Editorial

Friday, November 22, 2024
కాల‌మ్‌వెలుతురు కిటికీ – తెలుపు కొత్త శీర్షిక

వెలుతురు కిటికీ – తెలుపు కొత్త శీర్షిక

‘తెలుపు’ విశ్వభాష. ‘మాటే మంత్రం’ ఎందుకో తొలివారం తెలుపు.

‘మాట’ అన్నది మనుషుల మధ్య కమ్యూనికేషన్ కి అత్యంత అవసరం అయినది. అందుకే చాలామంది ‘మాటే మంత్రం’ అంటారు. మాటకు ఉన్న శక్తి చాలా ఎక్కువ. అందుకే మాటల ‘తూటాలు’ అంటారు. మనుషుల మధ్య అనుబంధాలకి అది ఒక శక్తివంతమైన ఆయుధం. మాట లేకుండా కమ్యూనికేషన్ ని ఊహించలేం.

తెలుపు ప్రారంభిస్తున్న కొత్త శీర్శిక ‘వెలుతురు కిటికీ’. ప్రతి ఆదివారం రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు శ్రీ సిఎస్ సలీమ్ బాషా మనకోసం అలవోకగా ఈ కిటికీ తెరిచి కొత్త గాలి ఆడేలా చేస్తారు. మంచి వెలుతురు పడేలా చూస్తారు. మానవ సంభంధాలు మరింత అర్థవంతం కావడానికి, జీవితం ఇంకొంత సరళంగా, హాయిగా సాగిపోవడానికి వారు భరువైన అంశాలకు చోటివ్వకుండా తేలిక పాటి సంభాషణే చేస్తారు. వారు సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు. సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్. ఉద్యోగ నైపుణ్యాల భోదకులు కూడా.

ఈ మధ్యకాలంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నది తరచూ వినబడుతోంది. తెలుగులో చెప్పాలంటే వ్యక్తీకరణ నైపుణ్యాలే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే. ఈ వ్యక్తీకరణ కోసం మాట అన్నది అత్యంత ప్రధానమైనది. దీన్ని verbal కమ్యూనికేషన్ అంటారు.(నిఘంటువు ప్రకారం verbal అంటే ‘మౌఖిక, శాబ్దిక, నోటిమాటైన’ అని అర్థం ఉంది.) కొన్నిసార్లు మనుషుల మధ్య Non-Verbal కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. అంటే సైగలు, సంకేతాలు, బాడీ లాంగ్వేజ్ వంటివాటి సమాహారమే నాన్ వెర్బల్ కమ్యూనికేషన్.

ఎక్కువగా మాట్లాడడమే ప్రధాన వ్యక్తీకరణ పద్ధతి. నిజానికి ఇంట్లో, ఉద్యోగంలో, సమాజంలో ఈ నైపుణ్యాలు ఉన్నవారు బాగా రాణించే అవకాశం ఉంది.

మన శరీరానికి కూడా ఒక భాష ఉంటుంది. ఇది ఒక్కోసారి మాట కన్నా శక్తివంతమైనది. అయితే ఇది తక్కువ సార్లు ఉపయోగిస్తారు. లేదా మాటలతో కలిపి వాడతారు. ఎక్కువగా మాట్లాడడమే ప్రధాన వ్యక్తీకరణ పద్ధతి. నిజానికి ఇంట్లో, ఉద్యోగంలో, సమాజంలో ఈ నైపుణ్యాలు ఉన్నవారు బాగా రాణించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ కొంతమేరకు ఈ నైపుణ్యాలు కలిగి ఉండడం ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. చక్కటి మాటతీరు అన్నది ఈ మధ్యకాలంలో తక్కువగా కనబడుతోంది

మాట్లాడ వలసిన చోట మాట్లాడక పోవడం ఎంత తప్పో, మాట్లాడుకూడని చోట మాట్లాడడం కూడా అంతే తప్పు. అందుకే అంటారు ‘ఆచితూచి మాట్లాడాలి’ అని.

భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు ( కమ్యూనికేషన్ స్కిల్స్) చాలా మటుకు ‘మాట’ మీద ఆధారపడతాయి. అంటే వెర్బల్ కమ్యూనికేషన్. సాధారణంగా వినే మాటలు కొన్ని చూస్తే, మాటకు ఉన్న ప్రాధాన్యత అర్థం అవుతుంది.

ఎంత ‘మాట’ అన్నావు. అంటే ఆ మాట సరైంది కాదనో, తప్పనో అర్థం వస్తుంది.

ఎప్పుడూ నేను ఎవరితో ఒక్క ‘మాట’ కూడా పడలేదు తెలుసా?

ఓ ‘మాట’ అనుకుందాం. అని వ్యాపారంలో నో, పెళ్లి సంబంధాలు లోనూ అనుకుంటే ఒక ఒప్పందం అని అర్థం.

