Editorial

Thursday, November 21, 2024
వ్యాసాలుచిన్న వయసులోనే వృద్ధాప్యం : 45 ఏండ్లకే పింఛన్ల ఆవశ్యకత

చిన్న వయసులోనే వృద్ధాప్యం : 45 ఏండ్లకే పింఛన్ల ఆవశ్యకత

సిద్ధిపేట నేతన్న : అంతంత సుందరమైన గొల్లభామ చీర నేసిన చేతులు ఇవి . చిత్రం కందుకూరి రమేష్ బాబు

రెక్కాడితే  గాని డొక్కాడని బతుకులు అన్న సామెతకు నిజమైన ప్రతిబింబాలు వీరు. అటువంటి పద్మశాలీల నుంచి వస్తోన్న డిమాండ్ లలో ప్రథమ విజ్ఞప్తి హెల్త్ కార్డు గురించి కాగా మరో ముఖ్యమైన విషయం, పింఛను.

కందుకూరి రమేష్ బాబు 

గతంలో తెలంగాణ ప్రభుత్వం రాక ముందు పద్మశాలీలకు హెల్త్ కార్డు ఉండేది. ‘మహాత్మాగాంధీ బంకర్ బీమా యోజన- ICICU లంబార్డ్ పథకం’ కింద వారు కేవలం 80 రూపాయలు కడితే 15 వేల రూపాయల వరకు వైద్య సేవలు ఉచితంగా ఉండేవి. ఏ సమస్య వచ్చినా వైద్య సేవల కోసం ఈ కార్డు తీసుకొని ప్రైవేటు హాస్పిటల్ కు వెళ్ళేవారు. ఆ కార్డు నేతన్నలకు గొప్ప భరోసాగా ఉండేది. దురదృష్టవశాత్తూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆ పథకం నిలిపివేశారు. తిరిగి ఈ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని పద్మశాలీలంతా ఎంతో కాలంగా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పథకాన్ని మరింత ప్రయోజనకరంగా మార్చి, కనీసం 50 నుంచి లక్ష రూపాయల విలువైన సేవలు అందేలా చేయాలని వారు కోరుతున్నారు.

బంకర్ యోజన పథకం ద్వారా పద్మశాలీలు రోజువారీ వైద్య సేవలకోసం మంచి ఆసుపత్రికి వెళ్ళే అవకాశం ఉందేది. ప్రస్తుతం ఆ సౌకర్యం లేక నిరుపేద నేతన్నలు చాలా ఇబ్బంది పడుతున్నారు.

కాగా, ‘తెల్ల రేషన్ కార్డు ఉంది కదా?’, ‘ఆరోగ్య శ్రీ సేవలు పొందచ్చు కదా?’ అన్న వాదన తేవొచ్చు. అయితే, ఆరోగ్య శ్రీ సేవల విషయంలో సమస్యలు ఉంటూనే ఉన్నాయి. అలాగే ఆ అవకాశం వాడినా అది తీవ్రమైన అనారోగ్య సమస్యలకోసం ఉపయోగించుకుంటారు. కానీ, బంకర్ యోజన పథకం ద్వారా పద్మశాలీలు రోజువారీ వైద్య సేవలకోసం మంచి ఆసుపత్రికి వెళ్ళే అవకాశం ఉందేది. ప్రస్తుతం ఆ సౌకర్యం లేక నిరుపేద నేతన్నలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున ఇదివరకు ఉన్న పథకాన్ని పునరుద్దరించాలని, కాస్త ప్రయోజనకారిగా మార్చాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

పద్మశాలీల నుంచి వస్తోన్న డిమాండ్ లలో ప్రథమ విజ్ఞప్తి దీని గురించే కావడం విశేషం. ఇక మరో ముఖ్యమైన విషయం, పింఛను.

పెన్షన్లకు 45 ఏండ్ల వయో పరిమితి పెట్టాలి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్ల వయో పరిమితి 57 ఏండ్లకు కుదిస్తూ ప్రకటన చేసింది. ఈ లెక్కన మరో ఆరు లక్షల మందికి పైగా లబ్దిదారులకు ఉపయోగం ఉందని తెలిపింది. ఐతే, చేనేత కారుల విషయంలో ఈ సందర్భంగా ఒక విషయం ప్రభుత్వం దృష్టికి తేవలసే ఉన్నది.

ఈ వృత్తిలో ఉన్న వారికి ప్రధాన ఆరోగ్య సమస్యల్లో కంటి చూపు దెబ్బతినడం ముఖ్యమైనది. రెండవది, వెన్ను నొప్పులు – మోకాళ్ళ నొప్పులు. మూడవది, రెక్కలు అస్తమానూ కదిలించడం వల్ల గూడలు అరిగిపోవడం. ఈ మూడు కారణాల వల్ల వారి ఆరోగ్యం త్వరగా దెబ్బతింటోంది. పురుషుల్లోనే కాదు, మహిళల పరిస్థితి కూడా అంతే.

