Editorial

Sunday, September 22, 2024
Peopleమౌనగాన మాంత్రికుడు : స్వరస్రష్టకు అక్షర నివాళి – ఎస్.వి.సూర్యప్రకాశరావు

మౌనగాన మాంత్రికుడు : స్వరస్రష్టకు అక్షర నివాళి – ఎస్.వి.సూర్యప్రకాశరావు

నిశ్శబ్దాన్ని సూచించే ఒక సన్నివేశానికి ఆయన సంగీత దర్శకత్వం వహించడం వారి ప్రయోగ శీలతకు ఒకానొక మేలిమి ఉదాహరణ. ఇప్పుడాయన లేరు. కానీ ఆ రసగంగా ప్రవాహాన్ని స్మరించుకోవడం, నిశ్శబ్ధంలోనూ వారి గానాన్ని వినడం ఒక దివ్య అనుభవం.

శ్రీ ఎస్.వి. సూర్యప్రకాశరావు

బాల మురళీ కృష్ణ గారికి హంస గీతే ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ అవార్డు లభించింది. సినిమా రంగంలో అయన పాత్ర తక్కువే అయినా ఆయన వల్ల భారత చలన చిత్రరంగానికి తెలుగు వాళ్ళకి లభించిన పేరు ప్రఖ్యాతులు తక్కువేమీ కాదు. అలాగే, అయన జీవి అయ్యర్ రూపొందించిన శ్రీ మధ్వాచార్యకు సంగీత దర్శకత్వం వహించారు. అది ఉత్తమ సంగీత దర్శకుడుగా జాతీయ అవార్డ్ తెచ్చి పెట్టింది. “అందులో నేను చేసిన ప్రయోగం ఏమిటంటే నిశ్శబ్దాన్ని సూచించే ఒక సన్నివేశానికి సంగీతం చేయమన్నారు. చేశాను. దానికే ప్రశంసలు లభించాయి.అది ఎలా చేశాను అని సబ్జెక్ట్ పరంగా ఎవరైనా అడిగితే చెబుదాం అనుకున్నాను. కానీ సినిమా విలేఖరులకు, విమర్శకులకు ఆ ప్రశ్న తలెత్తలేదు. సినీ సంగీతాన్ని విమర్శనాత్మకంగా సమీక్షించే దశకు భారతీయ సినిమా చేరుకోవటానికి చాలా కాలం పడుతుంది” అని బాలమురళి చెప్పిన మాటల్ని ఎలా రాయాలో తెలియలేదు. బాలమురళి గారి సంగీతాన్ని గురించి చర్చించే సాహసం సంగీత దర్శకులు కూడా చేయలేదు.

suryaప్రపంచమంతా ఆరాధించే ఒక మహానుభావుడికి అంత సన్నిహితం కావడం నిజంగా ఒక సుకృతం. ఆ సుకృతాన్ని కలుగజేసిన నా పాత్రికేయ వృత్తికి గర్వ పడుతూ ఉంటాను. జన్మ ధన్యం కావటం అనే అనుభవం బాలమురళి వంటి కారణ జన్ములతో సహచర్యుల వలనే కలుగుతుంది.

ఇక 89లో బెంగళూర్ నుంచి అంద్రప్రభ చెన్నైకి షిఫ్ట్ అయింది. చీఫ్ సబ్ ఎడిటర్ గా ఎడిషన్ ఇంఛార్జిగా బాధ్యతలు నన్ను బయటకు వెళ్ళకుండా చేశాయి.

అయితే, ఇండియా టుడేలో చేరిన తరువాత ఏడాదిన్నర తరువాత మా ఆఫీస్ జెమిని కాంప్లెక్స్ నుంచి రాధాకృష్ణ శాలైలో రాధాకృష్ణ గారి ఇంటి పక్కన కట్టిన ఒక భవన సముదాయంలో రెండవ అంతస్తుకు మారింది. అన్నా ఫ్లైఓవర్ నుంచి బీచ్ వరకు ఉంటుంది రాధాకృష్ణ సాలై. మధ్యలో మ్యూజిక్ అకాడెమీ. దానికంటే ముందు ఒక వీధి చిన్నది అందులో అనేక ఇళ్లు.మొదట వరస ఇల్లు బాలమురళి కృష్ణ గారిది.

