Editorial

Thursday, November 21, 2024
కాల‌మ్‌ఐన్ స్టీన్ ఆనంద మంత్రం : ఈ వారం వెలుతురు కిటికీ

ఐన్ స్టీన్ ఆనంద మంత్రం : ఈ వారం వెలుతురు కిటికీ

ఈ ప్రపంచంలో చాలామంది 99 క్లబ్ లో సభ్యులు. 99 క్లబ్ లో ప్రవేశం ఉచితమే, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. చేరిన తర్వాత కూడా అనారోగ్యం, అసంతృప్తి, అశాంతి, దుఖ్ఖం, కోపం వంటివన్నీ ఉచితంగానే వస్తాయి. ఆ క్లబ్ గురించి  చదివే ముందు మరి కొన్ని కథలను ఉపోద్గాతంగా  చెబుతాను. మరి రండి. జీవన వికాసం తెలిపే వెలుతురు కిటికీకి స్వాగతం.

సిఎస్ సలీమ్ బాషా

ఒక ప్రొఫెసర్ ఇంటికి చాలాకాలం క్రితం ఆయన దగ్గర చదువుకున్న విద్యార్థులు వచ్చారు. ఆయన అందరినీ పేరుపేరునా పలకరించాడు. తర్వాత “వంటింట్లో కెటిల్ లో కాఫీ ఉంది. అల్మైరాలో కప్పులు ఉన్నాయి. మీకు కావలసిన కప్పు తీసుకొని అందులో కాఫీ పోసుకొని రండి” అన్నాడు. అందరూ అల్మైరా దగ్గరికి వెళ్లారు. అక్కడ రకరకాల కప్పులు ఉన్నాయి, కొన్ని గాజువి, కొన్ని పింగాణి వి, మరికొన్ని ప్లాస్టిక్ వి, కొన్ని మట్టితో చేసినవి, కొన్ని పేపర్ తో చేసినవి. అందరూ వారికి నచ్చిన కప్ లో కాఫీ పోసుకుని ప్రొఫెసర్ దగ్గరికి వచ్చారు. అప్పుడు ప్రొఫెసర్ “మీరంతా బాగా లేని కప్పులని వదిలేసి, మంచి మంచి కప్పులు సెలెక్ట్ చేసుకున్నారు. కాఫీ గురించి ఎక్కువ ఆలోచించలేదు. మన జీవితం “కాఫీ” అనుకుంటే, కప్పులు అన్నవి కార్లు, బంగళాలు, ఉద్యోగాలు ఇతర వస్తువుల వంటివి. మనం “కాఫీ”(జీవితం) మీద కాకుండా వాటి మీద (కప్పుల మీద) దృష్టి పెడితే ఎలా ఉంటుంది? చాలా మంది కాఫీ కన్నా దాన్ని తాగే కప్ ల మీద దృష్టి పెడతారు. మనం తాగే కాఫీ ముఖ్యం గానీ, అది పోసుకునే కప్పు ముఖ్యం కాదు” అన్నాడు.

జీవితం ముఖ్యమైనప్పుడు, ఇతర ఏ విషయాలు కూడా అంత ముఖ్యమైనవి కాదు. ఈ విషయం అర్థం అయినప్పుడు ఎవరి జీవితమైనా సరే ప్రశాంతంగా ఉంటుంది.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఉరుకులు పరుగుల మీద ఉంది. ప్రతి ఒక్కరూ రేస్ లో ఉన్నారు. ఎందుకు అన్నది చాలామందికి తెలియదు. చాలామంది జీవితానికన్నావిలువైన వస్తువులకు ప్రాధాన్యతనిస్తారు. అదే జీవితం అనుకుంటారు. పోనీ సంతోషంగా ఉంటారా అంటే, అదీ లేదు. ఎప్పుడు అసంతృప్తితో ఉంటారు.

ఇదే ఐన్ స్టీన్ “ఆనంద సూత్రం”. అన్నట్టు, ఈ మధ్యనే వేలం వేసిన ఆ పేపరు ముక్క ఒకటిన్నర లక్ష డాలర్ల కి అమ్ముడు పోవడం విశేషం!

ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్ స్టీన్ 1922 లో జపాన్ వెళ్ళినప్పుడు tip ఇవ్వడానికి డబ్బులు లేకపోవడంతో ఒక చిన్న పేపర్ మీద నాలుగు ముక్కలు రాసి బెల్ బాయ్ కి ఇచ్చాడు. ఆ మాటలు ఇవే…“A calm mind and modest life brings more happiness than a constant pursuit of success combined with constant restlessness”. దీన్ని స్థూలంగా అనువదించుకుంటే “నిరంతరం ఒత్తిడితో అవిశ్రాంతంగా విజయం కోసం పరిగెత్తడం కన్నా ప్రశాంతంగా ఉన్న నిరాడంబరమైన జీవితం ఎక్కువ సంతోషాన్ని ఇస్తుంది!” ఇదే ఐన్ స్టీన్ “ఆనంద సూత్రం”. అన్నట్టు, ఈ మధ్యనే వేలం వేసిన ఆ పేపరు ముక్క ఒకటిన్నర లక్ష డాలర్ల కి అమ్ముడు పోవడం విశేషం!

ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, “ప్రశాంతమైన” రెండు,”నిరాడంబరమైన” జీవితం. నిరాడంబరమైన జీవితం వల్ల ప్రశాంతత వస్తుంది, ప్రశాంతమైన జీవితం వల్ల నిరాడంబరత వస్తుంది. ఇక్కడ రెండు ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి. ఏది ముందు అన్నది అనవసరం. ఒక విషయం అయితే స్పష్టం. ఈ రెండింటి వల్ల కానీ, ఏదో ఒక దాని వల్ల గానీ సంతోషం వస్తుంది. సూక్ష్మంగా ఆలోచిస్తే చివరికి రెండింటికి అర్థం ఒకటే అనిపిస్తుంది.

ఇక్కడ నిరాడంబరత అంటే సన్యాసి లాగో, సాధువులాగో జీవించమని కాదు. ఆడంబరాలకు, ఆర్భాటాలకు, ఫాల్స్ ప్రెస్టేజ్ కి పోకుండా మన బతుకు మనం బతకడం.

సంతోషం ఉందా లేదా పట్టించుకోరు. ఆడంబరంగా జీవించడమే గొప్ప జీవితం అనుకుంటారు. ఆ ప్రాసెస్ లో చాలామంది ఒత్తిడికి గురవుతారు.

మనం చాలాసార్లు పెళ్ళిలో చూస్తుంటాం. పెళ్లికి వచ్చిన వాళ్లు చాలామంది ఆడంబరంగా కనిపించడానికి ఇష్టపడతారు. కొన్ని పెళ్లిళ్లలో అయితే, పెళ్లి కూతురు కన్నా ఎక్కువగా అలంకరించుకున్న వాళ్ళు చాలామంది కనపడతారు. ఎందుకు అన్న విషయం వాళ్లకు తెలియదు. ఇక్కడ చెప్పేది ఏంటంటే మనదేశంలో చాలామంది వేరే వాళ్లను ఇంప్రెస్ చేయడానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. అందరూ తమ గురించి గొప్పగా చెప్పుకోవాలని ఆరాటపడతారు. దీన్నే సైకాలజీలో లో “Identity Crisis” అంటే “గుర్తింపు కోసం ఆరాటం” అంటారు. సంతోషం ఉందా లేదా పట్టించుకోరు. ఆడంబరంగా జీవించడమే గొప్ప జీవితం అనుకుంటారు. ఆ ప్రాసెస్ లో చాలామంది ఒత్తిడికి గురవుతారు. ప్రశాంతత కరువవుతుంది. దాంతో జీవితంలో అసంతృప్తి ఎక్కువవుతుంది. ఆనందం అడ్రస్ లేకుండా పోతుంది.

ఇక మధ్యతరగతి వారు ఆడంబరాలకు పోయి అప్పుల పాలైన సందర్భాలు కోకొల్లలు. వేరే వాళ్లు ఏమనుకుంటారు, ఇలా చేస్తే మర్యాద ఉండదు అని అనుకోవడం అసలు సమస్యకు మూలం. వేరే వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా మనం బతకడం మొదలుపెడితే సమస్యలకు తలుపు తెరిచినట్లే.

చాలా కాలం క్రితం వచ్చిన ” ది నెక్లెస్” అన్న ఫ్రెంచ్ కథ దీనికి చక్కని ఉదాహరణ.”మపాసా” రాసిన ఈ కథ మధ్యతరగతి ఆడంబరం వల్ల ఒక కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు చక్కగా ఆవిష్కరించింది.

