింఛమున జక్కంగొప్పు బంధించి, మరోచోట బాలవత్సములతో నొప్పారుచూ, ఱోల గట్టబడి మరోచోట, తల్లి కుచవేదికపై తలమోపియాడుచునూ, దాగిలిమూతలాడుచూ, నుయ్యెల నూగుచు, కడవల వెన్న దొంగిలించుచునూ, గోవర్ధన గిరి యెత్తుచు, కాంతారవిహారమ్ముల శ్రాతుండై గోపకాంకశయుండగుచూ పూతన సంహారము మొనర్చుచూ, శకటముదన్నిన దివి బ్రకంటంబై సంహార యెగసి, యిరుసు భారమున కండ్లున్, వికటంబుగ నేలంబడు శకటాసురుని బరిమార్చుచు, కొన్ని చిత్రాలలో కాళీయ ఫణి ఫణామంటపమును జేరి నృత్యమాడుచూ, గోపికలతో వసంతములాడుచున్న శ్రీకృష్ణుడు అనేక భంగిమలో గాన్పించును. గనుకనే ఏ చిత్రకారునికైననూ ఆ సుందర మోహన మధుర మూర్తిని చిత్రాలతో వసంతమాడవలెనను కోరిక బుట్టుట సహజము.
అన్ని అవతారములకన్న కృష్ణావతార చిత్రములే మన దేశమందెక్కువ గాన్పించను. శ్రీకృష్ణుని ఆకృతియూ, తలలున్నూ చిత్రకళా ప్రపంచమునే పునీత మెమర్చినది.
ఈ వ్యాసం కొండపల్లి అపురూప వ్యాసాల సంపుటి -‘చిత్రశిల్పకళా రామణీయకము’నుంచి పునర్ముద్రితం. దాని సంపాదకులు కవయిత్రి, పరిశోధకురాలు, స్వయానా కొండపల్లి గారి కోడలు శ్రీమతి కొండపల్లి నీహారిణి గారు. వారికి ధన్యవాదాలు.
Nice article…👌