ఒకసారి మ్యూజిక్ అకాడెమీలో ఒక ప్రోగ్రాంకి అయన అతిథిగా వస్తున్నారు అని తెలిసింది. అది తెలుగు వాళ్ళు తమిళ కళాకారులు కలిసి ఏర్పాటు చేసిన ప్రోగ్రాం. ఇన్విటేషన్ ఆఫీస్ కి వచ్చింది. అది మా రాజకీయ పత్రికలో కవర్ చేసే అవకాశం లేకపోయినా కాంటాక్ట్స్ కోసం వెలుతుంటాము. అలా వెళ్ళాను. ఇంకా స్టేజ్ మీదకు బాలమురళి గారు వెళ్ళలేదు. ముందు వరసలో మొదటి సీట్ లో కూర్చున్న అయన దగ్గరికి వెళ్లి నమస్కారం చేశాను. ముందు ఎవరో అనుకున్నారు. తరువాత మీరు బెంగళూర్ ఆంధ్రప్రభ కదా అన్నారు. ఇప్పుడు ఇండియా టుడే …ఇక్కడే సర్ అన్నాను. వెరీ గుడ్. ఇక్కడ నేను గెస్ట్ నే. నా కచేరీ కాదు. ఇంటికి రండి ఎప్పుడైనా పక్కనే అని అయన వెంట ఉండే సరస్వతి అనే ఆవిడని పిలిచి ఇతను జర్నలిస్ట్ ఇండియా టుడే. నంబర్ తీసుకో మన ఇంటి నంబర్ ఇవ్వు అన్నారు.తరువాత స్టేజ్ మీదకు వెళ్ళారు. నేను ప్రోగ్రాం మధ్యలో ఇంటికి వచ్చేసాను. ఆయనను వెంటనే కలిసే పని పడలేదు. ఆయనకు ఏదో అవార్డు వస్తె లేదా అయన ఏదైనా మరో కొత్త రాగం కనిపెడితే తప్ప రాసే అవకాశం లేదు.

బాలమురళిని కూడా త్యాగరాజు ను సొంతం చేసుకున్నట్లు అభిమానులు ఓన్ చేసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వేలాది కచేరీలు అయన ఒక మద్రాసీ గానే నిర్వహించారు. కర్ణాటక సంగీతంలో కొత్త ప్రయోగాలు చేశారు. వేలాది మంది శిష్యులను తయారు చేశారు. అలాంటి ఒక ముఖ్య శిష్యుడు శ్రీ ఎన్ ఎస్ ప్రకాశరావు. సినీ నేపథ్యగాయకుడు. కొన్ని చిత్రాలలో పాడారు. ఇండియన్ బ్యాంక్ లో ఆఫీసర్. ఆయన ముఖ్యమైన ప్రవృత్తి బాల మురళికి శుశ్రూష చేస్తూ సంగీతంలో ఉన్నత స్థాయి విద్య నేర్చుకోవటం. కచేరీలు చేయటం. ఆయన మా బావ మరిదికి బావమరిది. ఈ బంధుత్వం కారణంగా అయన ద్వారా బాలమురళి గారిని మరోసారి కలవటం జరిగింది. ఎన్ ఎస్ ప్రకాశరావు కుమార్తె పెళ్లి రిసెప్షన్ కి బాల మురళీ వచ్చారు. మా బంధుత్వం గురించి తెలిసి సంతోషించారు. మా అమ్మాయికి అప్పుడు ఆరు యేళ్లు. సంగీతం నేర్చుకుంటుంది. చూపించి ఆశీర్వ దించమని అడిగాం. ఒక పాట ఏదైనా పాడు అన్నారు. ఒక కీర్తన పాడింది. బాగుంది. బాగా సాధన చెయ్. వాయిస్ బాగుంది అని మెచ్చుకుని ఆశీర్వదించారు. ఆ రోజు నాలుగు గంటలు ఆయనతోనే గడిపే అవకాశం లభించింది.

