Editorial

Thursday, November 21, 2024
కాల‌మ్‌ఈ వారం మంచి పుస్తకం Kahlil Gibran - ‘జీవన గీతం’

ఈ వారం మంచి పుస్తకం Kahlil Gibran – ‘జీవన గీతం’

K Suresh

‘మంచి పుస్తకం’ఒక సంపద.
కొసరాజు సురేష్ అందిస్తున్న ఈ శీర్షికలో  ‘జీవన గీతం’ ఏడవది.

2001-02లో వ్యక్తిగతంగా నేను కొంత గందరగోళంలో ఉన్న కాలం. ఖలీల్ గిబ్రాన్ (జిబ్రాన్ అని కూడా అంటారు) ‘ద ప్రాఫెట్’ అంతకు  ముందే చదివినప్పటికీ ఆ కాలంలో అది మనస్సుకు ఎంతో హత్తుకుంది. ఈసారి దానిని అనువాదం చెయ్యాలనిపించింది. ఆపాటికే ఆ పుస్తకం పూర్తి అనువాదాలు రెండు ఉన్నాయి. మొదటిది కాళోజి అనువాదమైన ‘జీవన గీత’. ఒకింత గ్రాంథికంతో, స్వేచ్ఛగా, కవిత్వం మాదిరి కాళోజి దీనిని అనువదించారు. 1968లో యువ భారతి ప్రచురించిన ఈ అనువాదం చాలా కాలం నుంచే అందుబాటులో లేదు. రెండవది శైలజ అనువాదం, పుస్తకంతోపాటు ఆమె తన స్వరంతో ఆడియో బుక్ కూడా వెలువరించారు.

‘ద ప్రాఫెట్’ అనువాదం నాకు చాలా కష్టం అనిపించింది. ఇంగ్లీషు మూలం, తెలుగు అనువాదాలలో ఏది చదవాలని ఎవరైనా అడిగితే, ఏమాత్రం ఇంగ్లీషు వచ్చినా మూలం చదివితేనే బాగుంటుందని నిస్సందేహంగా చెబుతాను.

అనువాదం పూర్తి అయిన తరవాత ఒక రోజు ‘వీక్షణం’ వేణు ఇంటికి వెళ్లి నాకు ఉన్న అనుమానాలను చర్చించాను. వేణు చక్కని సూచనలు చేశాడు. ఈ పుస్తక అనువాదం ఈ మాత్రం బాగా రావటానికి సహాయం చేసిన వేణుకి ధన్యవాదాలు.

కాళోజీ తన అనువాదానికి ‘జీవన గీత’ అని పేరు పెడితే, నా అనువాదానికి ‘జీవన గీతం’ అని పెట్టాం.

ఖలీల్ గిబ్రాన్‌ అతని రచనలలో ‘ద ప్రాఫెట్’ గొప్పదిగా భావించాడు. ‘లెబనాన్ కొండలలో ఉన్నప్పుడు ఈ పుస్తకం రూపుదిద్దుకున్న తొలిసారి నుంచి అది నా వద్ద ఎప్పుడూ ఉండేది. అది నాలో ఒక భాగం అయిపోయినట్టు ఉండేది – దీనిని ప్రచురణకర్తకు ఇచ్చే ముందు నాలుగు సంవత్సరాలు నాతోపాటు ఉంచుకున్నాను. ప్రతి ఒక్క మాట నేను రాయగలిగిన దాంట్లో అత్యుత్తమమైనదిగా నిర్ధారించుకున్న తరవాతే దానిని ప్రచురణకు ఇచ్చాను,’ అని గిబ్రాన్ పేర్కొన్నాడు.

ఖలీల్ గిబ్రాన్‌ అతని రచనలలో ‘ద ప్రాఫెట్’ గొప్పదిగా భావించాడు. ‘ప్రతి ఒక్క మాట నేను రాయగలిగిన దాంట్లో అత్యుత్తమమైనదిగా నిర్ధారించుకున్న తరవాతే దానిని ప్రచురణకు ఇచ్చాను,’ అని గిబ్రాన్ పేర్కొన్నాడు.

