అటునుంచి నరుక్కురమ్మన్నారు…
ఈ సామెత వెనకాల రెండు కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
ఒకటి, అమరకోశం రచించిన అమరసింహుడికి సంభందించింది అంటారు కొందరు. నిజానికి ఆయన ఏ కాలీనుడో, ఏ ప్రాంతీయుడో, ఏ కులస్థుడో నిర్ధారించడానికి తోడ్పడే వివరాలేవీ ఆ గ్రంథంలో లేవుగానీ తాను బౌద్ధుడనే వ్యవహారం పరంపరాగతంగా వస్తున్నది. ఆయన వల్లే ప్రాచుర్యంలోకి వచ్చిన సామెత వెనకాలి కథ ఇది…
భారతదేశంలో భౌద్ధం క్షీణిస్తూ వైదికమతం మళ్ళీ పుంజుకుంటున్న దశలో ఒక రాజు తన రాజ్యంలో వైదికానికి మారడానికి ఇష్టపడని మొండిబౌద్ధులందరినీ నరికించేస్తున్నాడట. అలా ఒకరోజున అలాంటివాళ్ళు 1,500 మందిని పట్టుకొని తెచ్చి నిలబెట్టి వరసగా నరికేస్తున్నారట. ఆ వరసలో మొట్టమొదటివాడు అమరసింహుడు.
’అట్నుంచి నరుక్కురా’ అని కోరాడట. తలారి ’సరే’ నని అటు వెళ్ళాక, తన వంతు వచ్చేలోపు అమరసింహుడు ఆశువుగా 1, 500 శ్లోకాల్లో నామలింగానుశాసనం చెప్పాడంటారు.
’నరకండి’ అని ఆజ్ఞ అయినాక తలారి అమరసింహుడి దగ్గరికొచ్చి ఖడ్గం ఎత్తబోతే అమరసింహుడు ’అట్నుంచి నరుక్కురా’ అని కోరాడట. తలారి ’సరే’ నని అటు వెళ్ళాక, తన వంతు వచ్చేలోపు అమరసింహుడు ఆశువుగా 1, 500 శ్లోకాల్లో నామలింగానుశాసనం చెప్పాడంటారు. ’అట్నుంచి నరుక్కురావడం’ అనే జాతీయం అప్పట్నుంచే ప్రచారంలోకి వచ్చిందని అంటారు.
ఇక, మరో కథ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడికి సంభందించింది.
కొంత మందిని నరికిన తరువాతైనా ప్రభువుకు జాలి కలిగి మిగిలిన వాళ్ళను క్షమించక పోతాడా, ఆ విధంగా ప్రాణాలు దక్కక పోతాయా అన్న ఆశతో వారలా అన్నారట.
అమరావతిని పాలించే కాలంలో దోపిడీ దొంగల బెడద ఎక్కువగా ఉండేదట. వారి బారి నుండి ప్రజలను కాపాడేందుకు ఆయన దోపిడీ దొంగలను పట్టి, బంధించి, వారందరినీ వరసగా నిలబెట్టి తలలు నరకమని తలారులను ఆజ్ఞాపించాడట. ప్రాణాలు కాపాడుకునే దారి లేక ఆ దొంగలు ‘అటు నుండి నరుక్కు రా’ అని ఆయనను ప్రాధేయపడ్డారట. కొంత మందిని నరికిన తరువాతైనా ప్రభువుకు జాలి కలిగి మిగిలిన వాళ్ళను క్షమించక పోతాడా, ఆ విధంగా ప్రాణాలు దక్కక పోతాయా అన్న ఆశతో వారలా అన్నారట. ఆ విధంగా ఈ సామెత పుట్టిందని అంటారు. సత్యం శంకరమంచి రచించిన అమరావతి కథలు పుస్తకంలో కూడా పై కథనం ఉంది.
ఏమైనా, ‘అటునుంచి నరుక్కురా’ అన్న సామెత ఎలా పుట్టినప్పటికీ జన జీవితంలో ఈ సామెత మటుకు వాడుకలో ఉండటానికి ఇలాంటి అనేక కారణాలు ఉండనే ఉంటున్నాయి.