జాషువా వర్థంతి : గుంటూరు సీమపై పద్యం
ఆధునిక తెలుగు కవులలో అగ్రస్థానం పొందిన కవి గుర్రం జాషువా. కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడ్డ జాషువా ఎన్ని ఛీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందడం విశేష. కవికోకిలగా, నవయుగ కవిచక్రవర్తిగా మన్నలలు పొందిన అయన గుంటూరు జిల్లా వినుకొండలో 1895 సెప్టెంబరు 28న జన్మించారు. నేటికి ఆ మహాకవి మరణించి సరిగ్గా యాభై ఏళ్ళు. ఈ సందర్భంగా వారి స్మృతిలో గుంటూరు పట్టణంపై రాసిన సీస పద్యం ఒకటి విందాం. గానం శ్రీ కోట పురుషోత్తం.
కోట పురుషోత్తం పరిచయం
సాహిత్య ప్రక్రియలో విశిష్టమైన పద్య ప్రశస్తిని గుర్తించిన కోట పురుషోత్తం తిరుపతి నివాసి. వారు రాగయుక్తంగా ఆయా పద్యాలను ఆలపిస్తూ విద్యార్థుల మనసులో నాటుకునేలా చేయడంలో విశేష అనుభవం గడించారు. సులభంగా తాత్పర్యం బోధపడేలా ఉండే అనేక పద్యాలను వారు ఎంచుకుని, కొందరితో రాయించి మరీ వాటిని తానొక నిధిగా సమకూర్చుకున్నారు. నిజానికి వారు పద్యం కోసమే కదలడం జీవన శైలిగా చేసుకోవడం విశేషం. పాఠశాలలు, కళాశాలల్లో చదువుకునే కొన్ని వేల మంది బాలబాలికలు, యువతీ యువకుల్లో పద్యం పట్ల ఆసక్తిని రగిల్చిన వారు ‘తెలుపు టివి’ కోసం ఈ శీర్షిక నిర్వహిస్తున్నారు.