రచయిత, దర్శకులు రమేష్ చెప్పాల జీవన తాత్వికతను పలుమార్గాల్లో గోచరించి అక్షరాల్లోనే కాదు, వెండి తెరమీద దృశ్యమానం చేసే మానవతా కర్త.
‘మీ శ్రేయోభిలాషి’ సినిమా మాటల రచయితగా వారు నంది పురస్కార గ్రహీత. ఇటీవలే తాను పుట్టి పెరిగిన ఊరు తాత్వికతను అపురూపంగా సంకలనం పరచి, మా కనపర్తి ముషాయిరా’పేరిట అందించారు. ‘తెలుపు’కోసం వారు వారం వారం పునరుత్తేజాన్నిపంచుతారు. వ్యక్తులుగా, సంస్థలుగా ఆధ్యాత్మిక తేజాన్ని పంచుతున్న భారతీయుల కృషిని సరళ సుభోధంగా తేటతెల్లం చేస్తారు. ఆ పరంపరలో ఇది మొదటిది.
ఎత్తయిన రెండు భవనాల మధ్య ఒక తాడు కట్టబడి ఉంది.
దాని మీద ఒక వ్యక్తి నడవసాగాడు.
వందల అడుగుల ఎత్తున అత్యంత జాగ్రత్తగా అతను నడవ సాగాడు.
చేతిలో పొడవయిన కర్ర ఉంది.
భుజాన అతని కొడుకు ఉన్నాడు,
అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు….
అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రెండో భవనం వైపు వచ్చాడు,
అందరూ చప్పట్లు కొట్టారు.
కేరింతలలో ఆహ్వానం పలికారు…
చేతులు కలిపారు ఫోటోలు తీసుకున్నారు,
“నేను ఈ తాడు మీద తిరిగి అవతలికి వెళ్లాలను కుంటున్నాను వెళ్లగలనా?”అతను ప్రశ్నించాడు.
“వెళ్లగలవు, వెళ్లగలవు “జనం సమాదానం.
“నా మీద నమ్మకం ఉందా?..”
“ఉంది,ఉంది. మేం పందానికి అయినా సిద్దం!”
“అయితే మీలో ఎవరైనా నా భుజం మీద ఎక్కండి, అవతలకి తీసుకు పోతాను!”
అక్కడంతా నిశబ్దం..
జనం మాటలు ఆగిపోయాయి…
ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు,
ఉలుకూ లేదు, పలుకూ లేదు,
నమ్మకం వేరు, విశ్వాసం వేరు.
విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం కావాలి.
ఇప్పటికీ ధ్యానం విషయంలో మన వైఖరి ఇదే…
ధ్యానం అంటే నమ్మకమే … మరీ విశ్వాసం!!!?
పూజకోటి సమం స్తోత్రం
స్తోత్రకోటి సమో జపః
జపకోటి సమం ధ్యానం
ధ్యానకోటి సమో లయః
కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం.
కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం.
కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం.
కోటి ధ్యానాదులు ఒక లయానికి సమానం.
నాస్తి ధ్యాన సమం తీర్థం ; నాస్తి ధ్యాన సమం తపః|
నాస్తి ధ్యాన సమో యజ్ఞః తస్మాద్యానం సమాచరేత్ | |
ధ్యానంతో సమానమైన తీర్ధం కానీ , ధ్యానంతో సమానమైన తపస్సు కానీ, ధ్యానంతో సమానమైన యజ్ఞాలు కానీ లేవు , అన్నారు వ్యాసమహర్షి.
అంతటి విలువైన ధ్యానం మీద మనకు ధ్యాస లేదు. కానీ “హాట్ ఫుల్ నెస్” కొన్ని దశాబ్దాలుగా మనకు ధ్యానం, యోగ, ఆధ్యాత్మిక నేర్పించాలని ప్రయత్నిస్తూనే ఉంది హాట్ ఫుల్ గా…
HEARTFULNESS ( PURITY WEAVS DESTINY) హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ హృదయాన్ని ఆధారంగా చేసుకుని ధ్యానించే ప్రక్రియ.
హార్టుఫుల్ నెస్ మెడిటేషన్ పద్దతిలో సంసారం విడిచిపెట్టి సన్యసించవలసిన అవసరం లేదు. అడవులకు వెళ్ళవలసిన అవసరమూ లేదు.సంసారం చక్కబెట్టుకుంటూ మీ ఇంట్లోనే కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు.
హృదయాన్ని కేంద్రంగా చేసుకుని జీవించే విధానం.