ఈ ‘మాట’ నువ్వు చెప్పకూడదు. వేరే వాళ్ళు ఎవరైనా చెప్పవచ్చు. ఇది ఫ్రెండ్స్ మధ్యలో, ప్రేమికుల మధ్య లో, వయసు అంతరం ఉన్న వాళ్ళ మధ్యలో వాడతారు.

ఎంత ‘మాట’ అన్నాడో తెలుసా? అంటే అనకూడని మాట అన్నాడని.

నువ్వు నాకు ‘మాట ఇచ్చావు’ తెలుసా? అంటే వాగ్దానం.

నీ ‘మాట’ జవదాటను, అంటే ఆదేశం పాటిస్తాను.

‘మాటలు’ జాగ్రత్తగా రానీ, అంటే అనవసరమైన వన్నీ మాట్లాడుతున్నారని.

పెద్దల ‘మాట’ చద్ది మూట, అంటే మంచి సలహా అని.

నీ ‘మాటల్లో’ ఏదో తేడా కనిపిస్తుంది, అంటే ఇంతకు ముందు ఎప్పుడూ అలా మాట్లడలేదని అర్థం.

‘మాటకు మాట’ జవాబు ఇస్తున్నావు ఎందుకు? ఎదురు తిరుగుతున్నావని అర్థం.

‘వాడికి అసలు మాట్లాడటానికి రాదు తెలుసా?’‘వాడు మాట్లాడితే ఒక్క ముక్క అర్థం కాదు’
అంటే కమ్యూనికేషన్ తెలియదు అని అర్థం

వాళ్ళిద్దరి మధ్య ‘కమ్యూనికేషన్ గ్యాప్’ వచ్చింది అని ఎవరైనా అనుకుంటే, వాళ్ళ మధ్య మాటలు లేవు అని అర్థం.

‘Speech is silver; silence is gold’అని ఒక ఆంగ్ల సామెత. అయితే, మాట్లాడ వలసిన చోట మాట్లాడక పోవడం ఎంత తప్పో, మాట్లాడుకూడని చోట మాట్లాడడం కూడా అంతే తప్పు. అందుకే అంటారు ‘ఆచితూచి మాట్లాడాలి’ అని. ఒక్కోసారి కొన్ని చోట్ల ‘మౌనం’గా ఉండడం ఎంతో ఉత్తమం.

కమ్యూనికేషన్ లో అంత ప్రాధాన్యత ఉన్న మాట గురించి నా మిత్రులు డాక్టర్ పోతన ఇటీవల చాలా చక్కగా రాసిన ఒక గేయంతో ముగిస్తాను.

మాట గురించి మధ్యకాలంలో వచ్చిన నా చాలా చక్కని పాట ఇది.

“మాట మాటకు ఒక అర్థం ఉన్నది
మాటల్లోనే మనిషి బతుకు చిత్రం ఉన్నది
సూటిపోటి మాట దాన్ని కాటు ఎంత ఘాటు
సూది లాంటి మాట, దాని చూపు ఎంతో చేటు
మాట మలినమైతే దాని గుండె నల్లగుండు
మాట తెల్లగుంటే, దాని మనసు వెన్నెల సొగసు
నక్కజిత్తుల మాట దాని చేత కుట్రల మూట
పగలు రగిలే మాట దాని మీసం కత్తుల కోట
మాట కక్ష కడితే దాని నడక పాముపడగ
మాట మధురమైతే దాని గుణం మీగడ తరగ
మాట మౌనం అయితే దాని ఎత్తు ఆకాశమంత
మాట గుంభనమైతే దాని లోతు పాతాళ మంత
మాట మూగబోతే దాని బాధ చెప్పతరమా
మాట కమ్మగుంటే దాని గానం మోహనరాగం

మాట మనిషి నేస్తం మాట మనిషి నైజం
మాట మనిషి భుక్తి ఆమాటే సర్వశక్తి
మాట మంచిగుంటే మనిషి తోడుగుంటాడు
కాని మాట అయితే ఆ మనిషే దూరమవుతాడు”

మాట గురించి మధ్యకాలంలో వచ్చిన నా చాలా చక్కని పాట ఇది.

SWORD (కత్తి) WORDS (మాటలు). ఈ రెండు పదాల అక్షరాలు ఒకటే. రెండూ కోసుకుంటాయి. అందుకే జాగ్రత్తగా వాడాలి.

ఇక్కడ ముక్తాయింపు గా ఒక విషయం చెప్తాను.

SWORD (కత్తి) WORDS (మాటలు). ఈ రెండు పదాల అక్షరాలు ఒకటే. రెండూ కోసుకుంటాయి. అందుకే జాగ్రత్తగా వాడాలి.

కత్తితో చేసిన గాయం మానిపోతుందే మోగానీ, మాట చేసిన గాయం మానదు. అందుకే కమ్యూనికేషన్ లో మాటకు ఎంతో ప్రాధాన్యత ఉంది.

కమ్యూనికేషన్ ఎలా ఉండాలి అన్న దాని గురించి మరోసారి చూద్దాం.

More articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -

Latest article