Editorial

Friday, November 22, 2024
సినిమామిస్ జొహ్రాజాన్ : చరిత్ర కందిన తొలితరం తార

మిస్ జొహ్రాజాన్ : చరిత్ర కందిన తొలితరం తార

హైదరాబాదు నేలమీద ఎందరో తొలితరం సినిమాకారులు పుట్టి పైకెదగడమే గాక మరెందరో ఇతర ప్రాంతాల వారికి ఆశ్రయమిచ్చి, వారి సినీ జీవితానికి ఆలంబనగా నిలిచిన చరిత్ర ఉన్నది. దక్కనీ సంప్రదాయ నృత్య సంగీతాలకు ఇక్కడున్న ఆదరణే ఇందుకు మూలకారణం. ఈ నేపథ్యంలో హైదరాబాదు నగరంలో తన నృత్య, గాన, నట జీవితాన్ని గడిపిన మిస్ జొహ్రాజాన్ గురించి దాదాపుగా ఎవరికీ తెలియదు. ఇంతకు ఎవరీ జొహ్రాజాన్?

హెచ్. రమేష్ బాబు 

మిస్ జొహ్రాజాన్ పేరుతోనే సినిమా చరిత్రకారులు, హిందీ సినీ, సంగీత ప్రేమికులు తికమక పడతారు. జొహ్రాజాన్ పేరుతో ముగ్గురున్నారు. బాయి ఆగ్రావాలీగా పేరున్న జొహ్రాజాన్ ఒకరైతే, జొహ్రాజాన్ అంబాలా వాలీ అని మరొకరున్నారు. వీరిలో మొదటి ‘జొహ్రాజాన్ ఆగ్రావాలీ’ గొప్ప శాస్త్రీయ గాయనైతే, రెండో జొహ్రాజాన్ అంబాలావాలీ హిందీ సినిమాల్లో పేరున్న నేపథ్యగాయని. అయితే, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మూడవ తార మిస్ జొహ్రాజాన్ స్వతహాగా గొప్ప నర్తకి, నటి, గాయని. కలకత్తాకు చెందిన వారామె.

మిస్ జొహ్రాజాన్ వంశపారం పర్యంగా సంప్రదాయ నృత్యమే జీవనోపాధిగా వస్తున్న కుటుంబానికి చెందిన వారు. వారి కుటుంబం పంజాబ్కు చెందినది. కాని స్థిరపడింది కలకత్తాలో. జొహ్రాజాన్ పుట్టింది మాత్రం ఢల్లీలో. అయితే చిన్నతనంలోనే లాహోర్లో నాట్యం నేర్చుకున్నదామె. పంజాబీ, ఉర్దూ, పష్తో భాషలు నేర్చుకున్న ఆమె శ్రద్ధాసక్తులన్నీ సంగీత నాట్యాలపైనే. ఆమె పెద్దక్క మిస్ ముష్తారీ అప్పటికే మూకీ సినిమాల్లో ప్రవేశించింది. మిస్ జొహ్రాజాన్ కూడా ఆమెనే అనుసరించింది. ఇప్పటికే ఇంతకు మిస్ జొహ్రాకు హైదరాబాదు ఏమిటి సంబంధం అంటారా?

నృత్య సంగీతాలే వారి జీవనాధారం కనుక వారి కుటుంబం నాటి అవిభక్త భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పర్యటించేది. అందులో భాగంగా కలకత్తా నుండి మిస్ జొహ్రాజాన్ 1920 తొలిరోజుల్లో హైదరాబాదుకు వచ్చింది.

