సిరులొలుకు భక్తిగీతం
“సిరులోలికించే సిరి మా లక్ష్మి….లోక పావనివి నీవే నమ్మా” అంటూ పెన్నా సౌమ్య ఆర్ద్రంగా గానం చేసిన ఈ గీతం సకల భాగ్యాలకు కొలవైన అమ్మవారికి ఆత్మైక నివేదన. సంపద – శ్రేయస్సు కోసం ముకుళిత హస్తాల నీరాజనం. భక్తి ప్రపత్తుల తలపు. నిండు ఆశీర్వాదాలకై స్వరార్చన. రచన నరెద్దుల రాజారెడ్డి.
సిరులొలికించే సిరిమాలక్ష్మీ
లోకపావనివి నీవేనమ్మా
కనులారా నిను చూసినా
మనసారా నిను తలచినా
సకలభాగ్యాల కొలువౌనమ్మా
జగతికి దీపం నీ వెలుగేనమ్మా
మనిషికి మనుగడ నీదేనమ్మా
క్షణమొకసారిగ తలచిన చాలు
యోగం భాగ్యం చేకూరునమ్మా
పద్మాసనమున వెలసిన లక్ష్మీ
నలుదిక్కుల నీ కరుణేనమ్మా
సర్వం చల్లని నీ దీవెనలేమ్మా
అణువణువు నీ అభయం చాలు
క్షణమొక యోగం కలిగేనమ్మా
కళకళలాడే నగుమొము లక్ష్మీ
నీ చరణాగతినే నమ్మితినమ్మా
మా వినతిని విని కనవమ్మా
ప్రతి నిమిషం నిను తలచితే చాలు
దుర్గుణములే తొలిగేనమ్మా
అష్టరూపాల మాతవమ్మా