తరువాత ఇలాంటి సందర్భాలలో చాలాసార్లు కలిశాను. ఈ లోగా ఆయనకు పద్మ విభూషణ్ ప్రకటించారు. అలాగే కేరళ ప్రభుత్వం అవార్డు కూడా ఏదో లభించింది. ఇది న్యూస్ పెగ్ గా తీసుకుని ఇండియా టుడేలో ప్రొఫైల్ రాయాలి అనుకున్నాను. మా వాళ్ళు ముందు ఇంగ్లీష్ లో రాసి పంపమని అడిగారు. వెంటనే ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకున్నాను. సమగ్రంగా అన్ని రాయాలి. ముందుగా అన్ని వివరాలు కావాలి. అప్పుడు గూగుల్ సెర్చ్ ఇంకా రాలేదు. ఎలాగ అని ఆలోచిస్తుంటే ఒక ఐడియా వచ్చింది. బాలమురళి కృష్ణ ట్రస్ట్ కి ఫోన్ చేసి మీ ట్రస్ట్ గురించి ఒక ఆర్టికల్ రాయాలి అనుకుంటున్నాను అని సరస్వతి గారిని అడిగాను. ఆవిడ ఆనందంతో రండి సర్ అని మర్నాడు ఉదయం 11 గంటలకు టైం చెప్పింది. బాలమురళి గారిని కలిసే ముందు అన్ని వివరాలు తెలుసుకుని ఇంటర్వ్యూ ప్రశ్నలు రెడీ చేసుకోవచ్చునని నా ప్లాన్. మర్నాడు ఆఫీస్ కి వెళ్ళాను. లోపలకీ వెళ్ళగానే ఒక్కసారి షాక్ తిన్నాను

ఊహించని సంఘటన ఏమిటంటే లోపల బాలమురళీ కృష్ణ గారు ఉన్నారు. నన్ను చూసి ఆశ్చర్య పోయారు. అయన ముఖ కవళికలు బట్టి నేను అక్కడకు వెళ్ళటం ఇష్టం లేనట్లు అర్థమైంది. తట పటాయిస్తుండగ ప్లీజ్ కం అన్నారు ముభావంగా.

కూర్చోమన్నారు.

కూర్చున్నాను.

What made u to visit me here అన్నారు.

Here అనే మాట ఒత్తి పలికినట్లు ధ్వనించింది.

ఇంతలో సరస్వతి గారు వచ్చి, నేనే రమ్మన్నాను అన్నారు తమిళంలో. నాలో కొంచెం అవమాన భావం మొదలైంది. నువ్వా…ఎందుకు అని తమిళంలో నే అడిగారు. He wants to write about our trust .I can give all details అని ఇంగ్లీషులో అవిడ చెప్పారు. I see అన్నారు. Then go ahead I will go inside అన్నారు గంభీరంగా. వెంటనే అవిడ వేండ వెండ అని లోపలికి వెళ్లి ఒక ఫోల్డర్ తెచ్చి ఇచ్చింది. ఇందులో sir profile and ట్రస్ట్ డీటైల్స్ ఉన్నాయి సర్ అని చెప్పింది.

రావటం వెళ్ళటం అంతా మీ ఇష్టమే ? ఉండండి అని కూర్చో పెట్టారు. సరస్వతిని పిలిచి లోపల సూర్యకాంతి బుక్ ఉంది తెచ్చి ఇయనకు ఇవ్వు అని తమిళంలో చెప్పారు. ఆవిడ తెచ్చి ఆయనకు ఇచ్చింది. అయన ఇది మీకు కాదు, మీ అమ్మాయికి ఇవ్వండి అని తన సంతకంతో ఆశీస్సులు తెలియజేస్తూ రాసి ఇచ్చారు.

అవి తీసుకుని వెళ్ళబోతుండగా బాలమురళీ గారు రావటం వెళ్ళటం అంతా మీ ఇష్టమే ? ఉండండి అని కూర్చో పెట్టారు. సరస్వతిని పిలిచి లోపల సూర్యకాంతి బుక్ ఉంది తెచ్చి ఇయనకు ఇవ్వు అని తమిళంలో చెప్పారు. ఆవిడ తెచ్చి ఆయనకు ఇచ్చింది. అయన ఇది మీకు కాదు, మీ అమ్మాయికి ఇవ్వండి అని తన సంతకంతో ఆశీస్సులు తెలియజేస్తూ రాసి ఇచ్చారు. అది అయన రాసిన కీర్తనలు. తెలుగు తమిళం కన్నడ లిపిలో ఉన్నాయి. స్వరాలు సాహిత్యం అనువాదాలు ఉన్నాయి. ఆయన స్వీయ రచనలు ఆయన స్వయంగా ఇవ్వటం అదృష్టం అనుకున్నాను. మరిక వెళ్లి వస్తాను అన్నాను. సరే రాత్రి 7.30 కి ఇంటికి వచ్చయ్యండి మీ ఇంటర్వ్యూ పూర్తి చేద్దాం అన్నారు.

ఆరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి 6.30 కే వెళ్ళాను అయన ఎవరితోనో సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు. నన్ను చూసి ముందు గదిలో కూర్చోండి. మన టైం 7 కదా అన్నారు. సారీ ముందుగా.. అని నేను సంజాయిషీ చెప్పెలోగా భుజం మీద చెయ్యి వేసి నో.. సారీ ఎందుకు..ఏమీ ఫరవాలేదు. అక్కడ నా పుస్తకాలు, నాగురించి రాసిన మాగజైన్ లు ఉన్నాయి. చూస్తు ఉండండి అన్నారు
నేను అవి చూసాను వాటిలో ఆయనపై వివాదాలు, సంగీత రీతులపై విమర్శనాత్మక వ్యాసాలు ఉన్నాయి. వాటినీ ప్రస్తావించటం ఒక సాహసమే అనిపించింది. ఇవన్నీ కలిపి ఒక ప్రశ్న వేస్తే పోతుంది కదా అనుకున్నాను. అవి నోట్ చేసుకున్నాను.

ఇంతలో ఆయన రండి అన్నారు వెళ్ళాను.

ఆయన చేసిన ప్రయోగాలు, ఆశయాలు, ఆయన జుగుల్బంది చేసిన విద్వాంసులు గురించి వారితో ఏర్పడిన అభిప్రాయ విభేదాలు గురించి అడిగాను. చెప్పారు. వివాదాల గురించి అడిగాను. అవి రేపిన వారిని రమ్మనండి చెప్తాను. లేదా వాళ్ళని అడగండి..అన్నారు

చివరగా తెలుగు సినీ సంగీతం లో అవకాశాలు గురించి అడిగాను.

ఘంటసాల గురించి ఆయన సంగీతం గురించి మీరు ఎలా అనుకుంటారు అని అడిగాను.

నేను శాస్త్రీయ సంగీతంలో స్థిర పడ్డాను. నన్ను కావాలి అనుకున్నవారు తమ మాధ్యమం ద్వారా ప్రజలకు చెప్పాలనుకున్న బాపు, కమలాకర కామేశ్వరరావు గారు వంటి వారు అవకాశాలు ఇచ్చారు. రాజేశ్వరరావు గారు కూడా భక్తప్రహ్లాదలో పాడించారు. అందులో నారదుడు వేషం కూడా నాదే అన్నారు.

ఇక ఘంటసాల గారు నేను శాస్త్రీయ సంగీతాన్ని నమ్ముకున్నట్లే అయన శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా సినీ సంగీతాన్ని నమ్ముకుని దానికొక బాట వేశారు. మధుర గాయకులు. వయసులో నాకంటే పెద్ద వారు. నేనంటే గౌరవం అభిమానం ఉండేవి. సంగీతం జనం ఆదరించారు. దీనికంటే చెప్పటానికి వేరే అభిప్రాయం ఉంటుందా అని అన్నారు. అయితే సాధన చేస్తే శాస్త్రీయ సంగీతంలో రానించ వచ్చు. కానీ సినిమాల్లో పాడటానికి జ్ఞానం సాధన మాత్రమే సరిపోవు. ఇలాంటి మరికొన్ని సమాధానాలతో ఇంటర్వ్యూ ముగించి బయట పడ్డాను. సరస్వతి మర్నాడు ఫోన్ చేసి ఏ ఇష్యూ లో వస్తుంది చెప్పండి అని కోరింది. అలాగే వచ్చే ఇష్యూ లోనే అని డేట్ కూడా ధైర్యంగా ఇచ్చేశాను.

