Editorial

Friday, January 10, 2025
ప‌ద్యంకరుణశ్రీ - విశ్వ ప్రేమ

కరుణశ్రీ – విశ్వ ప్రేమ

“ప్రేయసీ ! సృష్టియంతయు ప్రేమ మయము!” అంటూ జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ ) రాసిన అద్భుతమైన సీస పద్యం ఇది. గానం శ్రీ కోట పురుషోత్తం

ఏ ప్రేమ మహిమచే నీ ధారుణీచక్ర
మిరుసు లేకుండనే తిరుగుచుండు
ఏ ప్రేమమహిమచే నెల్ల నక్షత్రాలు
నేల రాలక మింట నిలిచియుండు
ఏ ప్రేమమహిమచే పృథివిపై బడకుండ
కడలిరాయుడు కాళ్ళు ముడుచుకొనును
ఏ ప్రేమమహిమచే నీ రేడు భువనాల
గాలిదేవుడు సురటీలు విసరు

ఆ మహాప్రేమ – శాశ్వతమైన ప్రేమ
అద్భుత మఖండ మవ్యక్తమైన ప్రేమ
నిండియున్నది బ్రహ్మాండభాండమెల్ల
ప్రేయసీ ! సృష్టియంతయు ప్రేమ మయము!

Painting by AGACHARYA A

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article