ధ్యానం మనకు కొత్తేమీ కాదు.మన పూర్వీకుల దగ్గరికి నుండీ అన్ని మతాల వారు ధ్యానాన్ని ఆచరించిన వారే…
ఏసు క్రీస్తు ధ్యానం చేసాడు. ముస్లిం మసీదుల్లో ధ్యానిస్తారు.మహర్షులు సాధువులు సన్యసించి అరణ్యాలకు వెళ్ళి ధ్యానమో,తపస్సో చేసినవాల్లే…
హార్టుఫుల్ నెస్ మెడిటేషన్ పద్దతిలో సంసారం విడిచిపెట్టి సన్యసించవలసిన అవసరం లేదు. అడవులకు వెళ్ళవలసిన అవసరమూ లేదు.సంసారం చక్కబెట్టుకుంటూ మీ ఇంట్లోనే కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు.హార్టుఫుల్ నెస్ ధ్యానం మీరు ఉద్యోగం, వ్యాపారం, వృత్తి వ్యవహారాలు చక్కగా నిర్వహిస్తూ భార్యాపిల్లలుతో కలిసి హాయిగా ఉంటూ ధ్యాన సాధన చేస్తూ ఉన్న జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవచ్చు.
ఇది సహజమార్గము… రాజయోగం.
‘హార్టుఫుల్ నెస్’ ధ్యాన పద్ధతిలో జాతి,మత,కుల,లింగ బేధం లేదు. ఒక్కరూపాయి కూడా ఫీజు తీసుకోరు. పూర్తిగా ఉచితం.
“మీ దగ్గర ధ్యానం చేసే సమయం లేకపోతే అదే మీరు తప్పక చేయవలసిన సమయం.” అంటారు హార్ట్
ఫుల్ నెస్ గ్లోబల్ గైడ్, అధ్యక్షులు కమలేష్ డి. పటేల్.
“మీ హృదయ స్వచ్ఛత మీ విధిని రూపొందిస్తుంది.”అని నొక్కి చెప్పే ‘హార్ట్ ఫుల్ నెస్’పూర్వపు పేరు (SRCM)శ్రీ “రామచంద్ర మిషన్” పూర్తి లాభాపేక్షలేని సంస్థ. 1945లో శ్రీ రామచంద్ర మిషన్ స్థాపించబడింది. ప్రధాన కార్యాలయం చెన్నైలో ఉంది. దీనిని శ్రీరామ్ చంద్రజీ ఫతెగ్రహ్ (అకా’ లాలాజీ) ఈ ‘సహజ మార్గ్’ వ్యవస్థ నెలకొల్పారు. ఆయన తర్వాత వారసుడు శ్రీ రామచంద్ర (బాబుజీ), తరువాత పార్థసారథి రాజగోపాలచారి (చారిజీ), ప్రస్తుతం కమలేష్ పటేల్(దాజీ) సహజ మార్గ్ నాల్గవ ఆధ్యాత్మిక గ్లోబల్ మాస్టర్ గా సంస్థ నిర్వహిస్తున్నారు. శ్రీ రామచంద్ర మిషన్ కు ఇప్పుడు ప్రపంచంలోని నూట అరవై (160 )దేశాల్లో ఆశ్రమాలున్నాయి, ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభ్యసిలకు మెడిటేషన్, స్పిరిచ్యువాలిటీ.యోగ బోధిస్తున్నారు. వేలాది MNC COMPANIESలకు ట్రైనింగ్ ఇస్తున్నారు.
“హార్ట్ ఫుల్ నెస్” ప్రపంచ ప్రధాన కార్యాలయం తెలంగాణ రాష్ట్రంలో చేగూరు సమీపంలోని కన్హ గ్రామంలో ఉంది. దీని పేరు శాంతివనం. ఈ శాంతివనం 1400 వందల ఎకరాల్లో నిర్మించారు. 2017లో కన్హ శాంతి వనాన్ని భారత రాష్ట్రపతి రామ్నాథ్ గోవింద్, అప్పటి గవర్నర్ నరసింహన్ ప్రారంభించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కేంద్రం.
అసలేంటి ఈ హార్ట్ ఫుల్ నెస్ ❤️!!
హృదయాన్ని కేంద్రంగా చేసుకుని దానితో సంపూర్ణంగా అనుసంధానమైన జీవన విధానమే హార్ట్ ఫుల్ నెస్.