ఏవో అడ్స్ ఎక్కువై ఆ పేజీ తోపాటు సినిమా పేజీ కూడా డ్రాప్ అయింది. కారణం తెలియలేదు. బాల మురళీ గారికి నా మొఖం ఎలా చూపించాలి. ఎంత కష్టపడి రాశాను. సంగీత సాగర మధనంలో ప్రభవించిన స్వర చంద్రుడు అని ఇంట్రో రాశాను. మనసు బాధ పడింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.

మర్నాడు ఇంగ్లీష్ వెర్షన్ ఢిల్లీ పంపించాను. Clearance రాలేదు. అది చూసి ఆ కాఫీ తమిళ్ మలయాళంలో కూడా క్యారీ చేయమని ఆ ఎడిటర్ లకు చెప్పారట. వాళ్ళు నన్ను డిటైల్స్ అడగటం మొదలు పెట్టారు. నేను సరస్వతి నంబర్ ఇచ్చేశాను. తెలుగులో మనం క్యారీ చేసేయొచ్చు అని చెప్పారు. నేను రాసి పెట్టుకున్నాను. కంపోజింగ్ అయిపోయింది. పేజీ కూడా రెడీ అయింది. కానీ లాస్ట్ మినట్ లో ఏవో అడ్స్ ఎక్కువై ఆ పేజీ తోపాటు సినిమా పేజీ కూడా డ్రాప్ అయింది. ఇది మామూలే…next issueలో వస్తుంది అని సరస్వతికి చెప్పాను. కానీ అందులో కూడా పేజీ వెళ్ళలేదు. కారణం తెలియలేదు. బాల మురళీ గారికి నా మొఖం ఎలా చూపించాలి. ఎంత కష్టపడి రాశాను. సంగీత సాగర మధనంలో ప్రభవించిన స్వర చంద్రుడు అని ఇంట్రో రాశాను.

మనసు బాధ పడింది. కళ్ళలో నీళ్ళు తిరిగాయి. ఇది నా సహచరులు కొందరికి సంతోషం కలిగించింది. సమాజ హితం కోసం పనిచేస్తాం… సాహిత్యం కవిత్వం మాకే సొంతం అని చాటుకునే పాత్రికేయులు 90 శాతం రాగద్వేషాలకు ప్రొఫెషనల్ prejudicesకు అతీతులు కారు.

ఇది జరిగిన కొన్నాళ్ళకి మళ్ళీ బాల మురళీ మీద రాయాలని ఒక సూచన వచ్చింది. నేను ఈ సారి రాయను అని తీర్మానించుకున్నాను. ఆయన గురించి మనం రాసే కంటే అయన వద్ద శిష్యరికం చేసిన వీణా గాయత్రి చేత రాయిస్తే బాగుంటుంది అనిపించింది. ఆవిడ నాకు బాగా తెలుసు. ఒకనాటి మేటి సంగీత దర్శకుడు అశ్వద్ధామ కుమార్తె. ఎనిమిదవ ఏటనుంచి వీణ నేర్చుకుంది. చిట్టిబాబు తరువాత అంత పేరు సంపాదించింది. ఆవిడ గురించి అప్పటికే ఒక ప్రొఫైల్ రాశాను. ఫోన్ చేసి చెప్పాను. ఆవిడ మీరు కూడా రండి ఇద్దరం వెళదాము అన్నారు. నాకు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లయింది. నేను సమాధానం చెప్పెలోగ రేపు సాయంత్రం 7 గంటలకి వాళ్ళింటి దగ్గర వెయిట్ చేస్తాను. మీరు వస్తెనే ఇద్దరం కలిసి లోపలకు వెళదాము అని కమిట్ చేయించేశారు.

అంతకుముందు నేను ఇంటర్వ్యూ కోసం ఇచ్చిన బిల్డప్ అంతా ఇంతా కాదు. సరస్వతి నాకు చేసిన మర్యాద, బాల మురళి గారు నన్నొక ప్రతిష్టాత్మక జర్నలిస్ట్ గా పరిచయం చేసిన తీరు మరిచిపోలేను. ఎలాగైతేనేం గుండె చిక్కపట్టుకుని అనుకున్న టైమ్ కి ఆయన ఇంటికి భయపడుతూనే చేరుకున్నాను. కింద కారులో కూర్చున్న గాయత్రి నన్ను చూడగానే ఆప్యాయంగా నవ్వుతూ బాగున్నారా అంటూ కుశల ప్రశ్నలు వేశారు. ఆవిడ పరిచయం అయిన దగ్గర్నుంచి ప్రతి కార్యక్రమానికి కచేరికి నాకు స్వయంగా ఇన్విటేషన్ లు పంపించేవారు. ఆవిడ వీణ కేసెట్టలు, ముఖ్యంగా ఘంటసాల సుశీల పాటలను వీణ మీద వాయిస్తూ చేసిన కేసెట్లు చాలా పంపించారు.


