“సాహితీ ప్రశస్తిపై అల్లిన అపురూప పద్యమిది.
రచన డా.డేరంగుల శ్రీనివాసులు (కవితశ్రీ) గారిది.
గానం శ్రీ కోట పురుషోత్తం
క్రాంతి రేఖలు లేక కన్నుగానని వేళ
దీపధారి యగుచు జూపు నిచ్చు
కష్టనష్టము వచ్చి కమిలిపోయిన వేళ
వెన్ను దన్నుగా నిల్చి వెంట వచ్చు
బంధు మిత్రులు పోయి పలవరించెడు వేళ
కన్నీరు పోదుడ్చి కలత దీర్చు
దుష్ట పాలన తోడ కష్ట కాలము రాగ
కలసి యుద్ధము చేయ పిలుపునిచ్చు
వర్ణమాలలతో వన్నెగాంచి
భాష భావములను గూడి భవ్యమగుచు
ప్రజల బ్రతుకుల అవిభాజ్య భాగమగుచు
కళల రాణి సాహితీ యన కవిత వెలుగు
*
ఇది తెలుపు టివి సమర్పిస్తున్న యాభై రెండవ పద్యం.
మిగితావన్నీ వినడానికి పద్య సంపదపై క్లిక్ చేయగలరు.