హృదయ సహజస్థితి ప్రేమ.. హృదయం ఆధారంగా ప్రారంభమయ్యే ధ్యాన ప్రక్రియే… హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్.
హృదయ నిర్మలంగా ఉంటే మనసు కూడా నిర్మలమవుతుంది.మనసుకు విశ్రాంతి కలగాలంటే హృదయం ప్రశాంతంగా ఉండాలి. ఆధ్యాత్మిక సాధనను హృదయంతో ప్రారంభించాలి. అత్యంత సహజమైన జీవితాన్ని గడపడమే హార్ట్ ఫుల్ నెస్. విగ్రహారాధన కన్నా హృదయరాధనలోనే స్వచ్ఛత చాటుతోంది…
‘హార్ట్ ఫుల్ నెస్’ సాధన ద్వారా మనిషి సాధించే లక్ష్యం ఏమిటి!??
‘సమస్త జీవధారలు హృదయం నుండే ప్రారంభం అవుతాయి. కాబట్టి నీ హృదయాన్ని పదిలంగా కాపాడుకో…’
మనిషికి భౌతిక ,ఆధ్యాత్మిక సమతుల్యాన్ని అందించే ప్రభావవంతమైన ధ్యాన మార్గదర్శి హార్ట్ ఫుల్ నెస్. హార్ట్ ఫుల్ నెస్ ధ్యాన సాధన ద్వారా మానసిక ప్రశాంతత, ఆనందం, అంతరంగం తేలిక పడడం, సూక్ష్మత, చైతన్య విస్తరణ,వంటివి ప్రాప్తిస్తాయి. అప్పుడే మనిషి తన అంతరంగిక మూలం “ఆత్మతో” సరళమైన పవిత్రమైన అనుభవాన్ని ఏర్పరచుకుంటాడు. సహజ మార్గంలో పయనిస్తాడు…అప్పుడు ఇక మార్గమే గమ్యంలా మారిపోతుంది… ఇప్పుడు ఆ మార్గంలో సాగిపోవడం ఎవరికైనా గొప్ప ఆనందంగా మారిపోతుంది.
ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకొని మనసుని హృదయం మీద నిలపాలి… ఒక్క అరగంట!! గంట…. అపై మీ ఇష్టం.
ప్రాణాహుతి
అన్ని ధ్యాన ప్రక్రియల్లో హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ భిన్నం ఎందుకంటే హార్ట్ ఫుల్ నెస్ “ప్రాణాహుతి “ద్వారా జరుగుతుంది.
ప్రాణాహుతి అంటే ట్రాన్స్మిషన్ (Transmission) ఒక దగ్గరుండి ధ్యానం చేస్తున్న మాస్టరు అదే సమయంలో ప్రపంచం నలుమూల ధ్యానంలో ఉన్న అభ్యసిలకు అనుసంధానమై గురువు తన శక్తిని అందరికీ ప్రసరింపజేయడం. మానవుని మార్చడానికి దైవ శక్తిని ఉపయోగించుకోవడమే ప్రాణాహుతి. ఈ ధ్యానం చేస్తున్న సమయంలో ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకొని మనసుని హృదయం మీద నిలపాలి… ఒక్క అరగంట!! గంట…. అపై మీ ఇష్టం.
ప్రాణాహుతి అంటే త్యాగం చేయడం. ఒకరి ఆత్మయొక్క జీవశక్తిని ప్రసరింపజేసి మరొక జీవాత్మకు ” జీవపోషణ” కలిగించడం. ప్రాణాహుతి శక్తి ద్వారా అంతరంగం నిర్మలమవుతుంది. మనలోపల( inside) అనంతమైన శక్తి ఉంది. అది తెలియక మనం బయట వేతుకుతాం…. హైయెస్ట్ లెవల్ అఫ్ ( highest level of consciousness) అనంతత్వం లోపలే ఉంది. అందుకే దాజీ (కమలేష్ డి. పటేల్) “మీరు మీ లోపల తిరగండి సకల జ్ఞానం, శక్తులు అక్కడే ఉన్నాయి. మీ భాగ్యం,భగవంతుడు అన్ని మీ లోపలే ఉన్నాయి.” అంటారు. దానికి ఒక ఉదాహరణ కూడా చెబుతారు. ‘గుడ్డు లోపలి నుండే శక్తి ద్వారా పగిలితే జీవం మొదలవుతుంది. గుడ్డు బయట శక్తి ద్వారా పగిలితే జీవం అంతమవుతుంది. గొప్ప గొప్ప విషయాలు మన లోపలే ఉన్నాయని”చెప్తారు.