నవ్య ప్రింటింగ్ ప్రెస్‌లో తెలుగు అనువాదాన్ని అచ్చుకు సిద్ధం చేస్తున్నప్పుడు పదే, పదే మార్పులు చేస్తుండటం చూసి లే-అవుట్ ఆర్టిస్టు (పేరు గుర్తు లేదు) నవ్వారు. ఇప్పటికీ నా అనువాదంలో ఇక్కడ కామా ఉంటే బాగుంటుందేమో, ఇక్కడ వేరే పదం వాడాలేమో అన్న అనుమానాలు ఉంటూనే ఉన్నాయి.

హైదరాబాదు బుక్ ట్రస్ట్ తరఫున ‘ద ప్రాఫెట్’కి నా అనువాదాన్ని ప్రచురిస్తారా అని గీత రామస్వామిని అడిగాను. ఆమె ‘Your children are not your children…’ అన్న భాగానికి కాళోజీ అనువాదాన్నీ, నా అనువాదాన్నీ చదివించుకుని వెంటనే అంగీకరించారు. కాళోజీ తన అనువాదానికి ‘జీవన గీత’ అని పేరు పెడితే, నా అనువాదానికి ‘జీవన గీతం’ అని పెట్టాం. కాళోజీతో జీవన గీత గురించి గీత రామస్వామి మాట్లాడినది ఆమె రికార్డు చేశారు. దానిని ట్రాన్‌స్క్రైబ్ చేసి, కొంత ఎడిట్ చేసి ఈ పుస్తకానికి ‘ముందు మాట’గా ప్రచురించారు. ఇంగ్లీషు మూలం, ఆయన అనువాదంలోని ప్రతీ వాక్యం కాళోజీకు గుర్తు ఉన్నాయి. దీనిని అనువదించటానికి ముందు అప్పటికే ఉన్న ఉర్దూ, అరబ్బీ, మరాఠీ అనువాదాలను కాళోజీ చదివారు. ‘మూలంలోని భావం మారకుండా వ్యాఖ్యానం మాదిరి అనువదించిన. ఇంగ్లీషులో ఉన్నంత క్లుప్తత తేవటానికి నా వశం కాలే,’ అని కాళోజీ చెప్పుకున్నారు.

‘ద ప్రాఫెట్’ 1923లో ఇంగ్లీషులో ప్రచురితం అయ్యింది. ఇంగ్లీషులో బాగా ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకాలలో ఇది ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా వారంలో 5,000 ప్రతులు అమ్ముడయిన సమయం ఉండింది. బైబిల్‌ని ‘బ్లాక్ బుక్’ అని అంటారు. అంతే ప్రభావం కలిగిన పుస్తకంగా దీనిని ‘ద లిటిల్ బ్లాక్ బుక్’ అంటారు. ఆ దృష్టితో ఈ పుస్తకాన్ని నలుపులో డిజైన్ చేయించారు గీతా రామస్వామి.

ఖలీల్ గిబ్రాన్ చిత్రకారుడు కూడా. ఆయన సొంతంగా వేసిన నలుపు-తెలుపు బొమ్మలు ఇంగ్లీషు మూలంలో ఉన్నాయి. అయితే, ఆ బొమ్మలను ‘జీవన గీతం’లో పొందు పరచ లేదు.

ఖలీల్ గిబ్రాన్ చిత్రకారుడు కూడా. ఆయన సొంతంగా వేసిన నలుపు-తెలుపు బొమ్మలు ఇంగ్లీషు మూలంలో ఉన్నాయి. అయితే, ఆ బొమ్మలను ‘జీవన గీతం’లో పొందు పరచ లేదు.

