Editorial

Monday, November 25, 2024
శాసనంఅఱలూరి ఇష్టకామేశ్వరదేవర అఖండదీపానికి...

అఱలూరి ఇష్టకామేశ్వరదేవర అఖండదీపానికి…

Shasanamనేడు తారీఖు ఆగస్ట్ 2

క్రీ.శ 1317 ఆగస్ట్ 2 వ తేదీ నాటి అల్లూరు (ప్రకాశంజిల్లా) శాసనంలో కాకతీయ ప్రతాపరుద్రునికి పుణ్యంగా పిన్న వెంకంగారున్ను, రెడ్లున్ను, కరణాలున్ను సమస్త ప్రజలకు తెలియునట్లుగా (సమక్షంలో) ముద్దనబోయుండు 50 ఆవులు అఱలూరి ఇష్టకామేశ్వరదేవర అఖండదీపానికి నెలకు కుంచెడు నెయ్యి పోయుటకు యిచ్చినట్లుగా చెప్పబడ్డది. శాసనం అసంపూర్ణముగా కన్పిస్తోంది. [నెల్లూరు జిల్లా శాసనాలు II ong 8]

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article