నృత్య సంగీతాలే వారి జీవనాధారం కనుక వారి కుటుంబం నాటి అవిభక్త భారతదేశంలోని ప్రధాన నగరాల్లో పర్యటించేది. అందులో భాగంగా కలకత్తా నుండి మిస్ జొహ్రాజాన్ 1920 తొలిరోజుల్లో హైదరాబాదుకు వచ్చింది. అది మొదలు 1940 దశకం వరకు ఇక్కడే ఉన్నారు. నగరంలో జొహ్రాజాన్ సంగీత నృత్యప్రదర్శనలు బహుళ జనాదరణ పొందినవి. దాంతో ఆర్థికంగా స్థిరపడటానికి ఆమెకు ఎంతో కాలం పట్టలేదు. ఆ రోజుల్లో ఆమె తన స్వంత ‘బగ్గీ’లో వీధుల్లో వెళితే జనాలు ఆసక్తిగా చూసేవారు. ఆమె అందం అందరినీ మైమరపించేది. చాలా ఖరీదైన దుస్తులు ధరించి ‘ముజ్రా’ నృత్యం చేసేది. చాలా క్రమశిక్షణ పాటించడమే కాదు. తన నియమ నిబంధనలకు అంగీకరించిన చోటనే నృత్యం చేసేది. నవాబులు, వ్యాపారస్తులు, పెద్ద పెద్ద బ్రిటీష్ సైనికాధికారుల సమక్షంలోనే నృత్యం చేసేదామె.

నృత్యగానం చేసే వారికి నాటి సినిమా రంగం తలుపులు ఎప్పుడూ తెరిచే వుండేవి. అది మూకీ యుగం. జొహ్రాజాన్ సినిమా నటిగా మారింది 1928లో.

నృత్యగానం చేసే వారికి నాటి సినిమా రంగం తలుపులు ఎప్పుడూ తెరిచే వుండేవి. అది మూకీ యుగం. జొహ్రాజాన్ సినిమా నటిగా మారింది 1928లో. హైదరాబాదు నుండి బొంబాయి వెళ్లిన జొహ్రా చేసిన ముజ్రా నాట్యం చూసి 1929లో ‘నందకుమార్’ మూకీలో తొలిసారిగా నటించే అవకాశం వచ్చింది. ఆమె వెంటనే మరో మూకీ ‘రాధాకృష్ణ’ (1930)లో నటించింది. ఈ కాలంలోనే జొహ్రా పాడిన ముజ్రా గీతాలు, భక్తి గీతాలు ‘ట్విన్ రికార్డింగ్ కంపెనీ’ వారి ద్వారా రికార్డులుగా విడుదలైనవి. హైదరాబాదులోని చాలా మంది సంగీత ప్రేమికులు కలెక్షన్లలో ఆమె రికార్డులుండేవి.

మిస్ ముష్తారీ

1931లో టాకీ సినిమాలు వచ్చినవి. అప్పటికే సినిమాల్లో తారగా ఎదిగిన ఆమె అక్క మిస్ ముష్తారీతో బాటు జొహ్రాకు కూడా అవకాశాలు రాసాగాయి. హీరోయిన్ గా,  సహాయ నటిగా, డాన్సర్ గా, వాంప్ గా అన్నిరకాల పాత్రలను అద్భుతంగా పోషించింది. ప్రధానంగా పాశ్చాత్య పోకడలున్న పాత్రలు ఆమెకు కొట్టినపిండి.

1935 నాటికి చాలా డిమాండ్ ఉన్న తారగా ఎదిగి జొహ్రా నటించిన తొలిటాకీ ‘అనంగసేన’ (1931), తరువాత ‘నీతీ విజయ్’, ‘దగాబాజ్ ఆషిక్’, ‘భారతీమాత’(1932), ‘జహర్ ` ఎ ` ఇష్క్’, ‘అలిఫ్లైలా’(1933), ‘ఆదిల్`ఎ`జహంగీర్’, ‘ఇరాక్ కాచోర్’, ‘వసంతసేన’(1934), ‘మదన మంజరి’, ‘ప్రేమ్ పూజారి’, ఫాషనబుల్ ఇండియా (1935), ‘ఆజాద్వీర్’ (1936), ‘భోలీలు టేరన్’ (1940) వంటి టాకీలో పలు పాత్రల్లో నటించింది మిస్ జోహ్రా.