చాలా కాలం క్రితం వచ్చిన ” ది నెక్లెస్” అన్న ఫ్రెంచ్ కథ దీనికి చక్కని ఉదాహరణ.”మపాసా” రాసిన ఈ కథ మధ్యతరగతి ఆడంబరం వల్ల (false prestige) ఒక కుటుంబం ఎదుర్కొన్న కష్టాలు చక్కగా ఆవిష్కరించింది. ఒక మధ్యతరగతి మహిళ ఒక  ఫంక్షన్ కి వెళుతూ ఆడంబరం కోసం పక్కింటి ధనిక మహిళ నుంచి ఒక నెక్లెస్ ఆరువు తీసుకుని వెళ్లడం, అక్కడ దాని పోగొట్టుకోవడం, మళ్లీ అలాంటి నెక్లెసే ఆ మహిళకు వెనక్కి తిరిగి ఇవ్వడం కోసం అష్టకష్టాలు పడడం ఈ కథ సారాంశం.

నిరాడంబరత అంటే ఆడంబరాలకు పోకపోవడం, లేనిదాని కోసం అసంతృప్తి చెందకుండా మనకున్న దాని తోనే సంతృప్తిగా బతకడం. మన పరిధిలో మనకు ఉన్నంతలో ప్రతిరోజు సంతోషంగా ఉండే ప్రయత్నం చేయటం.

ఎవరి జీవితంలో అయినా సరే అసంతృప్తి అన్నది అత్యంత ప్రమాదకరమైనది. ప్రశాంతమైన జీవనం అనే పెద్ద ఓడకి అసంతృప్తి అనే చిన్న రంధ్రం ఏర్పడితే ఓడ మునగడం ఖాయం. టైటానిక్ అనే అతి పెద్ద ఓడ కి జరిగింది అదే. నిజానికి టైటానిక్ అంటే unsinkable ship అని అర్థం!

అసంతృప్తిగా ఉండే వాళ్ళు ఎవరు? అంటే “99” క్లబ్ లో చేరిన వారు అని చెప్పవచ్చు.

99 క్లబ్ అంటే ఏంటి?

ఒక రాజ్యంలో దాదాపు (రాజుతో సహా) ఎవరూ సంతోషంగా ఉండరు. అలా ఒక రోజు రాత్రి మారువేషంలో రాజు మంత్రి తిరుగుతుండగా ఒక ఇంట్లో నుంచి నవ్వుతూ, ఉల్లాసంగా, సంతోషంగా ఉన్న భార్యాభర్తలు కనిపిస్తారు. అప్పుడు రాజు ఆశ్చర్యంగా మంత్రిని “వీళ్ళు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు ఎందుకు?” అని అడుగుతాడు. అప్పుడు ఆ మంత్రి , “ఏమీ లేదు రాజా వాళ్ళు 99 క్లబ్ లో ఇంకా చేరలేదు అందుకే సంతోషంగా ఉన్నారు” అంటాడు. “ 99 క్లబ్ అంటే ఏమిటి? ” అని రాజు అడిగితే, రేపు చెప్తాను అంటాడు మంత్రి.

మర్నాడు ఉదయమే మంత్రి రాజు గారిని అడిగి 99 బంగారు నాణేలు తీసుకొని ఒక సంచిలో వేసి మూట కడతాడు. “ఎందుకు?” అని ఆశ్చర్యంగా మహారాజు అడిగితే. “రాత్రి మీకే తెలుస్తుంది”. అని చెప్తాడు. ఇద్దరు కలిసి మళ్లీ ఆ ఇంటికి వెళ్తారు. మంత్రి తన దగ్గరున్న 99 నాణేల మూట ఆ ఇంటి ముందు పడేస్తాడు. రాజు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే “ రాజా ఒక 6 నెలల తర్వాత మళ్ళీ వస్తే 99 క్లబ్ అంటే ఏంటో మీకు తెలుస్తుంది ” అంటాడు.

నెల క్రితం ఎంతో సంతోషంగా ఉన్న ఆ భార్యాభర్తలు ఇప్పుడు కోపంతో గొడవ పడుతున్నారు, “దీనికి కారణం ఏంటి?” అని అడుగుతాడు రాజు. మంత్రి నవ్వి “దానికి కారణం వాళ్ళు 99 క్లబ్ లో చేరడమే మహారాజా” అని చెప్తాడు.