హార్ట్ఫుల్ ధ్యాన పద్ధతి మూడు రకాలు
1. క్లీనింగ్ (నిర్మలీకరణ)
2. మెడిటేషన్.
3. కనెక్ట్ విత్ హార్ట్.
హార్ట్ ఫుల్ నేస్’ లో అభ్యాసి అవ్వాలంటే heartfulness settings 24 /7 instant settings world wide trainers (preceptors) ఆన్లైన్లో సిద్ధంగా ఉంటారు. మీరు ఆన్లైన్లోనే అభ్యసిగా మీ ప్రయాణం మొదలుపెట్టొచ్చు. రిమోట్ డైరెక్టర్ సిట్టింగ్… మూడు రోజుల కోర్స్ ఉంటుంది. కోర్స్ (సత్సంగ్) పూర్తి అవ్వగానే అభ్యాసి హృదయం మానసిక సంక్లిష్టతను నుండి సరళత వైపు సాగుతుంది. “మన విధి రూపకల్పనకు ప్రతిరోజు ఒక సువర్ణావకాశమే”… ప్లే స్టోర్ లో hearts app ఉంది. heartfulness.org, Heartfulness YouTube లో ధ్యాన బోధనకు, ఆధ్యాత్మికతకు అనేక వీడియోలు ఉన్నాయి.
ప్రస్తుతం నిర్భందగా ఉన్న “Pandamic situation” లో మనల్ని ధైర్యంగా నిలబెట్టుకో గలిగేది మనమే. దానికి హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ “వ్యాక్సిన్ “లా పనిచేస్తుంది. మనిషి తన సుఖం,సౌఖ్యం మాత్రమే చూసుకొని బలహీనపడుతున్నాడు. ప్రస్తుతం దేశంలో సగానికిపైగా జనం స్ట్రెస్ లో ఉన్నారు. స్ట్రెస్ వల్ల హార్మోన్స్ పనిచేస్తాయి. థైరాయిడ్ హార్మోన్స్ విడుదలవుతాయి. బాడీ మెటబాలిజం చేంజ్ అవుతుంది. దాని వల్ల ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇన్నర్ హార్ట్ కండిషన్ డిస్టబ్ గా ఉంటే…. తృప్తి అనేది ఉండదు. ‘తృప్తి ‘బయట ఎక్కడా దొరకదు నీలోనే ఉంది. కేవలం ధ్యానంలోనే ఉంది. హ్యాపీనెస్, పీస్ ఫుల్ నెస్ సాధించాలంటే హాట్ ఫుల్ గా ధ్యానించాలి.
నిర్మలికరణ ప్రక్రియ
ప్రతి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక భావోద్వేగాల భారం మనుషుల మనసులో పేరుకుపోతుంది. సాయంత్రం ఇంటికి రాగానే రకరకాల ఆలోచనలతో అలిసిపోయి ఉంటాము. రోజువారీ పనులన్నీ పూర్తయ్యాక రాత్రి పడుకునే ముందు హృదయపు చైతన్య క్షేత్రాన్ని శుద్ధి చేయడాన్ని నిర్మలికరణ అంటారు. నిర్మలీకరణ ద్వారా మనసు సుస్థిరమైన సమతుల్యమైన స్థితికి చేరుతుంది. ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ.
SRCM
శ్రీ రామచంద్ర పబ్లికేషన్స్ ద్వారా అనేక పుస్తకాలు పబ్లిష్ చేశారు. Reality at dawn, my master, combined works of chariji , truth eternal ,heart speak, The pursuit of inner way 20కి పైగా భాషల్లో అనువదించబడ్డాయి.
కమలేష్ డి. పటేల్ గారు రాసిన the heartfulness way (2018), designing destiny చాలా ప్రజాదరణ పొందాయి.
ఒక్క నిమిషంలో జీవితం మారదు. కానీ ఒక్క నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది.
ఇంకెందుకు ఆలస్యం ధ్యానం మొదలెట్టండి. ఒత్తిడిని నిర్వీర్యం చేసుకొని తేలిగ్గా ఉండండి. ఇంట్లోనే ఉండండి. హార్ట్ ఫుల్ గా ఉండండి. సంతోషంగా ఉండండి అది పదిమంది పంచండి…..
హార్ట్ టూ హార్ట్ ప్రేమలో ఎదగండి.
rameshcheppala@gmail.com
The article is really good 🤩
This article is really good🤩
Superb sir… U r writings are always 👌👌👌👌.