రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపు
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లాలోని కాకతీయ రుద్రేశ్వర ఆలయాన్ని (రామప్ప ఆలయం) యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. ఈ మేరకు యునెస్కో కొద్ది సేపటి క్రితం ట్వీట్ చేసింది. వారసత్వ కట్టడాల విశిష్టతలను గుర్తించేందుకు వర్చువల్‌గా సమావేశమైన వరల్డ్ హెరిటేజ్ కమిటీ ఈమేరకు నిర్ణయం తీసుకుంది.
ఈ నిర్ణయం తెలంగాణ పర్యాటకాన్ని అపురూపంగా, మరొక స్థాయిలో నిర్వహించడానికి బంగారు అవకాశం.
దీంతో ఎన్నో చారిత్రక సాంస్కృతిక ప్రదేశాలున్నప్పటికీ తెలంగాణా రాష్ట్రం రామప్పతో తొలిసారిగా యునెస్కో జాభితాలో చేరినట్టయింది. తెలంగాణకే కాదు, తెలుగు రాష్ట్రాల్లో వారసత్వ గుర్తింపు పొందిన తొలి కట్టడం కూడా ఇదే కావడం విశేషం. ఫలితంగా ప్రపంచ పర్యాటకుల దృష్టిలో ఒక అధికారిక ఆమోదం లభించి లభించినట్టయింది. ప్రభుత్వం విశేషంగా అభివృద్ధి చేయడానికి ఈ గుర్తింపు ఎంతగానో దోహద పడుతుంది.