‘ద ప్రాఫెట్’ వందకు పైగా భాషలలోకి అనువాదం అయ్యింది. టాగోర్ గీతాంజలి తరవాత తెలుగులో ఎక్కువ అనువాదాలు జరిగిన పుస్తకం ‘ద ప్రాఫెట్’ అని అనుకుంటున్నాను. ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులో చదివి, ఎంతో ప్రభావితం అయ్యి గిబ్రాన్ అన్ని రచనలను ఎస్. వి. ఎల్. నరసింహారావు గారు అనువదింప చేసి, ప్రచురించారు. ఈ క్రమంలో ‘ద ప్రాఫెట్’ని డా. జతిన్ అనువాదం చేశారు. ఆ తరవాత బెందాళం కృష్ణారావు కూడా తన అనువాదాన్ని ప్రచురించారు.

‘జీవన గీతం’ 2002 మార్చిలో తొలి ముద్రణ వెలువడింది. 2011లో మంచి పుస్తకం ద్వారా రెండవ ముద్రణ తీసుకుని వచ్చాం. ఇప్పుడు ఇది అచ్చులో లేదు. రెండు వేల ప్రతులు అమ్మటానికి దాదాపు పది సంవత్సరాలు పట్టింది!

‘జీవన గీతం’ 2002 మార్చిలో తొలి ముద్రణ వెలువడింది. 2011లో మంచి పుస్తకం ద్వారా రెండవ ముద్రణ తీసుకుని వచ్చాం. ఇప్పుడు ఇది అచ్చులో లేదు. రెండు వేల ప్రతులు అమ్మటానికి దాదాపు పది సంవత్సరాలు పట్టింది! ఇందుకు ఒక కారణం దీని వెల 30 రూపాయలు పెట్టటం అని ఒక విశ్లేషకుని అభిప్రాయం. అదే వంద రూపాయలు వెల పెట్టి 50 శాతం డిస్కౌంటు ఇచ్చి ఉంటే బాగా అమ్ముడు పోయేదట!

ఆర్ఫలీస్ నగరంలో అల్ ముస్తాఫా పన్నెండేళ్ల పాటు ఉండి తన దీవికి తిరిగి వెళుతూ అక్కడి ప్రజలు, ‘వెళ్లే ముందు నీ సత్యాన్ని మాకు ఇవ్వు,’ అని అడిగిన మీదట ప్రేమతో మొదలుపెట్టి మరణం వరకు వివాహం, పిల్లలు, ఇవ్వటం, తినటం – తాగటం, పని, సంతోషం – దుఃఖం, ఇళ్లు – ఇలా మొత్తం 26 అంశాల గురించి చెబుతాడు. ఓడ రాకతో ప్రజలతో మొదలైన సంభాషణ వీడ్కోలుతో ముగుస్తుంది.

అల్ ముస్తాఫా చెప్పిన ప్రతి ఒక్కటి ప్రస్తావించ దగినది. అన్ని ఆణిముత్యాల లాగా ఉంటాయి. ప్రతి వాక్యం ఎంతో ఆలోచింప చేస్తుంది. వాటిల్లో ఎక్కువ ఆదరణ పొందింది పిల్లల గురించి మాట్లాడుతూ ‘మీ పిల్లలు మీ పిల్లలు కారు’ అన్నది.

అల్ ముస్తాఫా చెప్పిన ప్రతి ఒక్కటి ప్రస్తావించ దగినది. అన్ని ఆణిముత్యాల లాగా ఉంటాయి. ప్రతి వాక్యం ఎంతో ఆలోచింప చేస్తుంది. వాటిల్లో ఎక్కువ ఆదరణ పొందింది పిల్లల గురించి మాట్లాడుతూ ‘మీ పిల్లలు మీ పిల్లలు కారు’ అన్నది. అందులో ‘వారిలాగే మీరు ఉండటానికి ప్రయత్నించవచ్చు, కానీ మీలాగా చెయ్యటానికి పూనుకోవద్దు’ అంటాడు. ఎందుకంటే మనం ‘కలల్లో సైతం చూడలేని రేపటి ఇళ్లల్లో వాళ్ల ఆత్మలు ఉంటాయి’ అంటాడు.