ఆరు నెలల తర్వాత రాజు మంత్రి కలిసి మళ్లీ సంతోషంగా ఉన్న ఆ దంపతుల ఇంటి దగ్గరికి వెళ్తారు. ఆ ఇంట్లో నుంచి అప్పుడు గట్టిగా అరుపులూ , కేకలు వినబడతాయి. భర్త భార్యను తిడుతూ ఉంటాడు. ఆమె కూడా కోపంతో ఏదో జవాబిస్తూ ఉంటుంది. రాజు ఆశ్చర్యపోతాడు, ఒక నెల క్రితం ఎంతో సంతోషంగా ఉన్న ఆ భార్య, భర్తలు ఇప్పుడు కోపంతో గొడవ పడుతున్నారు, “దీనికి కారణం ఏంటి?” అని అడుగుతాడు. మంత్రి నవ్వి “దానికి కారణం వాళ్ళు 99 క్లబ్ లో చేరడమే మహారాజా” అని చెప్తాడు. రాజు “నాకు అర్థం కాలేదు వివరంగా చెప్పు” అని అడిగితే, మంత్రి ఇలా చెప్తాడు, “నెల క్రితం మనం 99 బంగారు నాణేలు వాళ్ళ ఇంటి ముందు పడేశాము, మీ గుర్తుంది కదా? నేను భార్యాభర్తలను గమనించమని మన గూడచారికు చెప్పాను. ఆరోజు ఉదయాన్నే బంగారు నాణేల మూట చూసిన భర్త ఎవరో పడేసుకున్నారు పాపమని సాయంత్రం వరకు ఎదురు చూశాడు. అలా ఎదురు చూసి నాలుగు రోజుల తర్వాత ఇంక ఎవరూ రారా అని చెప్పి మూట విప్పి చూశాడు. అందులో ఉన్న బంగారు నాణేలు చూసి ఆనందపడి ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టాడు. 99 ఉన్నాయని తెలిసి, బయట, చుట్టుపక్కల వెతికాడు. ఒక్క నాణేం దొరికేతే బావుణ్ణు అని ఎంతో వెతికి, నిరాశ పడ్డాడు. ఎలాగైనా అ ఒక్క నాణెం సంపాయించి 100 బంగారు నాణేలు చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. అప్పట్నించి తిండీ తిప్పలు మానేసి ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా భార్యాభర్తలు అదనంగా పనిచేయటం మొదలు పెట్టారు. అసలే 99ని 100 చెయ్యాలనుకుంటే, కొడుకు ఒక బంగారు నాణెం తిసుకెళ్ళీ ఖర్చు పెట్టాడు. ఇప్పుడు మళ్ళీ 98 ని 99 చెయ్యాలి కదా అని భార్య, కొడుకుతో గొడవ పడుతున్నాడు!!”

ఇప్పుడు ఆశ్చర్యపోవడం రాజు వంతు అయింది. అప్పుడు రాజు మంత్రిని (కాసింత జ్ఞానోదయం అయింది కాబట్టి) ” అయితే నేను కూడా 99 క్లబ్ సభ్యుడిని నేనా?” అంటూ నిట్టూర్చి “పద నా సభ్యత్వం రద్దు చేసుకుంటాను” అన్నాడు.

మనం కూడా ఎవరైనా 99 క్లబ్ లో చేరి ఉంటే, వెంటనే సభ్యత్వం రద్దు చేసుకోవడం వల్ల ప్రశాంతమైన, నిరాడంబరమైన ఆనందకరమైన జీవితం వైపు మొదటి అడుగు వేసినట్లే.

మనం కూడా ఎవరైనా 99 క్లబ్ లో చేరి ఉంటే, వెంటనే సభ్యత్వం రద్దు చేసుకోవడం వల్ల ప్రశాంతమైన, నిరాడంబరమైన ఆనందకరమైన జీవితం వైపు మొదటి అడుగు వేసినట్లే.

ఈ ప్రపంచంలో చాలామంది 99 క్లబ్ లో సభ్యులు. 99 క్లబ్ లో ప్రవేశం ఉచితమే, డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. చేరిన తర్వాత కూడా అనారోగ్యం, అసంతృప్తి, అశాంతి, దుఖ్ఖం, కోపం వంటివన్నీ ఉచితంగానే వస్తాయి. ఉన్నదాంతో తృప్తి పడితే, 99 క్లబ్ లో చేరవలసిన అవసరం ఉండదు. సంతోషంగా ఉండవచ్చు. ఎందుకంటే తృప్తికి అంతుంది, అసంతృప్తికి అంతులేదు. Satisfaction is limited but gives unlimited happiness; dissatisfaction is unlimited but gives unlimited unhappiness!
అదీ విషయం.

ప్రశాంతమైన, నిరాడంబరమైన జీవితం వల్ల సంతోషం వస్తుందని తెలుసుకున్న వారెవ్వరు 99 క్లబ్ లో చేరడం జరగదు. ఐన్ స్టీన్ ఆనంద మంత్రం ఇదే!

కాలమిస్టు సలీం భాషా సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. ఉద్యోగ నైపుణ్యాల భోదకులు కూడా. వారి మొబైల్ నంబర్ 93937 37937

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article