పద్మశాలీలు చిన్న వయసు నుంచే – అంటే పన్నెండవ ఏట నుంచే మగ్గం పనిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు మూడు దశాభ్దాలకు పైగా పని చేయడం వల్ల వారికి 40 ఏండ్లకే కంటి చూపు తగ్గుతోంది.

పద్మశాలీలు చిన్న వయసు నుంచే – అంటే పన్నెండవ ఏట నుంచే మగ్గం పనిలోకి దిగుతున్నట్టు తెలుస్తోంది. దాదాపు మూడు దశాభ్దాలకు పైగా పని చేయడం వల్ల వారికి 40 ఏండ్లకే కంటి చూపు తగ్గుతోంది. అలాగే 45 ఏండ్లకు గూడలు (చేతి) అరిగిపోయి, పని చేయడం ఆపేయవలసి వస్తోంది. యాభై ఏండ్ల లోపే వీరికి వృద్దాప్య ఛాయలు వచ్చేస్తుండటం విచారకరం.

కావున చేనేత వృత్తిలో ఉన్న వారికి ఇప్పటికే యాభై ఏండ్లకు ఇస్తున్న పెన్షన్ 45 ఏండ్ల వయో పరిమితికి తగ్గించడం మంచిదని సూచన. తద్వారా ఎన్నో వేలమంది ఉపశమనం పొందుతారని ప్రభుత్వం గమనించాలి.

చిన్న వయసులో వారికి ‘వృద్ధాప్యం’ అనడం, 45 ఏండ్లకే వారికి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం ఏమిటీ అనిపిస్తే, ‘ఆసరా’ అనడం ఎలాగూ ఉన్నదే. అలా ఇవ్వవలసే ఉన్నది

అవసరం ఐతే, ప్రభుత్వం ఒక సర్వే వంటిది నిర్వహించి వీరి ఆరోగ్య సమస్యలపై మరింత అవగాహన తెచ్చుకోవడం మంచిది. అలాగే పైన పేర్కొన్నట్లు తక్షణం వీరికోసం యాభై లేదా లక్ష రూపాయల లోపు వైద్య సేవల కోసం ఒక హెల్త్ కార్డు ఏర్పాటు చేయాలి. అలాగే, ప్రభుత్వం ఇటీవల 16 నుంచి 60 ఏండ్ల మధ్య వయస్కులకు రైతు బీమా ఏర్పాటు చేసినట్లు వీరికి కూడా అలాంటి ఆరోగ్య బీమా చేయించడం కూడా మంచిది. ఆ దిశగా ఇదివరకే ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేశారు గనుక ఇప్పుడు వీరికి వయో పరిమితి సడలింపు విషయంలో, హెల్త్ కార్డు విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటే అన్ని విధాలా ప్రభుత్వానికి కలిసి వస్తుందని కూడా గ్రహించాలి.

ఇక్కడ మరో విషయం, అంత చిన్న వయసులో వారికి ‘వృద్ధాప్యం’ అనడం, 45 ఏండ్లకే వారికి వృద్ధాప్య పింఛన్లు ఇవ్వడం ఏమిటీ అనిపిస్తే, ‘ఆసరా’ అనడం ఎలాగూ ఉన్నదే. అలా ఇవ్వవలసే ఉన్నది. ప్రత్యేక పరిస్థితుల్లో వారి ఆరోగ్యం సంక్షేమం కోసం ప్రభుత్వం చేయవలసిన పనుల్లో ఈ రెండూ అలోచంచవలసిన అత్యవసర విషయాలు.

కాగా, ఇటీవల టీఆర్ ఎస్ లో చేరిన చేనేత నేత, ఎల్ రమణ గారు త్వరలో ప్రభుత్వంలో ఒక మంచి పదవి పొందే అవకాశం కూడా ఉన్నందున వారు కూడా ఈ విషయమై ముఖ్యమంత్రికి నచ్చజెప్పడం మంచిది.

కాగా, ఇటీవల టీఆర్ ఎస్ లో చేరిన చేనేత నేత, ఎల్ రమణ గారు త్వరలో ప్రభుత్వంలో ఒక మంచి పదవి పొందే అవకాశం కూడా ఉన్నందున వారు కూడా ఈ విషయమై ముఖ్యమంత్రికి నచ్చజెప్పడం మంచిది. ఆ దిశలో వారూ, చేనేత ఉద్యమకారులు నేతన్నల ఆరోగ్య విస్యయంగా ఈ సమస్యలకు ఒక పరిష్కారం చూపెందుకు ప్రయత్నించదానికి ఇదే సరైన సమయం.

ఇక దళిత బంధు మాదిరి చేనేత బంధు కూడా ఇవాలని, నగదు రూపంలో సహాయం చేయాలనీ డిమాండ్ ఉంది. ప్రభుత్వం ఈ దిశగా కూడా ఏదో వ్యూహంతో ఉందని కూడా తెలుస్తోంది. చూడాలి మరి.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article