ఇద్దరం లోపలకు వెళ్ళాం. లోపల పెద్దాయన నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారో అని భయం.
వెళ్ళగానే ఆయన నన్ను చూసి ఎంటి మీరు వచ్చారా రండి అని నవ్వుతూ ఆహ్వానించారు.
ఏమిటి గాయత్రి ఇన్నాళ్లకు అని ఆమెను పలకరిస్తూ జస్ట్ వెయిట్ అని మరో గదిలోకి వెళ్ళారు. నేను అడిగాను ఏమిటి గాయత్రి గారు ఆయనకు అసలు విషయం చెప్పలేదా. ఆవిడ చిద్విలాసంగా నవ్వుతూ లేదు మీరు చెప్పండి అన్నారు. సరిపోయింది. ఇంతకుముందు వచ్చి చేసిన నిర్వాకం చాలక మళ్ళీ ఇదొకటా అని నా ఇంటర్వ్యూ కథ ఏకరువు పెట్టీ అవిడ ముందు నా పరువు తీస్తాడేమో అని కొత్త భయం పట్టుకుంది

ఇంతలో ఆయన లోపలనుంచి వచ్చారు. రాగానే గాయత్రి అంకుల్ మీ గురించి లాస్ట్ మంత్ తమిళ్ ఇండియా టుడేలో చాలా బాగా వచ్చింది. ట్రస్ట్ గురించి బాగా రాశారు అని గాయత్రి ఆయనతో సంభాషణకు తెర తీసింది. తెలుసు…మలయాళంలో కూడా వేశారు కదా అని నావైపు నవ్వుతూ చూసారు.

కొంచెం సేపు ఆ కబురు ఈ కబురూ చెప్పి, సర్…మీమీద డాక్యుమెంటరీ తియ్యాలని ఉంది అన్నాను. ఆయన ఒక క్షణం నావైపు చూసి ఆలోచించి ఓకె good proposal go ahead అన్నారు.

నేను నీరసంగా నవ్వాను. థాంక్స్ మంచి ఆర్టికల్ అన్నారు. నేను కృత్ఞతా పూర్వకంగా నమస్కారం పెట్టాను. ఇప్పుడు నేను మీ గరించి ఇండియా టుడేలో రాస్తాను అని గాయత్రి అన్నారు. ఏమిటి నువ్వు వీళ్లలో చేరి పోయావా అని నవ్వుతూ జోక్ చేశారు. ఆవిడ నేను రాస్తాను. It’s my privilege అన్నారు. సరే. నా గురించి నీకు తెలియంది ఏముంది. రాయి. ఫోన్ చెయ్ మాట్లాడుకుందాం అన్నారు. నా వైపు తిరిగి ఎలా వున్నారు. అమ్మాయి బాగుందా? బాగా ప్రాక్టీస్ చేస్తుందా? అని అడిగారు. కొంతసేపటికి ఇద్దరం బయలుదేరాం. తరువాత మర్నాడు వీణా గాయత్రి ఇంటికి వెళ్ళి ఫస్ట్ పర్సన్ లో అవిడ చెప్పినది నోట్ చేసుకుని అలాగే దింపేసాను. పేరు మాత్రం అవిడదే పెట్టాం. ఇది చూసి అయన కూడా చాలా సంతోషించారు అని అయన శిష్యుడు గిరిధర్ చెప్పాడు. ఆఫీస్ కి వచ్చి రెండు కాపీలు తీసుకున్నాడు. ఆయనకి ఒక ఐడియా వచ్చింది. సర్ బాల మురళీ గారి మీద ఒక డాక్యుమెంటరీ తియ్యాలి. అయన ఎవరిని అనుమతించలేదు. నాకు అడగటానికి ధైర్యం చాలటం లేదు. మీరు వస్తారా అడుగుదాం అన్నాడు. సరే అని ఆయనతోనే వాళ్ళింటికి వెళ్లి కొంచెం సేపు ఆ కబురు ఈ కబురూ చెప్పి, సర్…మీమీద డాక్యుమెంటరీ తియ్యాలని ఉంది అన్నాను. ఆయన ఒక క్షణం నావైపు చూసి ఆలోచించి ఓకె good proposal go ahead అన్నారు. అయితే this is subjected to the involvement of సరస్వతి అన్నారు. సరే అన్నాను తరువాత నేను గిరిధర్ సరస్వతి గారింటికి వెళ్లి దీని గురించి మాట్లాడాలి అనుకున్నాము.

