Editorial

Friday, November 22, 2024
శాసనంచెన్నకేశవమూర్తి దశమి ఉత్సవాలు తెలుపు శాసనం

చెన్నకేశవమూర్తి దశమి ఉత్సవాలు తెలుపు శాసనం

Shasanamనేడు తేదీ జూలై 31

క్రీ.శ 1548 జూలై 31 నాటి కోడూరు (కడప జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో మహామండలేశ్వర నందేల తిమ్మయదేవ మహారాజులు ఘండికోటను పాలిస్తుండగా మహామండలేశ్వర పసపుల తిమ్మయదేవ మహారాజులు అందిరాజు కోడూరు గ్రామంలోని చెన్నకేశవమూర్తి దశమి ఉత్సవాలకు, శ్రీజయంతి, శ్రీరామనవమి, సంక్రాంతికి గ్రామంలోని పేంట సుంకము, దినమునకు మూడుమానికల బియ్యం యిచ్చునట్లుగా చెప్పబడ్డది. [కడప జిల్లా శాసనాలు II, నెం 198].

అట్లే క్రీ.శ 1555 జూలై 31 నాటి సోంపల్లె (చిత్తూరు జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో రాజుగారి, రామరాజయ్యగారి ఆనతిని సోమేపల్లి గ్రామంలో ఏదో దానమిచ్చినట్లు చెప్పబడ్డది. శాసన శిల బాగా శిధిలమైనందున యితర వివరాలు తెలియరావడం లేదు. [ద.భా.దే.శా XVI నెం.230].

అట్లే క్రీ.శ 1559 జూలై 31 నాటి వ్యాపులపల్లె (చిత్తూరు జిల్లా) శాసనంలో సదాశివరాయల పాలనలో రామగిరి దుర్గం లక్ష్మీనరసింహమూర్తి (దేవర) అంగరంగ వైభవాలకు జిల్లెల్ల వెంగళయ్య దేవమహారాజులు ముదిపల్లి గ్రామంలోని చేలను, మడులను యిచ్చినట్లుగా చెప్పబడ్డది. [ద.భా.దే.శా XVI నెం 240]

శీర్షిక నిర్వాహకుల పరిచయం

shasanam surya prakash

డా. దామరాజు సూర్యకుమార్ విశ్రాంత చరిత్రోపన్యాసకులు. కీ.శే. బి.ఎన్.శాస్త్రి గారి శిష్యులు. శాసన పరిశోధన ప్రవృత్తి. శ్రీ కృష్ణదేవరాయల తెలుగు శాసనాలు, ఆచంద్రార్కం (తెలంగాణ కొత్త శాసనాలు కొన్ని), తెలంగాణా రెడ్డి రాజుల శాసనాలు – చరిత్ర, ఇప్పటిదాకా వీరు వెలువరించిన మూడు గ్రంధాలు. ప్రస్తుతం భారత ప్రభుత్వం ప్రాజెక్టు చేస్తున్నారు. నివాసం నకిరేకల్, నల్లగొండ జిల్లా.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article