వివాహం గురించి మాట్లాడుతూ ‘వేణువులోని రంధ్రాలు ఒకే నాదంతో వణికినప్పటికీ అవి వేటికవే ఉంటాయి’ అంటూ భార్యా భర్తలు కూడా కలసి ఆడి, పాడి, సంతోషంగా ఉన్నప్పటికీ ఎవరికి వారు తమ వ్యక్తిగత చోటును మిగుల్చుకోవాలని చెబుతాడు.

‘ప్రేమ ఇంకొకరిని లోబరుచుకోదు, ఇంకొకరికి లోబడదు’ అంటూ ప్రేమ గురించి చెప్పి, పని ఆ ప్రేమ కనపడేలా చేస్తుందని చెబుతాడు. ప్రేమతో పని చెయ్య లేకపోతే అడుక్కోవటం మంచిది అంటాడు.

దుంపల కోసం తవ్వుతున్న వ్యక్తికి నిధి దొరికినట్టు ఆనందం కోసం వెదికే వాళ్లకు అంతకంటే విలువైనవి కూడా దొరుకుతాయంట.

ఇళ్లని ‘బతికున్న వాళ్ల కోసం చని పోయిన వాళ్లు తయారు చేసిన సమాధులు’ అంటూ ‘మీ ఇళ్లను నా చేతుల్లోకి తీసుకుని అడవుల్లోనూ, మైదానాల్లోనూ వెద జల్లాలని ఉంది’ అని చెబుతాడు.

నేరము – శిక్ష గురించి మాట్లాడుతూ ‘చెట్టు అంతటికీ ఎరుక లేకుండా ఒక్క ఆకు కూడా పండుబారనట్లే, మీ అందరి రహస్య సమ్మతి లేకుండా ఏ ఒక్కడూ తప్పు చెయ్యలేడు’ అంటాడు. అంతేకాకుండా, ‘దొంగతనానికి దొంగిలింపబడినవాడు నిందితుడు, దుష్టుల చేతలకు మంచివాళ్లు నిందార్హులు’ అంటాడు.

‘శిఖరాన్ని చేరుకున్ తరవాతే పైకి ఎక్కటం మొదలు అవుతుంది,’ అంటాడు గిబ్రాన్. గిబ్రాన్ మరొనైట్ క్రైస్తవంలో పుట్టాడు. అతని మీద బహాయి, ఇస్లాం, సూఫి తత్వాల ప్రభావం ఉంది.

స్వేచ్ఛ గురించి మాట్లాడుతూ ‘నిరంకుశుడిని అధికారం నుంచి తొలగించాలని పూనుకుంటే, ముందుగా అతని కోసం నీ లోపల వేసిన సింహాసనాన్ని నాశనం చెయ్యాలి’ అంటాడు. బోధన గురించి చెపుతూ ‘మీ జ్ఞానపు తొలి సంధ్యలో నిద్రాణంగా లేనిదానిని ఎవరూ మీకు వెల్లడి చెయ్యలేరు’ అంటాడు.

దుంపల కోసం తవ్వుతున్న వ్యక్తికి నిధి దొరికినట్టు ఆనందం కోసం వెదికే వాళ్లకు అంతకంటే విలువైనవి కూడా దొరుకుతాయంట. అలాగే మనసు మారుమూలల్లో కోరికను దాచి ఉంచితే అది బయటపడటానికి ఎదురు చూస్తోందేమో ఎవరికి తెలుసు అంటాడు.

అందాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చూస్తారని చెబుతాడు గిబ్రాన్. అందం చూడగల బొమ్మ, వినగల పాట కాదు అంటూనే కళ్లు మూసుకున్నా కనిపించే బొమ్మ, చెవులు మూసుకున్నా వినిపించే పాట అంటాడు.