వారం వరకు ఇద్దరికీ కుదరలేదు కానీ ఒక రోజు పొద్దున్నే ఎదురుచూడని పిడుగు లాంటి వార్త గిరిధర్ ఫోన్ చేసి చెప్పాడు.

సరస్వతి మేడం is no more sir అని గిరిధర్ చెప్పాడు.

బాలమురళి జి is in depression అన్నాడు.

సరస్వతి వారి ట్రస్ట్ ని బాగా అభివృద్ధి చేసింది అన్నాడు గిరిధర్ తమిళ్ లో. నేను ఆమె మోస్ట్ ట్రస్టెడ్ పర్సన్ అని ఒక పంచ్ వేసాను. నవ్వాడు. I will call యూ లేటర్ సర్ అని పెట్టాడు. తర్వాత ఆయన వైఫ్ రెండు మూడుసార్లు ఏవో ఇన్విటేషన్ స్ పంపింది. అవిడో డ్యాన్సర్. బాలమురళి గారి తిల్లనాలు కొన్ని కంపోజిషన్స్ కొరియోగ్రఫీ చేసింది. ఒక ప్రోగ్రాంకి వెళ్ళాను బాల మురళీ గారే గెస్ట్. తరువాత కలవలేదు.

ఆయనను డిస్టర్బ్ చేయటం మంచిది కాదు అనుకున్నాను. అయితే ఒక రోజు పి సుశీల గారింటికి వెళ్ళాను. ఆవిడతో స్వర యానం సుదీర్ఘమైనది. వెళ్ళగానే అవిడ మనం బాల మురళీ గారి దగ్గరకు వెళ్ళాలి అండి అన్నారు. అందుకే ఫోన్ చేశాను. మీకు టైం ఉంటుందా అని ఉత్తరాంధ్ర యాసలో దీర్ఘం తీస్తూ అడిగారు. ఆవిడ పాట వేరు. మాట చాలా భిన్నంగా హోమ్లీగా మా అమ్మగారో మేనత్తలో మాట్లాడినట్లు ఉంటుంది. సరే అన్నాను. ఉండండి కారు బయటకు వెళ్ళింది. ఈ లోగా కాఫీ తాగండి అన్నారు. కారు ఒక గంటకు వచ్చింది. ఇద్దరం బయలుదేరాం. బాలమురళితో నన్ను ఈయన అంటూ పరిచయం చేయబోయారు. తెలుసు తెలుసు… రండి అన్నరాయన.

సుశీల కూర్చోండి సర్ అని నాకు సోఫా చూపించింది. వాళ్లిద్దరి మధ్య నేనెందుకు అనుకున్నాను. ఇద్దరు సంగీత శిఖరాలు.

