Editorial

Friday, November 22, 2024
శాసనంకోడూరు, త్రిపురాంతక శాసనాలు

కోడూరు, త్రిపురాంతక శాసనాలు

Shasanamనేడు ఆగస్ట్ 18

క్రీ.శ 1312 ఆగస్ట్ 18 నాటి త్రిపురాంతక శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రుని పాలనలో త్రిపురాంతక చంద్రభూషణశివాచార్యులు, త్రిపురాంతక పూజారులు, డెభైరెండు నియోగాలవారు, అసంఖ్యాతమహేశ్వరులు మున్నగువారు త్రిపురాంతక స్థానాపతి పంచిన క్రమానుసారం వుండునట్లుగా తమలో ఒప్పదం చేసుకున్నట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా X నెం 502].

అట్లే క్రీ.శ 1548 ఆగస్ట్ 18 నాటి కోడూరు (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో కోడూరు చెన్నకేశవ దేవర దీపారాధన అమృతపళ్ళకు దొమ్మరివారు ఆ గ్రామంలో తమకు వచ్చే దొమ్మరిపంన్నును ధారపోసి యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు II నెం 199].

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article