మరో రెండు సంవత్సరాలకు ‘ద ప్రాఫెట్’ ఇంగ్లీషు తొలి ప్రచురణకు వందేళ్లు పూర్తవుతాయి. నిజానికి అయితే ఎన్ని వందల సంవత్సరాలైనా ఈ పుస్తకం ఇంతే ఆకట్టుకుంటూ సజీవంగా ఉంటుంది.

చివరిగా మరణం గురించి మాట్లాడుతూ ఊపిరి ఆగిపోవటం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుంచి విముక్తం అయ్యి దేవుని వరకు విస్తరించటం అంటాడు. ‘శిఖరాన్ని చేరుకున్న తరవాతే పైకి ఎక్కటం మొదలు అవుతుంది,’ అంటాడు గిబ్రాన్. గిబ్రాన్ మరొనైట్ క్రైస్తవంలో పుట్టాడు. అతని మీద బహాయి, ఇస్లాం, సూఫి తత్వాల ప్రభావం ఉంది.

మరో రెండు సంవత్సరాలకు ‘ద ప్రాఫెట్’ ఇంగ్లీషు తొలి ప్రచురణకు వందేళ్లు పూర్తవుతాయి. నిజానికి అయితే ఎన్ని వందల సంవత్సరాలైనా ఈ పుస్తకం ఇంతే ఆకట్టుకుంటూ సజీవంగా ఉంటుంది.

చాలా దేశాలలో ఈ పుస్తకం ఇప్పుడు కాపీరైటు పరిధిలో లేదు.

ఇంగ్లీషు మూలాన్ని ప్రాజెక్ట్ గుటెన్‌బర్గ్‌లో చదవాలనుకున్న వాళ్లు ఈ లంకెను చూడండి- https://www.gutenberg.org/files/58585/58585-h/58585-h.htm

కాళోజీ అనువాదం చదవాలనుకున్నవాళ్లు ఆర్కైవ్‌లో ఈ లింకును చూడండి- https://archive.org/details/jeevanageeta

కాలమిస్టు పరిచయం

పాఠకుల అభిరుచికి పెద్దపీట వేయడం కారణంగా కొసరాజు సురేష్ గారు మంచి అనువాద పుస్తకాలు అందించిన ఘనతని మాత్రమే సొంతం చేసుకోలేదు, వారు ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ ట్రస్టీగా వందలాది పుస్తకాల భండాగారాన్ని తెలుగు పాఠకులకు అందించి మనల్ని సంపద్వంతం చేశారు. వారి అనువాదాల్లో గడ్డికపరకతో విప్లవం మొదటిదైతే బాబోయ్:బడి! రెండవది. ‘సందిగ్ధ’ మూడవది. ‘నాకు నేను తెలిసే’ నాలుగవది. సమ్మర్‌హిల్‌ ఐదవది. ఆరవది ‘అనార్కో’. చిన్నవి పెద్దవి కలిపి వారువంద పుస్తకాల దాకా తెలుగు పాఠక ప్రపంచానికి అనువదించి ఇచ్చారు, అందులో అత్యధిక ప్రజాదరణ, పలు ముద్రణలు పొందిన పాలో కోయిలో తాత్వక గ్రంథం ‘పరుసవేది’ని మీరు చదివే ఉంటారు. దాంతో పాటు హృదయాలను మండించే పెరుమాళ్ మురుగన్ ‘చితి’ కూడా వారు అనువదించినదే. ‘మంచి పుస్తకం’ శీర్షిక పేరిటే వారు మిగతా పుస్తకాలను కూడా వారానికి ఒకటి మీకు ఇలాగే పరిచయం చేస్తారు. 

Email: kosaraju.suresh@gmail.com
website: https://manchipustakam.in/

 

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article