తెలుసా? అవును లెండి పత్రికల వాళ్ళు మీకు తెలియని వారు ఎవరు ఉంటారు అని నవ్వుతూ సుశీల కూర్చోండి సర్ అని నాకు సోఫా చూపించింది. వాళ్లిద్దరి మధ్య నేనెందుకు అనుకున్నాను. ఇద్దరు సంగీత శిఖరాలు. ఆవిడ వెంటనే బాలమురళి గారూ..నేను ఒక ఆల్బమ్ కు సంగీతం చేస్తున్నాను. మీరు పాడాలి అని ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా వెళ్లిన సంగతి బయట పెట్టారు. అది సింహాచలం నరసింహస్వామి పై కృష్ణమయ్య అనే వాగ్గేయకరుడు రాసిన కీర్తనలు. బాల మురళి ఆమె మాట విన్నారు. ఓకె చెప్పారు. నువ్వు ఆ పాట పంపించు. విని ప్రయత్నం చేస్తాను అని నవ్వుతూ అన్నారు. మీరు పరిహాసం చేయక్కర్లేదు. మీలాంటి మహానుభావులు ప్రయత్నం చేయకుండానే అన్ని జరిగిపోతాయి. నా స్వర కల్పనలో లోపాలుంటే దయచేసి చెప్పండి అన్నారు సుశీల. నువ్వు ఎన్ని పాటలు పాడావు… ఎంతమంది స్వర కర్తల దగ్గర ఎన్ని వందల రిహార్సల్ చేసావు. లోపాలు అనేవి ఉండవు అని అన్నారు. తరువాత రెండురోజులకు రికార్డింగ్. సుశీల గారు నన్ను దగ్గర ఉండి బాల మురళి గారిని తీసుకు రమ్మన్నారు. వెళ్ళాను. ఇద్దరం కారులో రికార్డింగ్ కి వచ్చాము. ఆయన అప్పటికే లిరిక్ రాసుకుని చేతిలో పట్టుకున్నారు. రెండే టేక్ లలో పాడేశారు. శ్లోకం అద్భుతంగా పాడారు. బయటకు వచ్చి ఎలా ఉంది అడిగారు. నేను నమస్కారం పెట్టాను.

తరువాత మా అమ్మాయి పెళ్లికి ఆహ్వానించటానికి వెళ్ళాను. చాలా సంతోషం కానీ నాకు వేరే ఊర్లో కచేరీ ఉంది. మా ఫ్యామిలీ నుంచి ఎవరో వస్తారు అన్నారు. అలాగే వాళ్ల అబ్బాయి ఇంకెవరో వచ్చారు.

నాకు ఆఖరి సారిగా చూసిన అయన ముఖాన్ని తలుచుకున్నప్పుడు మౌనమే నీ భాష ఓ మూగ మనసా అనే జీవిత వేదాంతాన్ని తెలిపిన ఆయన పాడిన గుప్పెడు మనసుపై ఆత్రేయ రాసిన గీతం గుర్తుకు వస్తుంది.

తరువాత కలవలేదు. అనారోగ్యంగా ఉన్నట్లు తెలిసింది. చనిపోయిన రోజు వెంటనే వెళ్ళాను. కుటుంబ సభ్యులు తెలుసు కాబట్టి నన్ను మాత్రం అక్కడ పార్థివ దేహం దగ్గరకు అనుమతించారు. ఆయనకు ప్రదిక్షణం చేసి నమస్కరిస్తూ మనసులోనే నివాళులు అర్పించాను. ప్రపంచమంతా ఆరాధించే ఒక మహానుభావుడికి ఎందులోనూ సరితూగని నా లాంటి అల్ప పాణి అంత సన్నిహితం కావడం నిజంగా ఒక సుకృతం. ఆ సుకృతాన్ని కలుగజేసిన నా పాత్రికేయ వృత్తికి గర్వ పడుతూ ఉంటాను. జన్మ ధన్యం కావటం అనే అనుభవం బాలమురళి వంటి కారణ జన్ములతో సహచర్యుల వలనే కలుగుతుంది.

చివరగా మరొక్క మాట చెప్పి ఈ స్వర యానాన్ని ముగిస్తాను.

నాకు ఆఖరి సారిగా చూసిన అయన ముఖాన్ని తలుచుకున్నప్పుడు మౌనమే నీ భాష ఓ మూగ మనసా అనే జీవిత వేదాంతాన్ని తెలిపిన ఆయన పాడిన గుప్పెడు మనసుపై ఆత్రేయ రాసిన గీతం గుర్తుకు వస్తుంది.

నిన్న మంగళంపల్లి బాలమురళీ కృష్ణ గారి జయంతిని పురస్కరించుకుని ఇండియా టుడే పూర్వ సహాయ సంపాదకులు శ్రీ ఎస్.వి. సూర్యప్రకాశరావు రాసిన నివాళి వ్యాసం తొలి భాగం కోసం ఇది క్లిక్ చేయండి : భారతీయ సంగీతంలో బాహుబలి బాలమురళీ. ఇప్పుడు మీరు చదివింది చివరి భాగం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article