1940లో హైదరాబాదు నుండి వెలువడే ఉర్దూ పత్రిక ‘సినిమా’ ఆమెను ‘మార్లిన్ డైట్రిచ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని కీర్తించింది. ఏది ఏమైనా మన చరిత్ర కందిన తొలితరం తారగా జొహ్రాజాన్ని గుర్తు చేసుకోవడం ఇప్పుడు మన చారిత్రకవసరం.

జొహ్రా ఆ తరం బ్రహ్మచారుల కలలరాణిగా పేరొందింది. ఎందరో ధనవంతులైన యువకులు ఆమెను పెండ్లాడేందుకు వర్తమానాలు పంపి ప్రయత్నించారు. ఎందుకో కాని ఆమె వివాహానికి అంగీకరించలేదు. పెళ్లి తరువాత తాను పెద్దపెద్ద హవేలీల్లో నాలుగు గోడలకే పరితమైపోయి గడపాల్సి వస్తుందని భావించి జీవితాంతం నృత్యసంగీతాలకే అంకితమై బ్రతికింది జొహ్రా.

1940లో హైదరాబాదు నుండి వెలువడే ఉర్దూ పత్రిక ‘సినిమా’ ఆమెను ‘మార్లిన్ డైట్రిచ్ ఆఫ్ ఇండియన్ సినిమా’ అని కీర్తించింది. ఏది ఏమైనా మన చరిత్ర కందిన తొలితరం తారగా జొహ్రా జాన్ని గుర్తు చేసుకోవడం ఇప్పుడు మన చారిత్రకవసరం.

హైదరాబాదీల అభిమాన తార – మిస్ ముష్తారి

మిస్ జోహ్రా జాన్ సోదరి మిస్ ముష్తారి గురించి మరిన్ని వివరాలు చదవండి.

హిందీ టాకీల తొలిరోజుల్లో కేవలం నాలుగేళ్లు మాత్రమే పరిశ్రమలో ఉండి జనాదరణ పొంది అర్ధాంతరంగా రాలిపోయిన తార మిస్ ముష్తారి. ఆమె లాహోర్లో పుట్టింది. అక్కడే సంగీత, నృత్యాల్లో శిక్షణ పొంది సినిమాల్లోకి ప్రవేశించింది. నటించిన తొలి సినిమా ‘‘అనంగసేన’’ (1931). ఆ తరువాత వరుసగా ‘‘సతీసోని’’, ‘‘దగాబాజ్ ఆషిక్’’, ‘‘నేక్అబ్లా’’, ‘‘భారతీమాత’’ (1932), ‘‘దోరంగీ దునియా’’ (1933), ‘‘రుక్మిణీ హరణ్’’, ‘‘మంజరి’’ (1934) చిత్రాలు ఆమె నాయికగా నటించినవి.

‘‘రుక్మిణీ హరణ్’’లో రుక్మిణిగా ఆమె నటన ఆ రోజుల్లో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసింది. పాటల సంగతి చెప్పనవసరం లేదు. దేశమంతా మారుమోగినవి.

మిస్ ముష్తారి ఇతర తారల్లా గాకుండా ఎలాంటి రంగస్థల, మూకీల నటనానుభవం లేకుండానే సినిమాల్లోకి వచ్చింది. అమాయకపు దృక్కులు, గాన కౌశలం ఆమె అదనపు అర్హతలు. అవే ఆమెకు అభిమానులను సంపాదించి పెట్టినవి. అయితే మంజరి సినిమాలో నటిస్తున్నప్పుడే ఆమె అనారోగ్యానికి గురైంది. బయటి ప్రపంచానికివేమీ తెలియదు. హఠాత్తుగా 1934 జూన్ 8న ఆమె మరణించింది. అప్పటికి పాతికేళ్ల వయసు కూడా లేని ఆమె మరణం అభిమానులకు అశనిపాతం వంటిది.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article